For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Loan: PAN కార్డ్‌తో సులభంగా లోన్ పొందవచ్చు.. ఎలాగో ఇప్పుడు తెలుసుకోండి..

|

Loan: కష్ట సమయాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవటానికి పర్సనల్ లోన్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కానీ.. కొన్నిసార్లు పర్సనల్ లోన్ పొందడానికి చాలా శ్రమపడాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో.. పాన్ కార్డు ఈ పనిని సులభతరం చేస్తుంది. మీరు పాన్ కార్డ్ సహాయంతో రూ.50,000 వరకు లోన్ పొందవచ్చు. ప్రస్తుతం చాలా బ్యాంకులు పాన్ కార్డు ద్వారా రుణాలు ఇస్తున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

 కీలకంగా పాన్ కార్డ్..

కీలకంగా పాన్ కార్డ్..

ప్రస్తుతం సమయంలో.. ఆర్థిక విషయాలకు సంబంధించిన ఎలాంటి పని పూర్తిచేయాలన్నా పాన్ కార్డ్ తప్పక అవసరం. బ్యాంకులో ఖాతా తెరవడం నుంచి లోన్ తీసుకోవడం, ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడం వరకు పాన్ కార్డు కావాల్సిందే. బ్యాంకుల్లో భారీ లావాదేవీలు చేయడానికి కూడా పాన్ కార్డ్ అవసరమని గుర్తుంచుకోండి.

 సిబిల్ స్కోర్..

సిబిల్ స్కోర్..

PAN కార్డ్ వివరాల సహాయంతో బ్యాంకులు లేదా NBFCలు (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌లు) మీ CIBIL స్కోర్‌ను తనిఖీ చేస్తాయి. CBL స్కోర్ మీ గత లావాదేవీల వివరాలను బ్యాంక్ లేదా NBFCకి అందిస్తుంది. మీకు మంచి క్రెడిట్ హిస్టరీ రికార్డు ఉన్నట్లయితే.. మీ CBL స్కోర్ మెరుగుపడుతుంది.

సులభంగా లోన్..

సులభంగా లోన్..

పాన్ కార్డ్ సహాయంతో మంచి CBL స్కోర్ ఉన్నట్లయితే సులభంగా బ్యాంకులు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా రూ.50,000 వరకు రుణాన్ని అందిస్తాయి. పాన్ కార్డ్‌ ద్వారా ఎలాంటి తనఖా లేకుండా తీసుకునేవి అన్ సెక్యూర్డ్ లోన్ కేటగిరీ కిందకు వస్తాయి. అందువల్లనే పాన్ కార్డ్ ఆధారంగా భారీ మెుత్తంలో లోన్ ఇవ్వరు. అత్యవసర సమయాల్లో ఈ పర్సనల్ లోన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

లోన్ పొందటానికి అర్హత..

లోన్ పొందటానికి అర్హత..

పాన్ కార్డ్ సహాయంతో రుణం పొందడానికి, మీరు కొన్ని పత్రాలను సమర్పించాలి. లోన్ పొందడానికి మీకు కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి. మీరు కంపెనీలో పని చేసినా లేదా మీ స్వంత వ్యాపారం కలిగినా, మీ క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉండాలి. మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉంటేనే మీరు లోన్ పొందడానికి అర్హులవుతారు.

English summary

Loan: PAN కార్డ్‌తో సులభంగా లోన్ పొందవచ్చు.. ఎలాగో ఇప్పుడు తెలుసుకోండి.. | know how to get loan of 50000 rupees with pan card using cibil score with out any security

know how to get loan of 50000 rupees from banks and nbfc
Story first published: Monday, August 8, 2022, 13:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X