Income Tax Refund: పన్ను రిటర్న్ క్లెయిమ్ కోసం కొత్త మార్గదర్శకాలు ఇవే.. సీబీడీటీ వెల్లడి..
Tax Refund Claim: దేశంలో అధిక ఆదాయంతో పన్ను శాఖ ప్రకటించిన శ్లాబ్ రేట్లకు అనుగుణంగా తమ రిటర్న్ ఫైల్ చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది పాతపన్న పరిపాలనలో ఉన్న రిఫండ్స్, క్లెయిమ్స్ పొందేందుకు దాని ప్రకారం రిటర్న్ ఫైల్ చేస్తున్నారు. ఈ క్రమంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ నుంచి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
ఆదాయపు పన్ను శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్, రీఫండ్‌ల కోసం క్లెయిమ్‌లను కలిగి ఉన్న ఆదాయపు పన్ను రిటర్న్‌లను సమర్పించడంలో జాప్యానికి క్షమాపణ ఇచ్చే ప్రక్రియను వివరిస్తూ ఇటీవల నవీకరించబడిన నిబంధనలను విడుదల చేసింది.

మొత్తాల ఆధారంగా క్లెయిమ్‌లను ఆమోదించే లేదా తిరస్కరించే అధికారం రూ. కోటి వరకు ఉండే క్లెయిమ్‌లను ఇన్‌కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమీషనర్లు నిర్ణయిస్తారు. అలాగే కోటి నుంచి రూ.3 కోట్ల మధ్య వచ్చే క్లెయిమ్‌లు చీఫ్ కమిషనర్ల అధికార పరిధిలో ఉంటాయి. ఇక రూ.3 కోట్ల కంటే ఎక్కువ క్లెయిమ్స్ విషయంలో అధికారం ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్లకు ఇవ్వబడింది. ఇదే క్రమంలో బెంగళూరు సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ నిర్ణీత కాలపరిమితి కంటే ఆలస్యం అయిన ITR-V ఫారమ్‌ల ధృవీకరణకు సంబంధించిన దరఖాస్తులను ప్రాసెస్ చేసే అధికారం కలిగి ఉంది.
ఆదాయపు పన్ను చెల్లింపుదారులు తమ టాక్స్ వాపసు క్లెయిమ్ లేదా నష్టాల క్లెయిమ్ కోసం అసెస్‌మెంట్ సంవత్సరం ముగిసిన నాటి నుంచి 5 సంవత్సరాలలోపు క్షమాపణ దరఖాస్తులను సమర్పించాలి. ఈ నిబంధన అక్టోబర్ 1, 2024 తర్వాత సమర్పించబడిన దరఖాస్తులకు వర్తిస్తుందని సీబీడీటీ వెల్లడించింది. అయితే ఈ దరఖాస్తులను అధికారులు ఆరు నెలల్లోపు ప్రాసెస్ చేయాలని లక్ష్యంగా నిర్థేశించబడింది. రిటర్న్ ఆమోదించబడాలంటే పన్ను చెల్లింపుదారులు సదరు ఆలస్యానికి చట్టబద్ధమైన సమర్థనను చూపాల్సి ఉంటుందని. ఈ విషయంలో నిజానిజాలు తెలుసుకోవటానికి అవసరమనిపిస్తే పరిశీలనకు స్థానిక పన్ను అధికారిని కేటాయించవచ్చు.
కోర్టు ఆర్డర్ కారణంగా వాపసు జారీ చేయబడిన సందర్భాల్లో వాపసు క్లెయిమ్‌ల కోసం 5 సంవత్సరాల పరిమితిలో కేసు కోర్టు పరిశీలనలో ఉన్న సమయాన్ని కలిగి ఉండదు. క్షమాపణను అభ్యర్థించడానికి పన్ను చెల్లింపుదారులు కోర్టు ఉత్తర్వులు వెలువడిన తేదీ నుండి ఆరు నెలల వరకు అనుమతించబడతారు. ఇక్కడ పన్ను రిటర్న్ ఫైల్ చేసిన వ్యక్తులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆలస్యమైన వాపసు క్లెయిమ్‌లపై వడ్డీ చెల్లించబడదు. అందువల్ల కొత్తగా అమలులోకి వస్తున్న మార్గదర్శాలను ఇకపై పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications