రైతులకు శుభవార్త.. పావలా వడ్డీకే రూ.3 లక్షలు రుణం, కేంద్రం సూపర్ స్కీమ్ వివరాలివే..
Kisan Credit Cards: భారతదేశానికి వెన్నుముక రైతన్నలు. అందుకే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ రైతులకు ప్రాధాన్యతను కొనసాగిస్తూనే ఉంటాయి. వారికి అనుకూలమైన అనేక స్కీమ్స్ అందుబాటులోకి తెస్తుంటాయి. వ్యవసాయంలో అనిశ్చితి ఎక్కువగా ఉంటున్నందన వారికి తక్కువ ధరకు రుణాల లభ్యతను పెంచేందుకు పలు పథకాలను అమలులోకి తీసుకొస్తుంటాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది కిసాన్ క్రెడిట్ కార్డ్(KCC) స్కీమ్ గురించే. ప్రభుత్వం దీనిని రైతుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ప్రవేశపెట్టింది. స్కీమ్ కింద బ్యాంక్ నుంచి రైతన్నలు రుణాన్ని సులువుగా పొందవచ్చు. రైతులు వివిధ ప్రయోజనాల కోసం దీనిని ఉపయోగించవచ్చు. రైతులు చాలా సులభమైన ప్రక్రియ ద్వారా KCC పథకం కింద రుణం పొందవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్‌కు సంబంధించి లోక్‌సభలో లేవనెత్తిన వివిధ ప్రశ్నలకు ప్రభుత్వం స్పందించింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం కింద ఛార్జీలు, వడ్డీ రేట్లు, డాక్యుమెంటేషన్ గురించి తెలుసుకుందాం.

కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం ద్వారా రూ.3 లక్షల వరకు రుణాలకు ఎటువంటి రుసుము లేదు. ప్రభుత్వ నివేదిక ప్రకారం రూ.3 లక్షల వరకు కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాలకు ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్, తనిఖీ ఛార్జీలు మరియు ఇతర సేవా ఛార్జీలను మాఫీ చేయాలని బ్యాంకులను ఆదేశించింది. ఈ చర్య ప్రత్యేకంగా చిన్న మరియు సన్నకారు రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ రూ.3 లక్షలకు పైబడిన రుణాలకు ప్రాసెసింగ్ ఫీజు, తనిఖీ ఛార్జీలు తదితర ఛార్జీలను బోర్డు పాలసీ ప్రకారం సంబంధిత బ్యాంకులు నిర్ణయిస్తాయి.
కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాలపై విధించే వడ్డీ రేటుపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆర్థిక మంత్రిత్వ శాఖ జాయింట్ మినిస్టర్ పంకజ్ చౌదరి, KCC స్కీమ్ కింద రూ.3 లక్షల వరకు రుణాలు అందజేస్తారు. ఏడాదికి 7 శాతం వడ్డీ రేటు వసూలు చేస్తారు. రుణాన్ని వెంటనే చెల్లించే రైతులు 3 శాతం వడ్డీ రాయితీని పొందవచ్చు. దీంతో వడ్డీ రేటును ఏడాదికి 4 శాతానికి తగ్గించవచ్చు. రూ.3 లక్షలకు పైబడిన రుణాలపై వడ్డీ రేట్లను సంబంధిత బ్యాంకు బోర్డు నిర్ణయిస్తుందని చెప్పారు.
ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు..
మీరు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్న బ్యాంక్ వెబ్‌సైట్‌ను సందర్శించండి. బ్యాంక్ వెబ్‌సైట్‌లోని ఎంపికల జాబితా నుండి కిసాన్ క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకోండి. దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించడానికి "Application" బటన్‌ను క్లిక్ చేయండి. అవసరమైన వివరాలతో ఫారమ్‌ను పూరించి "Submit" క్లిక్ చేయండి. సమర్పించిన తర్వాత మీకు రిఫరెన్స్ నంబర్ ఇవ్వబడుతుంది. మీరు రుణం పొందేందుకు అర్హత కలిగి ఉంటే తర్వాతి 3-4 పని దినాల్లో బ్యాంక్ మిమ్మల్ని సంప్రదిస్తుంది.


Click it and Unblock the Notifications