Sukanya Samriddhi Yojana: ఈ సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లలు ఉన్న వారందరికీ సుపరిచితం. బాలికల భవిష్యత్తు రక్షణ కోసం ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకాన్ని 10 ఏళ్లలోపు పిల్లల పేరుపై సులువుగా ప్రారంభించవచ్చు. స్కీమును దేశంలోని పోస్టాఫీసుల నుంచి బ్యాంకుల వరకు అన్ని చోట్ల ఓపెన్ చేసేందుకు వెసులుబాటు అందించబడింది.
స్కీమ్ కింద 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి. ఆడపిల్లలు 21 ఏళ్లు దాటినప్పుడు సొమ్మును విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో సదరు బాలికపేపుపై తెరచిన ఖాతాలో ఏడాదికి కనీసం రూ.250 నుంచి గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇది అద్భుతమైన వడ్డీ ఆదాయంతో పాటు మంచి కార్పస్ బిల్డ్ చేసేందుకు సహాయపడుతుంది. మీరు కుమార్తె కోసం ఇప్పటికే ఈ ఖాతాను తెరిచి ఉంటే లేదా మీరు కొన్ని కారణాల వల్ల బదిలీ చేసినట్లయితే, మీ ప్రస్తుత సుకన్య సమృద్ధి యోజన ఖాతాను కూడా బదిలీ చేయడానికి అవకాశం ఉంది.

మీరు మీ ప్రస్తుత సుకన్య సమృద్ధి యోజన ఖాతాను మీరు పోస్టాఫీసులో లేదా బ్యాంకులో ఉంచుకున్నా దాన్ని మార్చుకోవచ్చు. ఖాతాను ప్రస్తుత పోస్టాఫీసు శాఖ నుంచి మరొక పోస్టాఫీసు శాఖకు బదిలీ చేయవచ్చు. అలాగే ప్రస్తుత బ్యాంక్ బ్రాంచ్ నుంచి మరొక బ్యాంక్ బ్రాంచ్‌కి మారవచ్చు. అదేవిధంగా మీరు మీ సుకన్య సమృద్ధి యోజన ఖాతాను పోస్టాఫీసుల నుంచి బ్యాంకులకు, బ్యాంక్ నుంచి పోస్టాఫీసులకు సులభంగా బదిలీ చేయవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు స్టెప్స్ వారీగా కింద అందించబడ్డాయి.
SSY ఖాతా బదిలీకి పాటించాల్సిన విధానం..
Step 1: మీరు ఇప్పటికే తెరిచిన ఖాతా KYC పత్రాలతో బ్యాంక్ లేదా పోస్టాఫీసుకు వెళ్లాలి.
Step 2: మీకు ఖాతా ఉన్న బ్యాంక్ లేదా పోస్టాఫీసు నుంచి ఖాతా బదిలీ దరఖాస్తును తీసుకుని దానిని జాగ్రత్తగా పూరించండి.
Step 3: అప్లికేషన్‌లో సుకన్య ఖాతాను మార్చాలనుకుంటున్న కొత్త బ్యాంక్ లేదా పోస్టాఫీసు పేరు, చిరునామాను పూరించాలి.
Step 4: వారు మీ దరఖాస్తును ధృవీకరించి. ఖాతా బదిలీ ప్రక్రియ ద్వారా బదిలీ చేస్తారు. దీని కోసం ఖాతాకు సంబంధించిన పత్రాలను మీరు బదిలీ చేయాల్సిన శాఖకు పంపాలి.
Step 5: మీ ఖాతా సంబంధిత పత్రాలు, వివరాలు కొత్త బ్యాంక్‌కి చేరుకున్న తర్వాత ఖాతా ప్రారంభ ప్రక్రియలు ప్రారంభించబడతాయి.
Step 6: దీన్ని అనుసరించి మీ ఖాతా కొత్త బ్యాంక్ లేదా పోస్టాఫీసులో మళ్లీ తెరవబడుతుంది. దీని కోసం మళ్లీ తాజా దరఖాస్తు ఫారమ్‌లు, KYC పత్రాలను సమర్పించాలి. ఆ తర్వాత బ్యాంక్ మీ పత్రాలను ధృవీకరించిన తర్వాత మీ ఖాతా విజయవంతంగా బదిలీ చేయబడుతుంది.
ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. తల్లిదండ్రులు తమ కుమార్తెల పేరుపై సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ఆన్‌లైన్‌లో తెరవడానికి లేదా మార్చడానికి ప్రస్తుతం వెసులుబాటు కల్పించబడలేదు. అయితే ఖాతా తెరిచిన తర్వాత ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేయవచ్చు.


Click it and Unblock the Notifications