For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Home Loan: హోమ్ లోన్ డిఫాల్డ్ చేస్తే ఏమౌతుంది..? ఇల్లు కోల్పోయే ప్రమాదం కూడా.. ఆ చట్టం కింద..

|

Home Loan: సొంత ఇల్లు అనేది మధ్యతరగతి కుటుంబాలకు చిరకాల స్వప్నం. కానీ సొంత ఇల్లు కొనుక్కోవటం లేదా కట్టుకోవటం అనేది అంత ఈజీ కాదు. అయితే ప్రస్తుతం మార్కెట్లో హౌసింగ్ లోన్ అనేది చాలా సులువుగానే అందుబాటులో ఉంది. 15 నుంచి 30 ఏళ్ల కాలవ్యవధికి వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు బ్యాంకులు వెసులుబాటు కల్పిస్తున్నాయి.

అనుకోని మార్పుల వల్ల..

అనుకోని మార్పుల వల్ల..

వాయిదాల పద్ధితిలో చెల్లంపులు అనేది వినటానికి సులువుగానే ఉన్నా ఏళ్ల తరబడి క్రమం తప్పకుండా చెల్లించే క్రమంలో ఇబ్బందులు కూడా ఉంటాయి. ఎందుకంటే పరిస్థితులు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు కాబట్టి. ఇలాంటి సందర్భాల్లో కొంత మంది సకాలంలో లోన్ చెల్లింపులు చేయలేరు. అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకోండి.

డబ్బులున్నా లోన్..

డబ్బులున్నా లోన్..

ఈ రోజుల్లో లోన్ లేకుండా సొంత ఇల్లు కొనే వారి సంఖ్య చాలా తక్కువని చెప్పుకోవాలి. చాలా మంది తమవద్ద డబ్బు ఉన్నా.. ఆదాయపు పన్ను మినహాయింపు కోసం కనీసం కొంత మెుత్తాన్నైనా హౌసింగ్ లోన్ రూపంలో రుణాన్ని తీసుకుంటున్నారు. పైగా వారు తమ వద్ద ఉండే డబ్బును వ్యాపారాలకు వినియోగించి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఇలా రెండు విధాల లాభం చేకూరుతుంది.

EMI మొత్తం..

EMI మొత్తం..

మీరు మొదటిసారిగా హోమ్ లోన్ EMIని చెల్లించడంలో విఫలమైతే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు SMS, ఈ-మెయిల్, మొబైల్ కాల్స్ ద్వారా గుర్తు చేస్తాయి. ఇది మాత్రమే కాకుండా కొన్ని అదనపు ఛార్జీలను కూడా వేస్తాయి. చెక్ బౌన్స్ ఛార్జీలు సైతం విధించే అవకాశం ఉంది. EMI మొత్తాన్ని ఆలస్యమైన చెల్లింపుపై ఆలస్య రుసుము లేదా పెనాల్టీ 1 నుంచి 2 శాతం వరకు విధించబడుతుంది. దీన్ని EMI వాయిదాతో పాటు చెల్లించాల్సి ఉంటుంది.

రుణ గ్రహీతకు నోటీసులు..

రుణ గ్రహీతకు నోటీసులు..

2వ సారి EMI చెల్లించడంలో విఫలమైతే, బ్యాంక్ నుంచి నోటీసును అందుకోవచ్చు లేదా డ్రాఫ్ట్ చెల్లించమని మిమ్మల్ని కోరుతూ హెచ్చరిక అందుకోవచ్చు. అదే 3వ సారి చెల్లించకపోతే బ్యాంకు గృహ రుణాన్ని NPAగా ప్రకటిస్తుంది. అంటే సదరు వినియోగదారుని లోన్ మెుత్తాన్ని మెుండి బకాయిగా గుర్తించబడుతుంది.

SARFAESI చట్టం ప్రకారం..

SARFAESI చట్టం ప్రకారం..

రుణం తీసుకుని ఈఎంఐ చెల్లించని వారిపై SARFAESI Act- 2002 ప్రకారం బ్యాంక్ చర్యలు ప్రారంభిస్తుంది. బ్యాంకులు తమ డబ్బును 60 రోజుల్లోగా వసూలు చేయాలని లీగల్ నోటీసును పంపుతాయి. ఈ గడువులోపు హోమ్ లోన్ చెల్లించని పక్షంలో ఒక్క నోటీసు ఇవ్వటం ద్వారా కోర్టుకు వెళ్లకుండానే ఆస్తిని జప్తు చేయడానికి బ్యాంకుకు SARFAESI చట్టం అనుమతిస్తుంది. పైగా దీనివల్ల రుణ గ్రహీత క్రెడిట్ స్కోర్ తీవ్రంగా దెబ్బతింటుంది.

Read more about: home loan emi business news
English summary

Home Loan: హోమ్ లోన్ డిఫాల్డ్ చేస్తే ఏమౌతుంది..? ఇల్లు కోల్పోయే ప్రమాదం కూడా.. ఆ చట్టం కింద.. | know about implications of home loan emi default under SARFAESI Act- 2002

know about implications of home loan emi default under SARFAESI Act- 2002
Story first published: Thursday, September 29, 2022, 10:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X