Gold Loans:బంగారంతో మన దేశంలో సామాజిక, ఆర్థికంగా చాలా ముఖ్యమైన పెట్టుబడి. లోతైన భావోద్వేగం కలిగిన విశ్వసనీయమైన పెట్టుబడి సాధనం కూడా. పండుగలు, వివాహాలు ఇలా అనేక సందర్భాల్లో మనం బంగారాన్ని ఆభరణాలు లేదా నాణేల రూపంలో ప్రజలు కొనుగోలు చేస్తుంటారు. పిల్లల చదువు, ఇంటి పునరుద్ధరణ, వ్యాపారంలో నిధుల అవసరం లేదా ఏదైనా వైద్యపరమైన అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు వినియోగించని ఆభరణాలను గోల్స్ లోన్స్ కోసం వినియోగించవచ్చు. దీనికి డాక్యుమెంటేషన్ అవసరాలు తక్కువగా ఉంటాయి. పైగా పర్సనల్ లోన్ కంటే గోల్డ్ లోన్స్ పై వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. అనేక సంస్థలు బంగారు రుణాలపై మంచి ఆఫర్లను అందిస్తున్నాయి. గోల్డ్ లోన్ తీసుకోవాలనుకునేవారు లోన్ మొత్తాన్ని గరిష్ఠంగా పెంచుకోవడానికి, అసెట్ భద్రంగా ఉండేలా చూసుకోవడానికి కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.

NBFC లేదా బ్యాంకులో గోల్డ్ లోన్:
బయట మార్వాడీలు, తాకట్టు దుకాణాల్లో సులవుగా గోల్డ్ లోన్ లభిస్తున్నప్పటికీ అది సేఫ్ కాదు. బంగారు రుణాన్ని పొందేందుకు బ్యాంక్ లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC)ని ఎంచుకోవడం ఉత్తమం. ఎందుకంటే.. అవి సురక్షితమైన ఎంపికగా పరిగణించబడతాయి. గోల్డ్ లోన్ అనేది ఒక సెక్యూర్డ్ లోన్. చాలా సందర్భాల్లో NBFCలు గోల్డ్ లోన్ బ్యాంకుల కంటే తక్కువ వడ్డీ రేటు లేదా తక్కువ ప్రాసెసింగ్ ఫీజులతో అందిస్తుంటాయి.

బంగారం వాల్యుయేషన్:
మంజూరయ్యే గోల్డ్ లోన్ మొత్తం అసెట్ వాల్యుయేషన్‌పై ఆధారపడి ఉంటుంది. బంగారు ఆభరణాలపై లోన్ పొందేటప్పుడు.. బ్యాంకులు కేవలం బంగారం ధరను మాత్రమే పరిగణలోకి తీసుకుంటాయి. ఆభరణాల్లోని రాళ్లను పరిగణలోకి తీసుకోవు. స్వచ్ఛమైన నాణ్యత కలిగిన బంగారం మీకు అధిక వాల్యుయేషన్, అధిక రుణ మొత్తాన్ని అందిస్తుంది. సాధారణంగా 18 నుంచి 24 క్యారెట్ల బంగారంపై మాత్రమే లోన్స్ అందిస్తుంటాయి. లోన్-టు-వాల్యూ (LTV) నిష్పత్తిని తనిఖీ చేసుకోండి. సాధారణంగా ఇది 60 శాతం నుంచి 90 శాతం వరకు ఉంటుంది. అంటే దీనికి అర్థం మీరు లక్ష రూపాయలు విలువైన బంగారంపై LTV.. 80 ఉన్నట్లయితే, మీకు రూ.80 వేల లోన్ వస్తుంది.

వడ్డీ రేటు:
గోల్డ్ లోన్ అందించే కంపెనీ మీ రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా బంగారు రుణ వడ్డీ రేటును నిర్ణయిస్తారు. మీ రిస్క్ అసెస్‌మెంట్ ఆధారంగా రేట్లు 7 శాతం నుంచి 25 శాతం వరకు ఉండవచ్చు. వడ్డీ రేటును నిర్ణయించడంలో దోహదపడే రుణ మొత్తం, తిరిగి చెల్లించే వ్యవధి, LTV మొదలైన ఇతర అంశాలు ఉన్నాయి. సాధ్యమైనంత బెస్ట్ డీల్ పొందడానికి మార్కెట్లోని వివిధ కంపెనీల గోల్డ్ లోన్ రేట్లను పరిశీలించాలి. దీనికి తోడు ప్రాసెసింగ్ ఫీజులు మొదలైన ఇతర ఛార్జీలను తనిఖీ చేసుకోవాలి.

రీపేమెంట్ ఆఫ్షన్స్:
బంగారు రుణాన్ని తీసుకునేటప్పుడు పరిగణించవలసిన మరో ముఖ్యమైన అంశం రీపేమెంట్ ఆప్షన్స్. లోన్ అందించే సంస్థలు ఈఎంఐ ఆప్షన్ లేదా లోన్ వ్యవధిలో వడ్డీని మాత్రమే చెల్లించే విధానాన్ని ఎంచుకోవచ్చు. చివరిగా అసలు మెుత్తాన్ని చెల్లించవచ్చు. వినియోగదారులు తమ వీలును బట్టి వీటిని ఎంచుకోవచ్చు.

రీపేమెంట్ షెడ్యూల్:
గోల్డ్ లోన్‌లు సాధారణంగా ఒక వారం నుంచి కొన్ని సంవత్సరాల వరకు స్వల్పకాలిక రీపేమెంట్ షెడ్యూల్‌ను కలిగి ఉంటాయి. గోల్డ్ లోన్ తీసుకుంటున్నప్పుడు అత్యంత సౌకర్యవంతంగా ఉండే రీపేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోండి. రీపేమెంట్ కాలాన్ని ఎంచుకునేటప్పుడు మీ సాధారణ ఖర్చులు, ఇతర నగదు ల పరిగణించండి.

సకాలంలో చెల్లించకపోతే:
బంగారు రుణాన్ని తీసుకునేముందు గుర్తుంచుకోవలసిన అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. మీరు బకాయిలను సకాలంలో చెల్లించలేకపోతే ఏమి జరుగుతుందన్నదే. అటువంటి సందర్భాల్లో.. ఫైనాన్స్ కంపెనీ లేదా బ్యాంక్ మీ బంగారాన్ని వేలం వేయవచ్చు. ఒకవేళ మార్కెట్ పరిస్థితుల కారణంగా బంగారం ధర తగ్గితే.. LTV నిష్పత్తికి సరిపోయేలా అదనపు బంగారాన్ని డిపాజిట్ చేయమని మిమ్మల్ని అడగవచ్చు.
స్వల్పకాలిక, అత్యవసర అవసరాలకు గోల్డ్ లోన్స్ అనుకూలంగా ఉంటాయి. ఏదైనా ఆస్థిని కొనుగోలు చేయటం వంటి దీర్ఘకాలిక అవసరాల కోసం బంగారాన్ని తనఖా పెట్టి లోన్ తీసుకోవటం సరైనది కాదని నిపుణలు చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications