Kalyan Jewellers: భారీగా పెరిగిన కళ్యాణ్ జ్యువెలర్స్ స్టాక్..!

మంగళవారం కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా (Kalyan Jewellers India) షేరు 3.99 శాతం పెరిగింది. ఈ రోజు ఈ స్టాక్ రూ.19.10 పెరిగి రూ. 529.75 వద్ద స్థిరపడింది. గత నెలలో కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్లు 38.51 శాతం పెరిగింది. ఇదే సమయంల షేరు ధర రూ. 147.50 పెరిగింది. గత ఆరు నెలల్లో ఈ స్టాక్ 10.43 శాతం లాభపడింది. జూలై 13న ఈ కంపెనీకి సంబంధించి బల్క్ డీల్ జరిగింది. HRTI ప్రైవేట్ లిమిటెడ్ కళ్యాణ్ జ్యువెలర్స్‌కు చెందిన 81,17,916 షేర్లను సగటున ఒక్కో షేరుకు రూ. 509.67 చొప్పున కొనుగోలు చేసింది. గ్రావిటన్ రీసెర్చ్ క్యాపిటల్ LLP కూడా 1,05,93,217 షేర్లను సగటున ఒక్కో షేరుకు రూ. 502.88 చొప్పున కొనుగోలు చేసింది.

మంగళవారం నాడు కూడా ఈ స్టాక్ లాభాలను కొనసాగిస్తూ బలమైన ర్యాలీని ప్రదర్శించింది. కంపెనీకి సంబంధించిన మొదటి త్రైమాసిక (Q1) వ్యాపార వివరాలు వెలువడిన తర్వాత స్టాక్ ధరలో కాస్త ఒత్తిడి కనిపించింది. ఆ తర్వాత స్టాక్ మళ్లీ పుంజుకుంది. తాజా షేర్ హోల్డింగ్ వివరాల పరిశీలిస్తే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (FII) వాటా 2025 డిసెంబర్ నాటికి 14.11 శాతం ఉండగా.. అది 2026 మార్చి నాటికి 14.55 శాతానికి పెరిగింది. ప్రమోటర్ల వాటా కూడా 62.75 శాతం నుంచి 62.86 శాతానికి పెరిగింది. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారుల వాటా 15.23 శాతం నుంచి 14.13 శాతానికి తగ్గింది. డిసెంబర్ 2025లో 7.90 శాతంగా ఉన్న పబ్లిక్ వాటా, మార్చి 2026 నాటికి 8.46 శాతానికి పెరిగింది.

Kalyan

కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా లిమిటెడ్ అనేది కేరళలోని త్రిసూర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఒక ఆభరణాల రిటైల్ సంస్థగా ఉంది. ఈ కంపెనీని 1993లో స్థాపించారు. భారతదేశం, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వజ్రం, ఇతర ఆభరణాల విభాగాలలో ఈ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. కల్యాణ్ జ్యువెలర్స్ వ్యాపార పోర్ట్‌ఫోలియోలో భాగంగా 'కాండెరే' అనే జ్యువెలరీ వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తోంది. కళ్యాణరామన్ ఈ కల్యాణ్ జ్యువెల్లరీ షాపును మొదటగా త్రిసూర్ లో ప్రారంభించారు. తర్వాత తన వ్యాపారాన్ని విస్తరించారు.

ఆ తరువాత కళ్యాణ్ జ్యువెలర్స్ దుకాణాలు కేరళలోకాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రారంభించారు. ప్రస్తుతం కళ్యాణ్ జ్యువెలర్స్ కు దేశంలో 350 కంటే ఎక్కువ స్టోర్లు ఉన్నాయి. కళ్యాణ్ జ్యువెలర్స్ వ్యాపారం దేశంలోనే కాకుండా విదేశాలకు కూడా విస్తరించింది. కళ్యాణ్ జ్యువెలర్స్‌కు యుఎఇ, ఖతార్, కువైట్, ఒమన్‌లలో 30 షోరూమ్‌లు ఉన్నాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+