Investment: పెట్టుబడుల్లో డెట్ తప్పనిసరి.. 60/40 రూల్ గురించి తప్పక తెలుసుకోండి..
Debt Investment: మనలో చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు తక్కువ రాబడి వస్తుందని డెట్ పెట్టుబడులపై ఆసక్తి చూపరు. అయితే చాలా మంది పెద్ద పెట్టుబడిదారులు, హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్లు వీటి నుంచి స్థిరమైన ఆదాయాన్ని పొందుతుంటారు. వీటిని ఎందుకు పోర్ట్ ఫోలియోలో చేర్చుకోవాలో 5 కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఆర్థిక అస్థిరతలు ఉన్న సమయంలో ప్రధానంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతుంటాయి. దీనివల్ల స్టాక్ మార్కెట్లలో వచ్చిన లాభాలు కరెక్షన్ సమయంలో ఆవిరైపోతుంటాయి. అందువల్ల స్థిరమైన రాబడికోసం కొంత భాగాన్ని డెట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తుంటారు. కార్పొరేట్ బాండ్లు, ప్రభుత్వ డెట్ ఇన్‌స్ట్రుమెంట్లు తప్పక ఉంచుకోవాలి. ఉదాహరణకు కరోనా వంటి మహమ్మారి ప్రపంచాన్ని కమ్మేసిన సమయంలో స్టాక్ మార్కెట్లు పాతాళానికి చేరుకున్నాయి. అలాంటి సమయంలో స్థిరమైన రాబడిని డెట్ పెట్టుబడి పథకాలు అందించాయి. ఇవి వడ్డీ ఆదాయాన్ని కాలానుగుణంగా అందిస్తుంటాయి.

కేవలం ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టకుండా.. డెట్ ఈక్విటీల్లో కలిపి పెట్టుబడి పెట్టడం మెుత్తం పెట్టుబడి సొమ్ముకు స్థిరత్వాన్ని అందిస్తుంది. అందువల్ల చాలా మంది నిపుణులు ఈక్విటీల్లో 60 శాతాన్ని ఉంచి మిగిన మెుత్తాన్ని డెట్‌కు కేటాయించాలని సూచిస్తుంటారు. ప్రపంచ మార్కెట్లలో అస్థిరతలు, పాలసీ మార్పులు వంటి సమయాల్లో ఎకానమీ దిగజారినా ఇన్వెస్టర్లకు నష్టం తగ్గుతుంది.
మరో గుర్తించాల్సిన విషయం ఏమిటంటే.. డెట్ కుషన్ పెట్టుబడి మెుత్తానికి సేఫ్టీని అందిస్తుంది. దీనివల్ల మెుత్తం పెట్టుబడి సొమ్ము మార్కెట్లలో వచ్చే మార్పులు లేదా ఇతర అంశాల వల్ల ప్రభావితం కాదు. ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ సైతం మెుత్తం సొమ్మును ఒకే చోట పార్క్ చేయెుద్దని డైవర్సిఫై చేయాలని అనేక మార్పులు తన సూత్రాల్లో వెల్లడించారు. అందువల్ల రిస్క్ తక్కువగా ఉండే ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి సురక్షితమైన రాబడులను అందించేందుకు ఉత్తమ ఎంపికల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు.
ముందుగా డబ్బును డెట్ పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి ముఖ్య కారణం స్థిరమైన రాబడులు. చాలా మంది తక్కువ రాబడి వచ్చినా రిస్క్ తక్కువగా ఉండాలని భావిస్తుంటారు. అలా సమయానికి రిటర్న్స్ ఆశించేవారికి డెట్ ఒక ఉత్తమ పెట్టుబడి మార్గం.
ఇక చివరిగా డెట్ పథకాలను ద్రవ్యోల్బణం నుంచి సంపద విలువను కాపాడుకునేందుకు వినియోగిస్తారు. కొన్ని ద్రవ్యోల్బణానికి లింక్ చేయబడిన బాండ్స్ ఇందులో పెట్టుబడిదారులకు సురక్షతను అందిస్తాయి. వారి డబ్బు విలువ తగ్గకుండా అందుకు తగిన రాబడిని అందిస్తాయి. ద్రవ్యోల్బణం రేట్లు అనూహ్యంగా ఉండే భారతీయ పెట్టుబడిదారులకు, డెట్ సాధనాలను పోర్ట్‌ఫోలియోలో చేర్చడం కొనుగోలు శక్తిని కాపాడుకోవడానికి ఒక వ్యూహాత్మక చర్యగా చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications