ఇటీవల సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్, ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోలో 9.99 శాతం వాటాను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థగా అవతరించేందుకు ఇరు సంస్థలు జట్టు కట్టాయి. వాట్సాప్‌లో పైలట్ ప్రాజెక్టుగా జియో మార్ట్ సేవలను ప్రారంభించింది. పెట్టుబడుల ప్రకటన చేసిన మూడు నాలుగు రోజుల్లోనే సేవలు ప్రారంభించాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది.

నెంబర్ ఇదే
ముంబై పరిసరాల్లోని నేవీ ముంబై, థానే, కళ్యాణ్ ప్రాంతాల్లో ఈ సేవలు లభ్యమవుతున్నాయి. తాజా ఒప్పందం ద్వారా 400 మిలియన్ల వాట్సాప్ యూజర్లతో నేరుగా కనెక్ట్ కనెక్ట్ కావొచ్చు. ఎంపిక చేసిన ముంబై పరిసర ప్రాంతాల్లో 88500 08000 నెంబర్‌కు తమ ఫోన్‌లో వాట్సాప్ చేయడం ద్వారా జియో మార్ట్ సేవలు పొందవచ్చు.

ఇలా ఆర్డర్ చేయాలి
ఆ నెంబర్‌కు మీరు సందేశం పంపిస్తే జియో మార్ట్ నుండి మీ ఫోన్‌కు లింక్ వస్తుంది. అది కేవలం అరగంట మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకో పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ అడ్రస్, ఫోన్ నెంబర్ వివరాలు ఇవ్వాలి. ఆ తర్వాత అక్కడి వస్తువుల్లో మీకు కావాల్సిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు. ఆర్డర్ పూర్తయ్యాక వెంనటే మీ మొబైల్ నెంబర్‌కు సంబంధిత కిరాణా స్టోర్ వివరాలు అదే వాట్సాప్ ద్వారా అందుకుంటారు. మీ ఆర్డర్ సిద్ధమయ్యాక మీకు నోటిఫికేషన్ వస్తుంది.

ప్రస్తుతానికి క్యాష్ ఆర్డర్లు మాత్రమే
ప్రస్తుతం పై ప్రాంతాల్లో క్యాష్ ఆర్డర్లు మాత్రమే ఉన్నాయి. అంతేకాదు, స్టోర్‌కు కస్టమర్లే వెళ్లి తీసుకోవాలి. రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ గత ఏడాది ఈ-కామర్స్ విభాగం జియో మార్ట్‌ను ప్రారంభించింది. దీనికి దేశ్ కి నయా దుకాణ్ అని క్యాప్షన్ పెట్టింది. అమెజాన్, ఫ్లిప్‍కార్ట్ వంటి వాటికి పోటీగా తీర్చిదిద్దేందుకు సిద్ధమైంది. ఇటీవలే ఫేస్‍బుక్‌తో జత కట్టింది. జియో మార్ట్ ద్వారా 3 కోట్ల మంది చిన్న వ్యాపారులకు ప్రయోజనం చేకూరనుంది.


Click it and Unblock the Notifications