Card Blocking: మీ డెబిట్ కార్డు పోయిందా, వెంటనే ఇలా బ్లాక్ చేయండి

మీరు క్రెడిట్ కార్డును లేదా డెబిట్ కార్డును పోగొట్టుకుంటే మొదట చేయాల్సిన పని దానిని బ్లాక్ చేయడం. ఇదివరకు దుకాణం లేదా షాపింగ్ లేదా బయటకు వెళ్లినప్పుడు జేబులో పర్సు, ఆ పర్సులో డబ్బులు పెట్టుకునే వాళ్లం. కాలం మారింది. ఇప్పుడు నిత్యావసరాలు మొదలు యుటిలిటీ బిల్లుల వరకు ప్రతి పేమెంట్ కూడా డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తున్నాం. ఇందులో మరీ ఎక్కువగా డెబిట్ కార్డును వినియోగిస్తున్నాం. ఎందుకంటే దాదాపుగా అకౌంట్ తీసిన ప్రతి ఒక్కరికి డెబిట్ కార్డు ఉంటుంది. దీనిని విరివిగా వినియోగిస్తున్నారు. ఇలాంటి డెబిట్ కార్డు పోయినప్పుడు వెంటనే దానిని బ్లాక్ చేయాలి.

వెంటనే బ్లాక్ చేయవచ్చు

వెంటనే బ్లాక్ చేయవచ్చు

పొరపాటున మీరు మీ డెబిట్ కార్డును పోగొట్టుకుంటే బ్యాంకుకు వెళ్లి కొత్త కార్డు తీసుకునేలోపు సైబర్ మోసగాళ్ల బారినపడే అవకాశముంది. సైబర్ నేరగాళ్లకు ఆ కార్డు దొరికితే మన ఖాతాలోని మొత్తం కాజేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వెంటనే నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా డెబిట్ కార్డును బ్లాక్ చేయవచ్చు. బ్యాంకులు ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తమ కస్టమర్లకు కార్డు బ్లాకింగ్ సౌకర్యాన్ని అందిస్తోంది. దానిని చాలా తేలిగ్గా ఐవీఆర్ సిస్టంలో వెంటనే బ్లాక్ చేయడంతో పాటు కొత్త కార్డును పొందే సౌకర్యాన్ని తీసుకు వచ్చింది. ఇందుకు ఖాతాదారులు టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయాలి. ఎమర్జెన్సీ సమయంలో ఈ సదుపాయం అందుబాటులో ఉండేందుకు బ్యాంకు ఖాతాతో మొబైల్ నెంబర్‌ను తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి.

ఏటీఎం కార్డు బ్లాక్ చేయండిలా

ఏటీఎం కార్డు బ్లాక్ చేయండిలా

- మొదట www.onlinesbi.com లోకి లాగ్-ఇన్ కావాలి. మీ యూజర్ నేమ్, పాస్ వర్డ్ సహాయంతో లాగ్-ఇన్ కావాలి.

- ఏటీఎం కార్డ్ సర్వీసెస్‌ను ఎంచుకొని, e-Services ట్యాబ్‌లోని Block ATM Card ను ఎంచుకోవాలి.

- మీరు బ్లాక్ చేయాలనుకునే అకౌంట్‌ను ఎంచుకోవాలి. అంటే ఏ ఏటీఎం కమ్ డెబిట్ కార్డును బ్లాక్ చేయాలనుకుంటున్నారో దానిని ఎంచుకోవాలి.

- అక్కడ యాక్టివ్, బ్లాక్ అయిన కార్డ్స్ కనిపిస్తాయి. అక్కడ మొదటి నాలుగు, చివరి నాలుగు డిజిట్స్ (కార్డు డిజిట్స్) కనిపిస్తాయి.

- కార్డును సెలక్ట్ చేసుకోవాలి. బ్లాక్ చేయాలనుకుంటే Submit పైన క్లిక్ చేయాలి. వివరాలు వెరిఫై చేసుకొని, కన్ఫర్మ్ చేయాలి.

- ఎస్సెమ్మెస్ ఓటీపీ లేదా ప్రొఫైల్ పాస్ వర్డ్‌గా ప్రామాణీకరణ మోడ్‌ను ఎంచుకోండి.

- తర్వాత మీరు ఎంచుకున్న దానిని బట్టి ఓటీపీ పాస్ వర్డ్‌ను లేదా ప్రొఫైల్ పాస్ వర్డ్‌ను ఎంటర్ చేయాలి. కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి.

- ఆ తర్వాత మీకు టిక్కెట్ నెంబర్‌తో సక్సెస్ మెసేజ్ వస్తుంది. భవిష్యత్తు రిఫరెన్స్ కోసం ఈ టిక్కెట్ నెంబర్‌ను అట్టిపెట్టుకోవాలి.

ఇలా కూడా..

ఇలా కూడా..

ఎస్బీఐ ఏటీఎం కార్డును ఇతర మార్గాల్లోను బ్లాక్ చేయవచ్చు. ఫోన్ బ్యాంకింగ్ ద్వారా కూడా బ్లాక్ చేయవచ్చు. 24X7 టోల్ ఫ్రీ నెంబర్ 1800-11-2211, 1800-425-3800 లేదా ల్యాండ్ లైన్ నెంబర్ 080-26599990కు కాల్ చేయడం ద్వారా బ్లాక్ చేయవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+