Credit Card: క్రెడిట్ కార్డ్ ఎక్కడో పోయిందా..? ఈ 5 విషయాలు పూర్తి చేయండి..
Lost Credit Card: ఆధునిక ప్రపంచంలోని చెల్లింపుల వ్యవస్థలో ప్రధానంగా క్రెడిట్ కార్డులు అధికారం చెలాయిస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం క్రెడిట్ కార్డు వినియోగదారుల సంఖ్య 4 కోట్లకు చేరుకుంది. ఫైనాన్స్ కంపెనీలు సైతం ప్రత్యేక ఆఫర్ల, తగ్గింపులతో వినియోగదారులను ఆకర్షించటం వీటి పెరుగుదలకు దారితీసింది.
1. అందువల్ల క్రెడిట్ కార్డు హోల్డర్లు తమ కార్డును పోగొట్టుకున్నా లేక ఎవరైనా కార్డును దొంగిలిచ్చినా ముందుగా దీనిని సదరు బ్యాంకుకు రిపోర్ట్ చేయాలి. దీంతో వెంటనే కార్డు బ్లాక్ చేయటం జరుగుతుంది. ఇందుకోసం కార్డు హోల్డర్లు తక్షణమే కస్టమర్ కేర్ హెల్ప్‌లైన్ ద్వారా బ్యాంక్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. ఒక్కోసారి పరుసు పోగొట్టుకుంటే అందులో ఉన్న ప్రతి కార్డు విషయంలోనూ ఇదే ప్రక్రియను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. వెంటనే కార్డు మిస్సింగ్ గురించి రిపోర్టు చేయటం ద్వారా దానిని ఇతరులు దుర్వినియోగం చేయటం నుంచి అడ్డుకోవచ్చు. దీనికి బదులు మరో కార్డు కావాలని సదరు బ్యాంక్ వద్ద దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

2. ముందుగా మీరు కార్డులు పోగొట్టుకున్నప్పుడు అందులో డబ్బు దొంగిలించబడ్డాయో లేదో తెలుసుకోవడానికి మీ క్రెడిట్ కార్డ్ ఖాతాని నిశితంగా గమనించాలి. ఈ క్రమంలో ఏదైనా అనుమానాస్పద లావాదేవీని గుర్తిస్తే.. వెంటనే దాని గురించి సదరు కార్డు ఇచ్చిన బ్యాంకుకు సమాచారం అందించి ఫిర్యాదు నమోదు చేయాల్సి ఉంటుంది.
3. మీ క్రెడిట్ కార్డ్ పోయినట్లయితే ముందుగా సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఫైల్ చేయవచ్చు. ఇది మీరు క్రెడిట్ కార్డ్ కోల్పోయినట్లు అధికారికంగా రికార్డ్ చేస్తుంది. దీనిద్వారా ఎవరైనా వ్యక్తులు సదరు కార్డు వినియోగించి ట్రాన్సాక్షన్స్ చేపట్టి కార్డులు దుర్వినియోగమైతే మిమ్మల్ని రక్షిస్తుంది.
4. పైగా క్రెడిట్ కార్డ్ కోల్పోయిన విషయాన్ని క్రెడిట్ కార్డ్ బ్యూరోకి తెలియజేయండి. ఏదైనా దుర్వినియోగం కారణంగా మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడకుండా ఈ చర్య రక్షిస్తుంది. అలాగే మీ క్రెడిట్ నివేదికను పర్యవేక్షించి, ఏవైనా వ్యత్యాసాలు గమనిస్తే దానిని బ్యూరోకి నివేదించాలి. అది మీ క్రెడిట్ స్కోర్ ప్రభావితం కాకుండా కాపాడుతుంది.
5. చివరగా మీకు రీప్లేస్‌మెంట్ కార్డ్‌లు వచ్చినప్పుడు.. సర్వీస్ అంతరాయాలను నివారించడానికి కోల్పోయిన క్రెడిట్ కార్డ్‌లతో లింక్ చేయబడిన అన్ని ఆటోమేటిక్ పేమెంట్‌లను అప్‌డేట్ చేయటం కార్డుదారుడిని రక్షిస్తుంది.


Click it and Unblock the Notifications