Home: ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ పని చేయండి..!
సిటీల్లో చాలా మంది అద్దె ఇంట్లోనే ఉంటారు. అయితే వారికి సొంత ఇల్లు కొనుగోలు చేయాలని ఉంటుంది. రూపాయి రూపాయి కూడబెట్టుకుని ఇల్లు కొనే ప్రయత్నం చేస్తారు. అయితే ఇల్లు కొనుగోలు చేయడం ఆషామాషీ విషయం కాదు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. అందుకే ఇల్లు కొనుగోలు చేసే ముందు, నిర్మించే ముందు వెనక ముందు పదిసార్లు ఆలోచించాలి. లోన్ తీసుకుని ఇల్లు కొనుగోలు చేస్తే తిరిగి ఆ రుణం ఎన్ని సంవత్సరాలు చెల్లించాలి. ఇల్లు కొనుగోలు చేస్తే అందులో అద్దె ఎంత వస్తుంది. మనమే ఉంటే ఎంత వర్కౌట్ అవుతుందని పరిశీలించాలి.
ఇల్లు కొనుగోలు చేసేవారికి ఒక నియమం ఉంటుంది. అదే 20x నియమం. ఇది ఇంటి ఖరీదు, అద్దెను దాని అద్దె విలువతో పోల్చడానికి ఒక సులభమైన మార్గంగా పని చేస్తుంది. ఇది ధర-అద్దె నిష్పత్తిపై ఆధారపడి ఉంటుంది. మీరు ఒక ఇంట్లో అద్దెకు ఉంటే మొత్తం అద్దె ఎంత చెల్లిస్తారు. మీరు చెల్లించే అద్దె ఇంటి కొనుగోలు ధర కంటే ఎక్కువ ఉందా.. తక్కువ ఉందా తెలుసుకోవచ్చు.

20x నియమం ఫార్ములా:
ఆస్తి ధర ÷ వార్షిక అద్దె (నెలవారీ అద్దె × 12)
ఆస్తి కొనుగోలు ధరకు ఎన్ని సంవత్సరాల అద్దె సమానమవుతుందో ఈ ఫలితం చూపిస్తుంది. ఈ లెక్కింపు రుణ EMI, పన్నులు, నిర్వహణ లేదా విలువ పెరుగుదల వంటి అదనపు అంశాలను పరిగణనలోకి తీసుకోదు.
ఉదాహరణకు, ఒక ఇంటి ఖరీదు రూ.60 లక్షలు, వార్షిక అద్దె రూ.3 లక్షలు (నెలకు రూ25,000) అనుకుందాం.
రూ.60 లక్షలు ÷ రూ.3 లక్షలు = 20
ఆస్తి ధర 20 సంవత్సరాల అద్దెకు సమానం, ఇది కొనుగోలు, అద్దె ఖర్చులు దాదాపు సమతుల్యంగా ఉన్నాయని సూచిస్తుంది.
ఇల్లు ధర రూ.80 లక్షలు అనుకుంటే
రూ.80 లక్షలు ÷ రూ.3 లక్షలు = 26.7
ఈ నిష్పత్తి 20 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంది. ఇది అద్దె ప్రయోజనంతో పోలిస్తే ఆస్తి ఖరీదైనదిగా ఉంది. అందువల్ల ఇక్కడ ఇల్లు కొనడం కంటే అద్దెకు ఉండడమే బెటర్.
అదే విధంగా, రూ.50 లక్షల ధర కలిగిన ఆస్తికి సంవత్సరానికి రూ.3 లక్షల అద్దె.
రూ.50 లక్షలు ÷ రూ.3 లక్షలు = 16.7
ఈ నిష్పత్తి 20 కంటే తక్కువగా ఉంది. ఇది అద్దె కంటే సొంత ఇల్లు కలిగి ఉండటమే మంచిదని సూచిస్తుంది.
ఒక ఆస్తి దాని అద్దె విలువకు అనుగుణంగా సహేతుకమైన ధరకు ఉందో లేదో ఈ నియమం తెలియజేస్తుంది. వర్తించే వడ్డీ రేట్లు, ఆస్తి విలువ పెరుగుదల, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, నిర్వహణ ఖర్చులతో సహా ఇతర అంశాలతో పాటు దీనిని కూడా పరిగణలోకి తీసుకోవాలి.
ఉదాహరణకు మీరు ఒక ఇంట్లో అందుకు ఉంటున్నారు. అద్దె రూ.15 వేలు అనుకుంటే రూ. 1.80 లక్షలు అవుతాయి. 20 సంవత్సరాలు అద్దెకు ఉంటే రూ. 36,00, 000 అవుతాయి. అయితే మీ అద్దె పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అది రూ.40,00, 000 అనుకోవచ్చు. ఇక మీరు కొనుగోలు చేయాల్సిన ఇంటి ధర రూ.50 లక్షలు అనుకుంటే.. లోన్ ఈఎంఐ 20 ఏళ్లు పెట్టుకుంటే మీరు నెలకు రూ. 20,800 చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ అద్దెకు ఉండడమే బెటరని తెలుస్తోంది. ఒక ఇంటి ధర రూ.40 లక్షలు అయితే కొనుగోలు చేయడమే బెటర్ గా ఉంటుంది.


Click it and Unblock the Notifications