Bank Account: దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవం మెుదలైన తర్వాత ప్రజలు ఎక్కువగా యూపీఐ, కార్డ్ చెల్లింపులను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బ్యాంకులు సైతం ఆన్‌లైన్ లోనే కొత్త అకౌంట్లను జారీ చేసేస్తున్నాయి. ఇలా ప్రక్రియ మెుత్తం బ్యాంకులకు వెళ్లకుండానే జరిగిపోతోంది.
ఈ సౌకర్యం వల్ల చాలా మంది ప్రజలు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల వద్ద తమ ఖాతాలను తెరుస్తున్నారు. అయితే చాలా సమయాన్ని ఒక్క ఖాతానే వినియోగిస్తున్నప్పటికీ మిగిలిన బ్యాంక్ ఖాతాలు అనవసరంగా కొనసాగుతుంటాయి. రోజువారీ పని జీవితంలో చాలా మంది ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. అయితే ఇలా వినియోగంలో లేని ఖాతాలా వల్ల ఉండే సమస్యల గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిందే.

- ఉపయోగంలో లేని బ్యాంకు ఖాతాలతో మనం భారీ మోసానికి గురయ్యే అవకాశం ఉందని గుర్తుంచుకోండి. అవి మిమ్మల్ని కొన్ని చట్టపరమైన సమస్యలకు సమాధానం ఇవ్వవలసిన పరిస్థితిని కల్పిస్తుంటాయి. దీనికి తోడు బ్యాంకులు వినియోగించని ఖాతాలకు మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే భారీగా పెనాల్టీలు విధిస్తుంటాయి. మరికొన్ని సార్లు ఆ ఖాతాలను తాత్కాలికంగా మూసివేసి హోల్డ్‌లో ఉంచుతుంటాయి.
- ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నేటి రోజుల్లో సైబర్ మోసాలు భారీగా పెరిగిన వేళ.. హ్యాకర్లు మనీలాండరింగ్‌లో పాల్గొనడానికి ఉపయోగించని ఖాతాలను వినియోగించేందుకు టార్గెట్ చేస్తుంటారని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఇలా జరిగితే ఆ ఖాతాదారులు సదరు తప్పులకు సంజయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అందువల్ల మీరు చేయని ట్రాన్సాక్షన్స్ గురించి వెంటనే బ్యాంకులకు వెల్లడించాలి.
- కొందరు బ్యాంకుల నుంచి లోన్ తీసుకుని చెల్లింపులు చేయకుండా ఆ ఖాతాలను వదిలేస్తుంటారు. ఇది పరోక్షంగా వారిని బ్యాడ్ లోన్ జాబితాలో చేర్చటంతో పాటు వారి క్రెడిట్ స్కోర్ తగ్గింపుకు దారితీస్తుంది. హోమ్ లోన్ తీసుకున్నట్లయితే బ్యాంకులు వాటిని స్వాధీనం చేసుకునే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోండి.
- మీ ఖాతాలోకి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి డబ్బు వచ్చినా లేదా మీ ప్రమేయం లేని ఇతర ట్రాన్సాక్షన్స్ జరిగినా వెంటనే బ్యాంకకు ఆ ఖాతాకు సంబంధించిన వివరాలు తెలపాలి. అందువల్ల ఇలా తలెత్తే అనేక సమస్యల నుంచి విముక్తి పొందాలంటే వాడకంలో లేని బ్యాంక్ ఖాతాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే క్లోజ్ చేయటం ఉత్తమం. ఇది మీ డబ్బును వృధా కాకుండా కాపాడటంతో పాటు ఇతర సమస్యల్లో ఇరుక్కోకుండా ఉపకరిస్తుంది. కాబట్టి బ్యాంకులకు వెళ్లి మీ ఉపయోగించని బ్యాంకు ఖాతాలను డీ-యాక్టివేట్ చేసి మూసేయటం మంచిది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications