పెరుగుతున్న జీవన వ్యయం, పిల్లల చదువులు, వారి భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ముందే ప్లాన్ చేస్తున్నారు. పిల్లల విద్య, ఆర్థిక భవిష్యత్తు, వివాహం కోసం ఖర్చుల గురించి ఆలోచిస్తుంటారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు మనకు అందుబాటులో ఉంచింది. ఇందులో ఆడపిల్లల కోసం ప్రత్యేక స్కీంలు ఉన్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక సుకన్య సమృద్ధి పథకం తీసుకు వచ్చారు. తమ ఆడపిల్ల భవిష్యత్తు కోసం ఇందులో ఎంతోమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇదే పథకం కాకుండా మరో పథకం కూడా ఉంది. అదే బాలికా సమృద్ధి యోజన. అయితే ఈ రెండింటికి తేడా ఉంది....

పథకాలు
సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకం కింద ఆడ పిల్లల పేరుపై ప్రతి నెల కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. కానీ బాలికా సమృద్ధి యోజనలో (BSY) డబ్బును డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వమే చిన్నారుల పేరుపై అకౌంటులో వేస్తుంది. స్కూళ్లలో ఆడ పిల్లల సంఖ్యను పెంచేందుకు దీనిని తీసుకు వచ్చారు. ఈ పథకం ఎప్పటి నుంచో ఉంది. కానీ చాలామందికి తెలియకపోయి ఉండవచ్చు. 1997 నుంచి ఉంది. సుకన్య సమృద్ధి యోజన పథకం మాత్రం 2015లో తీసుకు వచ్చారు.

సుకన్య సమృద్ధి యోజన
సుకన్య సమృద్ధి యోజనను మోడీ ప్రభుత్వం 2015లో తీసుకు వచ్చింది. ఈ పథకం కింద చేసే పెట్టుబడిపై ప్రస్తుతం వడ్డీ రేటు 7.9 శాతంగా ఉంది. ఆడ పిల్లల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ పథకం కింద రూ.1.5 లక్షల వరకు ఆదాయపు పన్ను బెనిఫిట్స్ పొందవచ్చు. ఆడపిల్ల ఉన్నత చదువుల కోసం 50 శాతం మొత్తాన్ని తీసుకోవచ్చు. అలాగే 18 ఏళ్లు నిండిన తర్వాత కూడా 50 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. ఇది EEE (మినహాయింపు - మినహాయింపు - మినహాయింపు) కేటగిరీ కిందకు వస్తుంది.

ఎంత జమ చేయాలి...
సుకన్య సమృద్ధి యోజన పథకం కింద ప్రతి ఏడాది కనీసం రూ.1000 జమ చేయాలి. గరిష్టంగా రూ.1.5 లక్షలు జమ చేయవచ్చు. ఇద్దరు ఆడ పిల్లల వరకు సుకన్య సమృద్ధి యోజన వర్తిస్తుంది. రెండో కాన్పులో ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నా ఇది వర్తిస్తుంది.

బాలికా సమృద్ధి యోజన
ప్రసవానికి, ఆమె విద్యకు అండగా నిలబడేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇది తల్లికి బహుమతి ఇచ్చే కానుకగా చెప్పవచ్చు. ఈ పథకం కింద ఆడ పిల్లు పుట్టిన తర్వాత తల్లికి రూ.500 క్యాష్ గిఫ్ట్ ఇస్తారు. తర్వాత ఆడపిల్ల స్కూల్‌కు వెళ్లిన తర్వాత దగ్గరి నుంచి ప్రతి సంవత్సరం స్కాలర్‌షిప్ అందిస్తారు. అయితే ఇక్కడ 18 ఏళ్లు వచ్చిన తర్వాత డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు.

ఎప్పుడెప్పుడు ఎంత ఇస్తారంటే?
ఆడపిల్ల ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు సంవత్సరానికి రూ.300 అందిస్తారు. 4వ తరగతిలో రూ.500, 5వ తరగతికి రూ.600, ఆరో తరగతి నుంచి ఏడో తరగతి వరకు రూ.700, ఎనిమిదో తరగతికి రూ.800, తొమ్మిదో తరగతికి రూ.1000 స్కాలర్‌షిప్ అందిస్తారు.

ఈ పథకంలో ఎలా చేరాలి?
బాలికా సమృద్ధి యోజన పథకం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోను వర్తిస్తుంది. బిలో పావర్టీ కుటుంబాలకు ప్రయోజనం కల్పించే ఉద్దేశ్యంతో 15 ఆగస్ట్ 1997లో దీనిని ప్రారంభించారు. ఈ పథకాన్ని గ్రామాల్లో ICDS ద్వారా, పట్టణ ప్రాంతాల్లో హెల్త్ డిపార్టుమెంట్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. గ్రామాల్లో అంగన్వాడీ వర్కర్ల దగ్గర దరఖాస్తు ఫారాలు ఉంటాయి. అలాగే హెల్త్ డిపార్టుమెంట్ అధికారుల వద్ద అర్బన్ ప్రాంతాల్లో ఉంటాయి. అప్లికేషన్లు ఆన్ లైన్‌లో కూడా అందుబాటులో ఉంటాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications