Bima Sugam: యూపీఐ చెల్లింపుల విధానం దేశంలో విజయవంతం కావటంతో అంతర్జాతీయంగా గుర్తింపును పొందింది. చాలా దేశాలు ప్రశంశించటంతో పాటు దీనిని తాము కూడా స్వీకరించాయి. అయితే దీనిని ప్రస్తుతం దేశంలోని ఇన్సూరెన్స్ కంపెనీలకు విస్తరించే పనిలో ఐఆర్డీఏఐ ఉంది.
ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడానికి వ్యక్తులు ప్రతి కంపెనీ వెబ్‌సైట్‌ను సందర్శించాలి లేదా వారి ఏజెంట్లను సంప్రదించాల్సి ఉంటుంది. అయితే రానున్న కాలంలో ఈ సమస్య పరిష్కారమవుతుందని తెలుస్తోంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ IRDAI ఎలక్ట్రానిక్ మార్కెట్‌ప్లేస్‌ను ప్రారంభించేందుకు ONDCకి ఆమోదం తెలిపింది. బీమా సుగం అనేది అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల గురించిన సమాచారం అందించే అగ్రిగేటర్ లాంటిది.

బీమా కంపెనీలు ఈ మార్కెట్ స్థలాన్ని సొంతం చేసుకోవచ్చు. బీమా సుగం కంపెనీలు, ఉత్పత్తులు, పంపిణీదారులకు ప్లాట్‌ఫారమ్‌ను అందించడమే కాకుండా, కస్టమర్‌కు బీమా ఖాతా నంబర్ కూడా కేటాయించబడుతుంది. ఆ ఖాతా నంబర్ ద్వారా కస్టమర్లు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారే అవకాశం ఉంటుంది. తాజా ప్రక్రియ ద్వారా దేశంలోని ఇన్సూరెన్స్ పరిశ్రమ సైతం యూపీఐ లాంటి దశగా ఇది నిరూపిస్తుందని బీమా సుగం గురించి IRDAI చైర్మన్ దేబిష్ పాండా అన్నారు.
బీమా సుగం ప్లాట్‌ఫారమ్‌లో ఇన్సూరెన్స్ ఉత్పత్తుల కొనుగోలు చేయడం, విక్రయించడంతోపాటు, ఇక్కడి నుంచే క్లెయిమ్ సౌకర్యాన్ని కూడా అందించగలరు. అలాగే ఆన్‌లైన్ పంపిణీదారులు కూడా ఈ ప్లాట్‌ఫారమ్‌లో భాగం కావచ్చు. IRDAI విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. బీమా రంగంలోని వాటాదారులందరికీ ఈ మార్కెట్‌ను అందించనున్నట్లు వెల్లడైంది. కస్టమర్లు, బీమాదారులు, ఏజెంట్లు మొదలైనవారు ఒకే చోట అందుబాటులో ఉంటారు. దీంతో మొత్తం వ్యవస్థలో పారదర్శకత వస్తుందని తెలుస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications