Travel Insurance: ఒడిశాలో రెండు రోజుల కిందట జరిగిన ఘోర రైలు ప్రమాదం ప్రస్తుతం ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యతను తెరమీదకు తెచ్చింది. భారతీయ రైల్వేలలో ప్రయాణించే వారు దీని ప్రయోజనాన్ని పొందటం ఎలా అనేదానిపై ఇప్పుడు అందరి దృష్టి పడింది.
IRCTC పోర్టల్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎంచుకునే ఎంపికను పాసింజర్లకు రైల్వేలు అందిస్తోంది. అయితే ఇది తప్పనిసరి మాత్రం కాదు. ఇన్సూరెన్స్ పాలసీని టిక్కెట్ తో పాటు కొనుగోలు చేసిన వ్యక్తులకు రైలు ప్రయాణ సమయంలో ప్రమాదం జరిగి దెబ్బలు తగిలినా లేక మరణం సంభవించినా పరిహారం అందించబడుతుంది.

భారతీయ రైల్వేలు అందిస్తున్న ట్రావెల్ ఇన్సూరెన్స్ అత్యంత తక్కువ ఖర్చుతోనే ప్రయాణికులకు రక్షణను అందిస్తోంది. ఆన్ లైన్ లో టిక్కెట్ బుక్ చేసుకునేటప్పుడు ఒక్కో ప్రయాణికుడు కేవలం 0.35 పైసలు చెల్లించి ఇన్సూరెన్స్ రక్షణను పొందవచ్చు. అలా కవర్ కొనుగోలు చేసిన వారికి ఐదు రకాల ప్రయోజనాలను పొందవచ్చు.
- ప్రయాణ సమయంలో దెబ్బలు తగిలిన దానివల్ల వ్యక్తి 12 నెలల్లో మరణిస్తే వారికి 100 శాతం క్లెయిమ్ అందించబడుతుంది. అంటే పాలసీ ప్రకారం వారికి రూ.10 లక్షల పరిహారం అందుతుంది.
- ఒకవేళ ప్రయాణ సమయంలో ప్రమాదం వల్ల 12 నెలల్లోపు శాశ్వతంగా పూర్తి వైకల్యం ఏర్పడితే వారికి ఇన్సూరెన్స్ పాలసీ కవర్ కింద 100 శాతం అంటే రూ.10 లక్షల పరిహారం చెల్లించబడుతుంది.
- ప్రయాణికుడు ప్రమాదం వల్ల 12 నెలల్లోపు శాశ్వత పాక్షిక వైకల్యానికి గురైతే పాలసీ కింద వారికి రూ.7.50 లక్షల వరకు పరిహారంగా అందుతుంది. అయితే పాలసీలో పేర్కొన్న విధంగా ప్రయాణీకుల పరిస్థితులపై ఆధారపడి అందుబాటులో ఉన్న మెుత్తం చెల్లించటం జరుగుతుంది.

- అలాగే ప్రమాదం వల్ల ఆస్పత్రిపాలైతే అందుకోసం ఇన్సూరెన్స్ కవర్ కింద చికిత్స కోసం రూ.2 లక్షల వరకు అందించబడుతుంది.
- పాలసీ కింద పేర్కొన్న విధంగా ప్రమాదం లేదా అవాంఛనీయ సంఘటనల కారణంగా ప్రయాణ సమయంలో బీమా చేయబడిన ప్రయాణీకుడు మరణిస్తే, ప్రయాణీకుల నివాస స్థలానికి లేదా దహన సంస్కారాలకు లేదా ఖననం చేయడానికి ఇన్సూరెన్స్ కంపెనీ రవాణా ఖర్చుల కోసం రూ.10,000 చెల్లిస్తుంది.
అయితే ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ తీసుకున్న బాధితుడు లేదా వారి కుటుంబ సభ్యులు పరిహారం పొందేందుకు అర్హులు. క్లెయిమ్ పొందేందుకు వారు సమీపంలోని ఎల్ఐసీ బీమా సంస్థ కార్యాలయాన్ని సంప్రదించి పూర్తి స్టేట్మెంట్ అందించాల్సి ఉంటుంది. వారు అడిగిన తగిన ఆధారాలు, రుజువులను సమర్పించాలి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications