Crorepathi Ideas: మనలో చాలా మంది కోటీశ్వరులుగా మారాలంటే ఇన్వెస్ట్ చేయటానికి సరైన మార్గంగా మ్యూచువల్ ఫండ్స్ పనికొస్తాయని చాలా మంది భావిస్తుంటారు. వీటిలో ఎస్ఐపీల రూపంలో కాలానుగుణంగా క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే తప్పక కోటీశ్వరులుగా మారేందుకు అవకాశం ఉందని నిపుణులు సూచిస్తూ ఉంటారు.
అయితే మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల మార్గంలో వెల్లటం చాలా పనితో కూడుకున్నదిగా నిపుణులు చెబుతున్నారు. ముందుగా సరైన ఫండ్స్ ఎంపిక నుంచి పేమెంట్స్ బౌన్స్ కాకుండా ప్రతినెల సమయానికి ఎస్ఐపీ మెుత్తం చెల్లింపులు, టాక్స్ ఫైలింగ్స్ వంటి అనేక విషయాలు దీనిలో ముడిపడి ఉంటాయని చాలా మందికి ప్రారంభంలో తెలియవు. ఇంత చేసినా మార్కెట్ల ఒడిదొడుకులతో పెట్టుబడులను సమీక్షిస్తూ ఉండాల్సి ఉంటుంది. అయితే వీటన్నింటికి ప్రత్యామ్మాయంగా ఒకేఒక పెట్టుబడి ప్రణాళికను మార్కెట్లలోని పెట్టుబడి నిపుణులు ప్రస్తుతం సూచించటం అందరినీ ఆకర్షిస్తోంది.

ఈ పద్ధతిలో ఇన్వెస్టర్లు తమ డబ్బును ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి డబుల్ అయ్యేలా చూసుకోవాలని వారు చెబుతున్నారు. అందుకోసం చేయాల్సిందల్లా నేరుగా సెన్సెక్స్ సూచీలో పెట్టుబడి పెట్టడం ద్వారా 2024లో లక్ష ఇన్వెస్ట్ చేస్తే 2055 నాటికి తప్పక కోటి రూపాయలుగా మారుతుందని వారు పక్కా లెక్కలతో చెబుతున్నారు. ఇందుకోసం ఇండెక్స్ ఈటీఎఫ్ కొనుగోళ్లు ఉత్తమంగా సూచిస్తున్నారు. గడచిన దశాబ్దాలుగా 49 ఏళ్లలో మార్కెట్ల పనితీరును గమనిస్తే ఎన్ని ఒడిదొడుకులు, ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పటికీ సెన్సెక్స్ సగటున 16 శాతం వృద్ధిని నమోదు చేసిన విషయాన్ని దీనికి ఉదహరిస్తున్నారు.
మీ అవసరాలకు అనగుణంగా 31 ఏళ్లలో పొందాలనుకుంటున్న మెుత్తానికి అనుగుణంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పైగా సెన్సెక్స్ లో నేరుగా పెట్టుబడిపెట్టడం ఇతర ఈక్విటీల్లో విడివిడిగా పెట్టుబడి కంటే సురక్షితమైనదిగా నిపుణులు పరిగణిస్తున్నారు. 31 ఏళ్ల తర్వాత కోటి కావాలంటే రూ.లక్ష, 10 కోట్లు కావాలంటే రూ.10 లక్షలు, 100 కోట్లు కావాలంటే రూ.కోటి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో మార్కెట్లు పడిన లేదా కరెక్షన్ కి గురైన ప్రతిసారీ ఇన్వెస్టర్లు ఇండెక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని చెబుతున్నారు. పైగా ఇలా నేరుగా పెట్టుబడి పెట్టడం ద్వారా డీమ్యాట్ ఖాతాలో ఉన్న పెట్టుబడులను షూరిటీగా పెట్టి రుణాన్ని వేగంగా పొందటం చాలా సులభతరం. అదే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను తాకట్టు పెట్టి రుణాలు పొందటం కొంత ఆలస్య ప్రక్రియగా నిపుణులు సూచిస్తున్నారు. మెుత్తానికి సెన్సెక్స్ ఈటీఎఫ్ పెట్టుబడులు మిమ్మల్ని కోటీశ్వరులుగా మార్చగలవని నిపుణులు చెబుతున్న మాట.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. కాబట్టి ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవటానికి ముందు మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం తదనుగుణంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవటం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications