ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన కస్టమర్ల కోసం ఇంతకుముందు సరికొత్త కార్డును అందుబాటులోకి తీసుకు వచ్చింది. మల్టీ కరెన్సీ ఫారెన్ ట్రావెల్ కార్డు పేరుతో దీనిని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది ప్రీ-లోడెడ్ మనీ కార్డు. ఏడు కరెన్సీలలో అంగీకరిస్తుంది. ఏటీఎంలలో ఉపయోగించవచ్చు. విదేశాల్లో మర్చంట్ పాయింట్లలోను ఉపయోగించవచ్చు. అమెరికా డాలర్, బ్రిటిష్ పౌండ్స్, యూరోస్, సింగపూర్ డాలర్స్, ఆస్ట్రేలియన్ డాలర్స్, కెనడియన్ డాలర్స్, యూఏఈ ధీరమ్‌లలో ఈ కార్డు చెల్లుబాటు అవుతుంది.
ఈ ట్రావెల్ కార్డు ద్వారా యూజర్లు కార్డును రీలోడ్ చేసిన ప్రతిసారి తమ కరెన్సీలో మార్పిడీ రేట్లను లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్బీఐ మల్టీ కరెన్సీ ఫారెన్ ట్రావెల్ కార్డు ఫీచర్స్, బెనిఫిట్స్, పరిమితులు, దీనిని ఎలా ఉపయోగించాలో చూద్దాం.

కార్డు ఫీచర్స్
ఎస్బీఐ ప్రెస్ రిలీజ్ ప్రకారం మల్టీ కరెన్సీ ఫారెన్ ట్రావెల్ కార్డు ఫీచర్స్ ఇవి..
- చిప్ అండ్ పిన్ ప్రొటెక్టెడ్ ప్రీపెయిడ్ ట్రావెల్ కార్డు
- ఒకే కార్డు పైన మల్టిపుల్ కరెన్సీ వినియోగం
- బ్యాక్-అప్ కోసం అడిషనల్ కార్డు అందుబాటులో ఉంటుంది.
- 24/7 గ్లోబల్ అసిస్టెన్స్. ఈ కార్డును ఎవరైనా దొంగిలించినా లేదా ఎక్కడైనా పోయినా ఉచిత కార్డు రీప్లేస్‌మెంట్.
- ఈ కార్డు వినియోగం ప్రారంభించడానికి బ్యాంకు అకౌంట్ సమాచారం అవసరం లేదు.
- చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, ఎస్బీఐ అన్ని శాఖల నుండి అందుబాటులో ఉన్న ఫామ్ ఏ2తో కార్డుపై గడువు తేదీ వరకు మళ్లీ లోడ్ చేసుకోవచ్చు.

ఈ కార్డును ఎలా పొందాలి?
ఎస్బీఐ కస్టమర్లు అలాగే, కొత్త కస్టమర్లు కూడా ఈ కార్డును పొందవచ్చు. సమీపంలోని ఎస్బీఐ బ్రాంచీని లేదా ఎస్బీఐ వెబ్ సైట్‌లోకి వెళ్లి దీనిని పొందవచ్చు.

అందుబాటులో ఉన్న సేవలు
కార్డు హోల్డర్ ట్రావెల్ కార్డును ఉపయోగించి పొందగల సేవలు ఈ క్రింద చూడండి.
- బ్యాలెన్స్, ట్రాన్సాక్షన్ వివరాల సురక్షిత విజిబిలిటీతో కార్డు ఆన్‌లైన్ నిర్వహణ.
- ఈ కార్డును వినియోగించడం ద్వారా ఏటీఎం లొకేటర్ వంటి సేవలను కూడా పొందవచ్చు.
- ట్రాన్సాక్షన్స్ చెల్లింపుల కోసం తగినంత నిధులు కనుక కార్డులో లేకుంటే... ఇతర కార్డులో అందుబాటులో ఉన్న కరెన్సీ నుండి ఆటోమేటిక్‌గా ఫండ్ డెబిట్ అవుతుంది.
- కస్టమర్లు విదేశాల్లో ఉన్నప్పుడు రేటు హెచ్చుతగ్గులు, వ్యత్యాసాలను నివారించవచ్చు.
- పోయిన లేదా దొంగిలించబడిన కార్డుల విషయంలో కార్డులో లభ్యమయ్యే బ్యాలెన్స్ వరకు అత్యవసర నగదు భర్తీని సర్వీస్ బృందం అందిస్తుంది.

పరిమితి ఎంత?
- కార్డులో కనీసం 200 అమెరికా డాలర్లు. ఏటీఎంలవద్ద అలాగే, మర్చంట్ పాయింట్స్ వద్ద గరిష్ట ఉపసంహరణ పరిమితి 10,000 అమెరికా డాలర్లు.
- ఏ సమయంలో అయినా ఒక కస్టమర్ ద్వారా కేవలం ఒక అకౌంట్ మాత్రమే యాక్టివ్‌గా ఉంటుంది.
- కొన్ని ఏటీఎం ఆపరేటర్స్, మర్చంట్స్ ఉపసంహరణకు సంబంధించి కొంత ఛార్జ్ చేస్తారు. అలాగే, ఆయా ఏటీఎం ఆపరేటర్స్ లేదా మర్చంట్స్ వద్ద కనీ, గరిష్ట పరిమితికి నియమనిబంధనలు ఉంటాయి.

భద్రత
- కార్డు అందిన వెంటనే దాని వెనుక భాగంలో సంతకం చేయాలి.
- పిన్ నెంబర్ గుర్తు పెట్టుకోవాలి.
- మల్టీ కరెన్సీ ట్రావెల్ కార్డు బ్యాంకు అకౌంట్‌తో లింక్ అయి ఉండదు. ఇది అదనపు భద్రత.
- కార్డు వినియోగంలోనే ఉంటే, దానిని మరో ట్రిప్ కోసం ఉపయోగించే అవసరం లేకుంటే మిగతా బ్యాలెన్స్‌ను మాస్టర్ కార్డ్ యాక్సెప్టెన్స్ మార్క్ ఏటీఎం ద్వారా ఉపసంహరించుకోవచ్చు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications