Investment Planning: 10 ఏళ్లలో రూ.50 లక్షలు ఆదా చేయాలనుకుంటున్నారా.. అయితే ఇలా ప్లాన్ చేసుకోంది..
Investment Planning: 10 సంవత్సరాల్లో 50 లక్షల కార్పస్ సేవ్ చేయటం అంటే కొంత కష్టంతో కూడుకున్న అంశమే. కానీ.. ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకుంటే ఇదేమీ కష్టం కాదంటున్నారు నిపుణులు. అయితే ఇందుకోసం నెలకు ఎంత పెట్టుబడి పెట్టవచ్చు? దేనిలో పెట్టుబడి పెట్టాలి? వంటి విషయాలను తెలుసుకుందాం..

పెట్టుబడి ఎంపికలు..
ప్రస్తుతం 35 ఏళ్ల రవి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్, నేషనల్ పెన్షన్ స్కీమ్ వంటి వివిధ పథకాల్లో పెట్టుబడి పెట్టారనుకుందాం. అయితే.. 10 సంవత్సరాల్లో అతని కుమార్తె ఉన్నత చదువు కోసం రూ. 50 లక్షల కావాలని భావిస్తున్నాడు. కాబట్టి.. తాను దేనిలో పెట్టుబడి పెట్టాలి? ఎంత పెట్టుబడి పెట్టాలి? SIP సరైనదేనా అనే గందరగోళంలో అతను ఉన్నాడు.

SIP పెట్టుబడులు..
దీర్ఘకాలంలో భారీ కార్పస్‌ని సాధించడానికి సిప్ సరైన మార్గం. కాబట్టి మీరు SIP రూపంలో పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచించడం సరైనదే. ఈ పద్ధతి ద్వారా 10 సంవత్సరాల్లో మీరు లక్ష్యంగా పెట్టుకున్న కార్పస్‌ను చేరుకోవడానికి ఇది ఉపకరిస్తుందని నిపుణులు అంటున్నారు.

మ్యూచువల్ ఫండ్స్..
మ్యూచువల్ ఫండ్స్ సాధారణంగా పెద్ద కార్పస్ లక్ష్యాలను సాధించడానికి సరైన మార్గనిర్ధేశకంగా నిలుస్తాయి. కాబట్టి.. SIP పెట్టుబడి పెట్టడాన్ని పరిగణికల ఉత్తమ ఫలితాలను అందిస్తాయి. ఏడాదికి 12% రాబడిని పరిగణలోకి తీసుకున్నట్లయితే.. పది సంవత్సరాల తరువాత డబ్బు అవసరమైతే నెలకు రూ.4,500 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది.

ఆదాయం ఎంత వస్తుంది..
మీరు 10 ఏళ్ల పాటు నెలకు రూ.4,500 పెట్టుబడిగా పెడితే.. మీరు మొత్తం రూ.10,45,526 లక్షల కార్పస్ పొందుతారు. ఇక్కడ మీరు రూ.5,40,000 పెట్టుబడి రూపంలో పెట్టగా.. రూ.5,05,526 లక్షల రాబడి వస్తుంది. ఇలా మీ లక్ష్యం రూ.50 లక్షలు అయితే దానికి తగినట్లుగా మీరు ప్రతి నెల సిప్ మెుత్తాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. ఇదే సమయంలో మీరు పెరుగుతున్న ద్రవ్యోల్పణాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి.

వేటిలో ఇన్వెస్ట్ చేయవచ్చు..?
సేవింగ్స్ లక్ష్యాలను చేరుకోవటానికి.. లార్జ్ క్యాప్ & మిడ్ క్యాప్, ప్లెక్సీ క్యాప్ ఫండ్, మిడ్ క్యాప్ ఫండ్‌తో సహా ఇతర ఫండ్‌లను పరిగణలోకి తీసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లల విద్య కోసం.. టాటా యంగ్ సిటిజన్స్ ఫండ్, SBI మాగ్నమ్ చిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్, HDFC చిల్డ్రన్స్ గిల్డ్ ఫండ్, యాక్సిస్ చిల్డ్రన్స్ గిల్డ్ ఫండ్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టవచ్చు. వీటితో పాటు ఫిక్స్ డ్ ఆదాయాన్ని అందించే పోస్టల్ స్కీమ్స్ కూడా పెట్టుబడికి అనువైనవే. పైన పేర్కొన్న వివరాలను నిపుణులు సిఫార్సు చేసినప్పటికీ.. అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం మీరే.