రిలయన్స్ జియో తన ఈ-కామర్స్ పోర్టల్ జియో మార్టును 200 నగరాల్లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. చాలాకాలం పరీక్షించిన అనంతరం వెబ్ సైట్‌ను కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. ఇప్పటికే పలు ప్రాంతాల నుండి ఆర్డర్స్ తీసుకుంటోంది. ఎంపిక చేసిన ఉత్పత్తులపై ఎంఆర్‌పీలో కనీసం 5 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నట్లు ఈ పోర్టల్ తెలిపింది. నిత్యావసర వస్తువులతో పాటు వ్యవసాయ ఉత్పత్తులను కూడా అందిస్తోంది.

చిన్న కిరాణా నెట్ వర్క్ స్టోర్స్ చేరుకునేందుకు.. డిస్కౌంట్
వ్యవసాయ ఉత్పత్తులను తమతో భాగస్వామ్యం కుదుర్చుకున్న రైతుల నుంచి నేరుగా సేకరిస్తోందని తెలుస్తోంది. జియో మార్ట్ కోసం వాట్పాప్‌తో ఒక వాణిజ్య ఒప్పందం సంతకం చేసినట్లు జియో తెలిపింది. రిలయన్స్‌లో వాట్పాస్ మాతృసంస్థ ఫేస్‌బుక్ ఇటీవల షేర్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. భారత్‌లోని చిన్న కిరాణా నెట్ వర్క్ స్టోర్స్‌ను చేరుకోవడం కోసం జియో మార్ట్ ఈ టెక్నాలజీని వినియోగిస్తోంది.

వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసే ఫీచర్
ఇప్పటికే జియో మార్ట్ తన కొనుగోలుదారులకు వాట్సాప్ ద్వారా ఆర్డర్స్ పెట్టేందుకు వీలుగా ఓ ఫీచర్‌ను తీసుకు వచ్చింది. ప్రస్తుతానికి నేవీ ముంబై, థానే, కళ్యాణ్ వంటి ఎంపిక చేసిన ప్రాంతాలకు దీనిని పరిమితం చేసింది. త్వరలో దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించనుంది.

అంతకు తగ్గితే డెలివరీ ఫీజు రూ.25
కస్టమర్లకు ఎంఆర్‌పీ పైన 5 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. ఏ వస్తువు ధర అయినా రూ.100 ఉంటే దాని ధర జియో మార్ట్‌లో రూ.95గా ఉంటుంది. కస్టమర్లు రూ.750 కంటే తక్కువ ఆర్డర్ ఇస్తే డెలివరీ ఫీ కింద రూ.25 ఉంటుంది.

వివిధ రకాల వస్తువులు..
పండ్లు, కూరగాయలు, డెయిరీ ఉత్పత్తులు, బేకరీ ఐటమ్స్, పర్సనల్ కేర్, హోమ్ కేర్, బాడీ కేర్ వంటి నిత్యావసర వస్తువులను అందుబాటులోకి తెచ్చింది జియో మార్ట్. తమతో భాగస్వామ్యం కుదుర్చుకున్న రైతుల నుండి నేరుగా వ్యవసాయ ఉత్పత్తులను తీసుకుంటున్నట్లు తెలిపింది. రిలయన్స్ ఫ్రెష్ సూపర్ మార్కెట్లకు రైతులు నేరుగా తాము పండించి పండ్లు, కూరగాయలు అందిస్తున్నారు. ఇప్పుడు జియో మార్ట్ 200 నగరాలలో ఆర్డర్స్ కోసం లాంచ్ చేశారు. హైదరాబాద్ వంటి అన్ని మెట్రో నగరాలతో పాటు విశాఖపట్నం, మైసూర్, కోయంబత్తూర్, డెహ్రాడూన్, భటింద్రా వంటి టైర్ 1, టైర్ 2 నగరాల్లోను అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications