For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేశీయ దిగ్గజ మ్యూచువల్ కంపెనీల ఫేవరెట్ స్టాక్స్.. వేల కోట్ల పెట్టుబడులు వీటిలోనే.. మీరూ తెలుసుకోండి..

|

Mutual Funds: దీర్ఘకాలంలో కంపేరటివ్ గా మెరుగైన రాబడిని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ (MF) స్కీమ్‌లు అందిస్తాయి. క్వాలిటీ మిడ్‌క్యాప్ స్టాక్‌లు ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందించేందుకు ఫండ్ మేనేజర్‌లకు సహాయకారిగా నిలిచాయి. మ్యూచువల్ ఫండ్ సంస్థలు సరైన స్టాక్ లలో పెట్టుబడులు పెట్టేందుకు మంచి రీసెర్చ్ చేస్తాయి. కంపెనీ ఫండమెంటల్స్, పనితీరు, రిటర్న్స్, కంపెనీ వ్యాపారం, వ్యాపారాల భవిష్యత్తు వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని స్టాక్ లను ఎంచుకుంటాయి. యాక్టివ్ గా నిర్వహించబడే ఈక్విటీ, హైబ్రిడ్ స్కీమ్స్ ఇన్వెస్టర్లకు స్థిరమైన రాబడులను అందిస్తాయి. దేశంలోని అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు తమ పోర్ట్‌ఫోలియోలో ఎంచుకుంటున్న మిడ్‌క్యాప్ స్టాక్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

SBI మ్యూచువల్ ఫండ్:

SBI మ్యూచువల్ ఫండ్:

ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కంపెనీ తన అనేక స్కీమ్ లలో కొన్ని మిడ్ క్యాప్ కంపెనీలను ఎంచుకుంటోంది. వీటిలో ప్రధానంగా పేజ్ ఇండస్ట్రీస్, మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్టిట్యూట్, P&G, సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా, డెలివరీ, ఎమ్ఆర్ఎఫ్, రిలాక్సో ఫుట్ వేర్, టీవీఎస్ మోటార్ కంపెనీ, NHPC, క్యుమిన్స్ ఇండియా స్టాక్ లలో వేల కోట్ల రూపాయలను కొనసాగిస్తోంది.

HDFC మ్యూచువల్ ఫండ్:

HDFC మ్యూచువల్ ఫండ్:

HDFC మ్యూచువల్ ఫండ్ కంపెనీ తన అనేక స్కీమ్ లలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆర్ఈసీ, మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్టిట్యూట్, ది ఇండియన్ హోటల్ కంపెనీ, హిందుస్థాన్ పెట్రోలియం కార్ప్, ఎస్కేఎఫ్ ఇండియా, లుపిన్, ఇప్కా ల్యాబొరేటరీస్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, అరబిందో ఫార్మా కంపెనీల షేర్లలో పెట్టుబడులను కొనసాగిస్తోంది.

కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్:

కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్:

కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ కంపెనీ తన అనేక స్కీమ్ లలో థర్మాక్స్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, షెఫలర్ ఇండియా, కోరమాండల్ ఇంటర్నేషనల్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా, సుప్రీమ్ ఇండస్ట్రీస్, రామ్ కో సిమెంట్, బాటా ఇండియా కంపెనీల్లో వివిధ స్కీమ్స్ కింద పెట్టుబడులను కొనసాగిస్తోంది.

యాక్సిస్ మ్యూచువల్ ఫండ్:

యాక్సిస్ మ్యూచువల్ ఫండ్:

పీఐ ఇండస్ట్రీస్, టొరెంట్ పవర్, కొఫొర్జి, సోనా బీఎల్డబ్యూ ప్రెసిషన్ ఫోర్గ్, అస్ట్రల్, సుందరం ఫైనాన్స్, మదర్ సమ్ సుమీ, టాటా ఈఎల్ఎక్స్ఐ, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ట్రెంట్ స్టాక్ లలో ఫండ్ కంపెనీ తన వివిధ స్కీమ్ లలోని డబ్బును పెట్టుబడులుగా పెడుతోంది.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్:

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్:

టీవీఎస్ మోటార్ కంపెనీ, లుపిన్, యునైటెడ్ బ్రూవరీస్, మ్యాక్స్ ఫైనాన్సియల్ సర్వీసెస్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, ఫెడరల్ బ్యాంక్, ఇప్కా ల్యాబొరేటరీస్, సుందరం ఫైనాన్స్, ది ఫోనిక్ మిల్స్, టాటా కమ్యూనికేషన్స్ స్టాక్ లలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ పెట్టుబడులను పెట్టింది. తమ వివిధ స్కీమ్ లలో వేల కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం ఈ మిడ్ క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది.

English summary

దేశీయ దిగ్గజ మ్యూచువల్ కంపెనీల ఫేవరెట్ స్టాక్స్.. వేల కోట్ల పెట్టుబడులు వీటిలోనే.. మీరూ తెలుసుకోండి.. | know about top indian mutual fund companies favouries

Here are the favourite midcap stocks of India's largest mutual fund houses
Story first published: Friday, July 22, 2022, 12:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X