For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Qualities: గోల్డ్ స్వచ్చతలో క్వాలిటీల గురించి తెలుసా..? ఏ క్యారెట్ బంగారాన్ని కొనాలి.. పూర్తి వివరాలు

|

Gold Purity: మన దేశంలో బంగారం ప్రియులు ఎక్కువన్న సంగతి అందరికీ తెలిసిందే. మన సాంప్రదాయం ప్రకారం అనేక సందర్భాల్లో విరివిగా బంగారాన్ని కొంటుంటాం. కానీ అనేక మందికి వీటిలో ఉండే వివిధ రకాల క్వాలిటీల గురించి అవగాహన తక్కువ. అయితే.. భారతదేశంలో ప్రస్తుతం 3 రకాల బంగారాన్ని వివిధ క్యారెట్లలో విక్రయిస్తున్నారు. ఈ సందర్భంలో.. వాటి ధరల్లో వ్యత్యాసం కూడా ఉంటుంది.

ఈ కారణంగా.. మీరు టీవీ లేదా ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో చూసే ధర జ్యువెలరీ షాప్‌లో కొంత తేడా ఉంటుంది. వాస్తవానికి.. 24 క్యారెట్ల బంగారం ధరను వార్తల్లో ప్రామాణికంగా చెబుతారు. అయితే వాస్తవానికి బంగారు ఆభరణాలు కొన్నప్పుడు 22 లేదా 18 క్యారెట్ల బంగారం ఇవ్వబడుతుంది. అసలు ఈ క్యారెట్లను ఎలా వేరు చేస్తారు? బంగారానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకోండి..

 24 క్యారెట్ల బంగారం..

24 క్యారెట్ల బంగారం..

స్వచ్ఛమైన బంగారాన్ని మూడు వర్గాలుగా విభజించారు. అందులో మొదటిది 24 క్యారెట్ల గోల్డ్. ఈ క్యారెట్ బంగారం 99.99 శాతం స్వచ్ఛమైనది. అయితే.. ఈ క్యారెట్ బంగారాన్ని ఆభరణాల తయారీకి ఉపయోగించరు. కానీ.. దీనిని బంగారు బిస్కెట్లు లేదా ఇటుకల రూపంలో మారుస్తారు.

దాని స్వచ్ఛత కారణంగా.. ఈ క్యారెట్ బంగారం మీ ఆభరణాల పెట్టెలో మాత్రమే కాకుండా సురక్షితంగా ఉంచుతుంది. ఎవరైనా గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్స్ చేయాలనుకుంటే.. వారు 24 క్యారెట్ల బంగారు ఇటుకలు లేదా బిస్కెట్లను కొనుగోలు చేయవచ్చు. 24 క్యారెట్ల బంగారాన్ని '999' గోల్డ్ అని కూడా అంటారు.

22 క్యారెట్ల బంగారం..

22 క్యారెట్ల బంగారం..

మనం 22 క్యారెట్ల బంగారం గురించి మాట్లాడుకున్నట్లయితే.. అది 91.67 శాతం స్వచ్ఛతను కలిగి ఉంటుంది. అయితే, ఇది పూర్తిగా స్వచ్ఛమైనది కాదు. దీనితో ఆభరణాలను తయారు చేస్తారు. ఈ క్వాలిటీ బంగారంలో 8.33 శాతం ఇతర లోహాలను కలుపుతారు. ఈ క్యారెట్ బంగారాన్ని 916 KDM గోల్డ్ అని పిలుస్తారు. దీనితో తయారు చేయబడిన ఆభరణాల్లో 22 భాగాలు బంగారం.., వెండి, జింక్, రాగి వంటి ఇతర లోహాలు 2-2 భాగాలుగా ఉంటాయి.

18 క్యారెట్ల బంగారం..

18 క్యారెట్ల బంగారం..

ఇప్పుడు 18 క్యారెట్ల బంగారం గురించి తెలుసుకుంటే.. ఇది కూడా పూర్తిగా స్వచ్ఛమైనది కాదు. ఇది 75 శాతం వరకు మాత్రమే స్వచ్ఛమైన బంగారంగా పరిగణించబడుతుంది. ఇందులో 18 భాగాలు బంగారం, మిగిలిన 6 భాగాలు ఇతర లోహాలను కలుపుతారు. 75 శాతం బంగారం, 25 శాతం ఇతర లోహాలు కలిపి నగలను తయారు చేస్తారు.

24 క్యారెట్ల గోల్డ్ తో ఆభరణాలను ఎందుకు తయారు చేయకూడదు?

24 క్యారెట్ల గోల్డ్ తో ఆభరణాలను ఎందుకు తయారు చేయకూడదు?

ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు ఏ ఆభరణాలు ఏ కేటగిరీకి చెందినవో ఆభరణాల వ్యాపారి తప్పనిసరిగా చెప్పాలి. అయితే.. ఈ కాలంలో పూర్తిగా స్వచ్ఛమైన అని పిలువబడే 24-క్యారెట్ల బంగారాన్ని చూపించరు. దీని వెనుక కారణం ఈ క్యారెట్ బంగారంతో నగలు చేయకపోవడమే. వాస్తవానికి దాని స్వచ్ఛత కారణంగా.. 24 క్యారెట్ల గోల్డ్ చాలా మృదువుగా ఉంటుంది.

ఈ క్వాలిటీ బంగారంతో చేసే ఆభరణాలు సులువుగా విరిగిపోతాయి. అందుకే ధృడత్వం కోసం ఇతర లోహాలను పరిమిత స్థాయిలో స్వర్ణకారులు కలుపుతారు. కేవలం బంగారంలో ఈ మూడు క్వాలిటీలు మాత్రమే కాకుండా..23, 10, 14, 16 క్యారెట్లు కూడా ఉన్నాయి. కానీ ఈ రకాల బంగారానికి భారత దేశంలో ఎక్కువ ఆదరణ లేదు. ఈ కారణాల వల్లనే వివిధ క్యారెట్ల బంగారం రేట్లలో తేడాలు ఉంటాయి. ప్రజలు తమ ఆర్థిక స్తోమతకు అనుగుణంగా వివిధ క్యారెట్ల బంగారాన్ని కొంటుంటారు.

Read more about: gold బంగారం
English summary

Gold Qualities: గోల్డ్ స్వచ్చతలో క్వాలిటీల గురించి తెలుసా..? ఏ క్యారెట్ బంగారాన్ని కొనాలి.. పూర్తి వివరాలు | know about different qualities of gold available in the market and their price variations

know about different qualities of gold from 24 karats to 10 karats and rate variations between them..
Story first published: Sunday, July 10, 2022, 12:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X