PAN Card News: ప్రస్తుత కాలంలో అన్ని సేవలను డిజిటల్ చేస్తున్న సమయంలో ప్రజల ఖర్చులను ట్రాక్ చేసేందుకు భారత ప్రభుత్వం పాన్ వివరాలు తప్పనిసరిగా మార్చిందే. పెద్ద మెుత్తంలో డబ్బు ఖర్చు చేయాలన్నా లేదా ట్రాన్స్‌ఫర్ చేయాలన్నా పాన్ వివరాలు అందించటం తప్పనిసరిగా మారిపోయింది. పైగా పాన్ కార్డును పెట్టుబడులకు సైతం తప్పనిసరిగా మార్చేన సంగతి తెలిసిందే.
దీంతో ప్రజలకు పాన్ కార్డ్ అత్యంత ముఖ్యమైన కార్డుగా మారిపోవటంతో దానిని పొందేందుకు సంక్లిష్టత సైతం ప్రస్తుతం తగ్గించబడింది. బ్యాంక్ ఖాతా కావాలన్నా, ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలన్నా లేదా ప్రభుత్వ పథకాలను పొందటానికైనా పాన్ కార్డ్ కీలక పత్రంగా మారిపోయింది. అందువల్ల దీనిని ఇప్పుడు ఆన్‌లైన్‌లో సులభంగా దరఖాస్తు చేసుకుని ఇంటివద్ద నుంచే పొందవచ్చు. దీనికోసం గతంలో మాదిరిగా భౌతికంగా ఏదైనా కార్యాలయాలను వెళ్లాల్సిన అవసరం లేదు. పాన్ కార్డ్‌ను పొందడం కోసం ఆన్‌లైన్ ప్రక్రియను గమనిస్తే..

పాన్ కార్డ్ ఆన్‌లైన్ దరఖాస్తుకు అవసరమైన పత్రాల వివరాలు:
- ఆధార్ కార్డ్
- ఓటరు ఐడీ
- ఫారం-6
- పాస్‌పోర్ట్ సైజు ఫోటో
- సంతకం
- మొబైల్ నంబర్
- ఈ-మెయిల్ ఐడీ
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ:
భారత ప్రభుత్వం రెండు ప్రధాన ఏజెన్సీలైన నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL), UTI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ లిమిటెడ్(UTIITSL) ద్వారా పాన్ కార్డ్‌ల కోసం ఆన్‌లైన్ దరఖాస్తును సులభతరం చేసింది.
1. పాన్ కార్డ్ కోసం దరఖాస్తుదారులు ముందుగా NSDL లేదా UTIITSL అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
2. అక్కడ హోమ్‌పేజీలో కొత్త పాన్ కోసం దరఖాస్తు ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
3. స్కీన్ మీద ఫారం 6 కనిపిస్తుంది. అందులో అడిగిన వివరాలను ఖచ్చితంగా పూరించాలి. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే సరైన సమాచారం అందించటం ఉత్తమం.
4. దీని తర్వాత మీ ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంతకంతో సహా అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
5. ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసినందుకు రుసుములను డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ వంటి వివిధ ఆన్‌లైన్ చెల్లింపు వ్యవస్థల ద్వారా పూర్తి చేయాలి.
6. చెల్లింపు విజయవంతంగా పూర్తైన తర్వాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి. అప్లికేషన్ స్థితిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునేందుకు వీలుగా అప్లికేషన్ నంబర్ స్కీన్ పై అందించబడుంది. దీనిని సేవ్ చేసుకోండి.
పాన్ కార్డ్‌ని ట్రాకింగ్, డౌన్‌లోడ్ చేయడం:
1. పాన్ కార్డ్ స్టేటస్ తెలుసుకునేందుకు NSDL లేదా UTIITSL అధికారిక వెబ్‌సైట్‌కి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది.
2. మెయిన్ పేజీలో "డౌన్‌లోడ్ పాన్ కార్డ్" ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
3. అక్కడ అడిగిన ఆధార్ వివరాలను అందించండి.
4. ఓటీపీ ద్వారా వివరాలను యాక్సెస్ చేసేందుకు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపబడిన ఆరు అంకెల OTPని నమోదు చేయండి.
5. ఓటీపీ ద్వారా ధృవీకరణ పూర్తైన తర్వాత పాన్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఆప్షన్ కనిపిస్తుంది. అలా డిజిటల్ రూపంలో మీరు పాన్ వివరాలను ఇంటివద్ద నుంచే పొందవచ్చు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!



Click it and Unblock the Notifications