For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Free ఆధార్ సెంటర్ ఫ్రాంచైజీ.. ప్రతి నెలా భారీగా ఆదాయం.. ఛార్జీలు లేకుండానే..

|

Aadhaar Franchise: మీరు కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే.. మీకు అనేక ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. అయితే ప్రభుత్వంతో కూడా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇందులో మీరు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు.

లక్షల్లో సంపాదన..

లక్షల్లో సంపాదన..

ఆధార్ సెంటర్ ఫ్రాంచైజీ కోసం ఎలాంటి పెట్టుబడి లేకుండానే నెలలో లక్షల రూపాయలు సంపాదించవచ్చు. ఫ్రాంచైజీని తీసుకోవడం ద్వారా మంచి ఆదాయం వస్తుంది. పైగా ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్లు, ముందస్తు పెట్టుబడి అవసరం లేదు.

ఆధార్ కార్డ్ ఫ్రాంచైజీ

ఆధార్ కార్డ్ ఫ్రాంచైజీ

దేశంలో నివసించే ప్రతి పౌరుడికి ఆధార్ కార్డ్ కలిగి ఉండటం చాలా ముఖ్యం, ఆధార్ కార్డ్ ప్రస్తుతం చాలా ముఖ్యమైన పత్రాల్లో ఒకటిగా మారింది. ఈ కారణంగా దీనికి అధిక డిమాండ్ ఉంది. మీరు ఆధార్ కార్డ్‌ని ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే.. దీని కోసం మొదట మీరు UIDAI నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది. ఆపై మీకు సేవా కేంద్రాన్ని తెరవడానికి లైసెన్స్ ఇవ్వబడుతుంది. మీరు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నంబర్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయాలి. దీని తరువాత.. కామన్ సర్వీస్ సెంటర్ నుంచి రిజిస్ట్రర్ చేసుకోవలసి ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేయాలి..?

ఎలా దరఖాస్తు చేయాలి..?

మీరు ఆధార్ ఫ్రాంచైజీ లైసెన్స్ పొందడానికి.. ముందుగా NSEIT అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అక్కడ Create New Userపై క్లిక్ చేయాలి. అందులో క్లిక్ చేసిన తర్వాత కొత్త ఫైల్ ఓపెన్ అవుతుంది. దీనిలో మీరు షేర్ కోడ్‌ను నమోదు చేయమని అడుగుతారు. షేర్ కోడ్ కోసం.. మీరు ఆఫ్‌లైన్ ఈ-ఆధార్‌కి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్‌లోడ్ చేసిన తర్వాత.. మీరు xml ఫైల్, షేర్ కోడ్ రెండింటినీ డౌన్‌లోడ్ చేస్తారు.

తరువాతి ప్రక్రియ..

తరువాతి ప్రక్రియ..

దరఖాస్తు చేస్తున్నప్పుడు స్క్రీన్‌పై ఒక ఫారమ్ ఓపెన్ అవుతుంది. అందులో అడిగిన మొత్తం సమాచారాన్ని పూర్తి చేసి సబ్మిట్ చేయాలి. దీంతో యూజర్ ID, పాస్వర్డ్ మీ ఫోన్, ఈ-మెయిల్ కు వస్తాయి. వాటిని ఉపయోగించి ఆధార్ టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ పోర్టల్‌కి సులభంగా లాగిన్ కావచ్చు. ఆ తర్వాత మీకు కంటిన్యూ ఆప్షన్ కనిపిస్తుంది.. దానిపై క్లిక్ చేయండి. తరువాత ఓపెన్ ఆయిల్ ఫారమ్ లో అడిగిన సమాచారాన్ని అందించాలి. వివరాలు చెక్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేస్తే ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తరువాత వినియోగదారులకు మీరు సేవలను అందించటం ప్రారంభించవచ్చు.

English summary

Free ఆధార్ సెంటర్ ఫ్రాంచైజీ.. ప్రతి నెలా భారీగా ఆదాయం.. ఛార్జీలు లేకుండానే.. | know how to get free aadhaar centre franchise to earn income

know how to get free aadhaar centre franchise and earn regularly without paying any deposits ..
Story first published: Sunday, July 31, 2022, 13:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X