Ration Card: కొన్ని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అందించే రేషన్ కార్డులో మార్పులు చేయవలసి వస్తుంటుంది. అయితే ఇంట్లో ఎవరైనా మరణించినా, కొత్త సభ్యలను యాడ్ చేయాలన్నా, పెళ్లి తరువాత మార్పులు చేసుకోవాలన్నా ఇలా అనేక కారణాల వల్ల మార్పులు చేర్పులు అవసరం సర్వసాధారణం. ఇలా మార్పులు చేర్పులు చేసుకోవటం కొంత కష్టంగా కూడుకున్నవే. అయితే వీటిని సులువుగా కూడా చేసుకోవచ్చు.

ప్రభుత్వం ఊరట..
అసలు ప్రభుత్వ అధికారులతో లేదా ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు పూర్తి కావటం అంటే అది అంత సులువు కాదు. తిరగ్గా తిరగ్గా ఎప్పటికో అవుతాయి. ఇకపై ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ప్రజలు తమ ఇళ్లలో కూర్చునే ఇకపై ఇలాంటి పనులను పూర్తి చేయటానికి అవకాశం రాబోతోంది. ఇందుకోసం ప్రభుత్వం కూడా తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రానున్న కాలంలో ప్రజలు ఇళ్ల నుంచే తమ పనులను ఎక్కడినుంచైనా చేసుకోవచ్చు.

కాళ్లరిగేలా తిరగకుండానే..
అద్దె ఇళ్లలో నివాసం ఉండే ప్రజలు తరచుగా తమ అడ్రస్ మార్పు కోసం నమోదు చేసుకుంటుంటారు. వీటిని అప్ డేట్ చేసుకోకపోతే ప్రభుత్వం అందించే వివిధ స్కీమ్స్ లబ్ధి పొందటం కుదరదు. అందువల్ల మార్పులు చేసుకోవటం కోసం సచివాలయం, తహసీల్దార్ కార్యాలయం తిరగాల్సి రావటం.. అవి ఎప్పుడు అప్ డేట్ అవుతాయో తెలియదు. ఇకపై ఇలాంటి సమస్య తలెత్తకపోవచ్చని తెలుస్తోంది.

దరఖాస్తు ఇలా..
దరఖాస్తు కోసం ముందుగా లబ్ధిదారుడు పరిధిలోని వార్డు, గ్రామ సచివాలయాలకు వెళ్లి కార్డులో చిరునామా మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. అందుకోసం ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్ పత్రాలను అందించాలి. ఆధార్‌లో పాత చిరునామా ఉంటే.. అందుకోసం ముందుగా దాన్ని ఆధార్ కేంద్రానికి వెళ్లి మార్చుకున్న తరువాతే సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. సచివాలయ సిబ్బంది వివరాలను అప్‌లోడ్ చేయడంతో కొత్త చిరునామాతో తహసీల్దార్ లాగిన్‌కి వెళుతోంది..అలా ఎమ్మార్వొ ఆఫీస్ నుంచి కొత్త చిరునామాతో రేషన్ కార్డును పొందవచ్చు.

రేషన్ కార్డు నుంచి పేరు తొలగింపు..
ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించినట్లయితే వారి పేరును రేషన్ కార్డ్ నుంచి తొలగించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు వారి మరణ ధృవీకరణ పత్రాన్ని దరఖాస్తుతో పాటు సమర్పించాలి. అదే వివహం కారణంగా ఎవరి పేరైనా రేషన్‌కార్డులో తొలగించవలసి వస్తే.. దరఖాస్తుతో పాటు వివాహ ధృవీకరణ పత్రాన్ని ఇవ్వాలి. దీని కోసం దరఖాస్తు ఫారమ్ ఆన్‌లైన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు .


Click it and Unblock the Notifications