For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LIC Policy: రోజూ రూ.74 పెట్టుబడి చాలు.. లోన్ ఫెసిలిటీతో పాటు నో టాక్స్.. పాలసీ వివరాలు..

|

LIC Policy: మీరు తక్కువ డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా.. భవిష్యత్తు అవసరాల కోసం మెరుగైన మెుత్తాన్ని పొందాలనుకుంటున్నట్లయితే ఎల్ఐసీ పెట్టుబడులు సరైన ఎంపిక. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన వివిధ స్కీమ్స్ మీ కలను సాకారం చేస్తాయి.

ఎల్ఐసీ కొత్త పథకం..

ఎల్ఐసీ కొత్త పథకం..

దేశంలో అన్ని ఆదాయ వర్గాల వారికీ అనుగుణంగా ఉండే అనేక పథకాలను ప్రభుత్వ యాజమాన్యంలోని ఎల్ఐసీ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ప్రవేశపెట్టిన కొత్త జీవన్ ఆనంద్ పాలసీని తీసుకోవడం సరైన ఎంపికని చెప్పుకోవాలి. ఇందులో మీరు రూ.10 లక్షలు పాలసీ తీసుకున్న వ్యక్తికి పన్ను మినహాయింపుతో పాటు డెత్ బెనిఫిట్స్ కుడా ఉంటాయి. ఇందుకోసం నెలకు కేవలం రూ.2,190 చేస్తే చాలు. ఇలా పెట్టుబడిదారు రూ.10 లక్షల మెుత్తాన్ని పొందవచ్చు.

పాలసీని ఎవరు కొనుగోలు చేయవచ్చు..

పాలసీని ఎవరు కొనుగోలు చేయవచ్చు..

ఈ కొత్త జీవన్ ఆనంద్ పాలసీ కనీస కాలపరిమితి 15 నుంచి 35 సంవత్సరాలుగా ఉంది. పాలసీని 18 నుండి 50 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వ్యక్తి ఎవరైనా తీసుకోవచ్చు. ఈ ప్లాన్ ప్రీమియం చెల్లించడానికి పాలసీదారుకు LIC అనేక ఆప్షన్లను అందిస్తోంది. మీరు ఈ పాలసీ ప్రీమియంను త్రైమాసికం, అర్ధ సంవత్సరం లేదా వార్షికంగా, నెలవారీగా చెల్లించవచటానికి వెసులుబాటు ఉంది.

రూ.10 లక్షలు ఎలా పొందాలి..

రూ.10 లక్షలు ఎలా పొందాలి..

ఒక వ్యక్తి 24 సంవత్సరాల వయస్సులో రూ.5 లక్షల మెుత్తానికి ఇన్సూరెన్స్ కొనుగోలు చేసినట్లయితే అందుకు ఏటా రూ.26,815 డిపాజిట్ చేయాలి. నెలవారీ ప్రాతిపధికన రూ.2,190 అంటే రోజుకు రూ.73.50 సేవ్ చేయాల్సి ఉంటుంది. మీరు 21 సంవత్సరాల వయస్సులో ఈ పాలసీని కొనుగోలు చేసినట్లయితే.. ప్రస్తుతం మీ మెుత్తం పెట్టుబడి దాదాపు 5.63 లక్షలు అవుతుంది. దీనిలో మీరు మెచ్యూరిటీ సమయంలో బోనస్‌తో పాటు రూ.10 లక్షల కంటే ఎక్కువ పొందుతారు. ఇది సమ్ అష్యూర్డ్, సింపుల్ రివర్షనరీ బోనస్, చివరగా అదనపు బోనస్ అందుబాటులో ఉంటుంది.

టాక్స్ మినహాయింపు.. లోన్ ఫెసిలిటీ..

టాక్స్ మినహాయింపు.. లోన్ ఫెసిలిటీ..

మీరు LIC నుంచి జీవన్ ఆనంద్ పాలసీని కొనుగోలు చేస్తే.. మీరు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్- 80C కింద పన్ను రాయితీ ప్రయోజనం లభిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో లేదా పాలసీదారు మరణించిన సమయంలో అందుకున్న మొత్తంపై ఎలాంటి టాక్స్ ఉండదు. పైగా పాలసీపై రుణం తీసుకున్నట్లయితే.. క్రెడిట్ సరెండర్ విలువలో 90 శాతం ఉంటుంది.

English summary

LIC Policy: రోజూ రూ.74 పెట్టుబడి చాలు.. లోన్ ఫెసిలిటీతో పాటు నో టాక్స్.. పాలసీ వివరాలు.. | know about jeevan anand policy that gives 10 lakhs cover with just 74 rupees daily saving

know about this lic policy that gives 10 lakhs corpus with just 74 rupees investment daily
Story first published: Tuesday, August 9, 2022, 12:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X