ఈ రోజుల్లో ఒక సామాన్యుడు ఎంత సంపాదించినా నెలాఖరుకు వచ్చేసరికి చేతిలో రూపాయి కూడా ఉండదు. జీతం వచ్చిన వెంటనే రేషన్, కరెంటు బిల్లు, ఇంటి రెంట్, పేపర్ బిల్ ఇలా చాల ఖర్చులకి అయిపోతుంది. అలాంటిది ఒక వ్యక్తి ఏదైనా మంచి సిటీ లేదా నగరంలో జీవనం కొనసాగించాలంటే ఎంత సంపాదిస్తూ ఉండాలి.. ఎందుకంటే పెద్ద పెద్ద నగరాల్లో ప్రతిది కాస్ట్లి గానే ఉంటాయి. అయితే బెంగళూరులోని సిలికాన్ సిటీలో మీరు ఎంత పనిచేసినా, అది చాలా తక్కువే. ఎందుకంటే ఇక్కడ పెద్ద మొత్తంలో వచ్చే జీతం కూడా నెలాఖరుకి ఖాళీగా అయిపోతుంది. కుటుంబంలో అందరూ పనిచేస్తున్నగాని ఇక్కడి ఖర్చులను భరించలేరు. లక్షల్లో జీతాలు సంపాదించే వారు కూడా నెలాఖరులో పర్సులు ఖాళీ అవుతున్నట్లు చూపిస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ అద్దె ఒక్క పెద్ద భారం అయితే, మిగతా ఖర్చులన్నీ మరోవైపు తలనొప్పి. కానీ ఇవన్నీ ఉన్న కూడా బెంగళూరుకు చెందిన ఒక యువకుడు 20 వేల జీతంతో హాయిగా జీవితాన్ని గడపవచ్చని చూపించాడు. ఇది విన్న ప్రజలు షాకవుతూ "అవునా" అంటూ నోరెళ్లబెడుతున్నారు.

కర్ణాటక రాజధాని నగరం బెంగళూరు రోజురోజుకూ తనంతట అదే అభివృద్ధి చెందుతోంది. కాబట్టి ఇక్కడ ప్రతిదీ ఖరీదైనదే. ఇంటి అద్దె, రవాణా సమస్యలు ఇతర ఖర్చులను జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో 22 ఏళ్ల రెడ్డిట్ యూజర్ తన జీవితం గురించి వివరాలను షేర్ చేస్తూ ఇది ఒక ప్రత్యేకమైన విషయాన్ని తెలిపాడు.
ఏంటంటే అతను రోజు ఉండే ఖర్చుల గురించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్‌లో పోస్ట్ చేసాడు. జీవితం ఎలా ఈజీ అయిందో ప్రతిదీ వివరిస్తూ పోస్టులో పేర్కొన్నాడు. ఈ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు ప్రతిచోటా వైరల్ అవుతోంది. దీనితో పాటు, చాల మంది నిపుణులు, విద్యార్థులు ఇంకా యువజన సంఘాలు కూడా వారి ఆలోచనలను పంచుకున్నాయి ఇంకా దీనికి సంబంధించి చర్చలు కూడా జరిగాయి.
1. ఇంటి అద్దె: వైట్‌ఫీల్డ్‌లోని 2BHK అపార్ట్‌మెంట్‌లో అతను అతనితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కలిసి నివసిస్తున్నారు. ఈ ఇంటి అద్దె రూ. 23,000. కానీ వీళ్ళ ఇంటి ఖర్చులు మొత్తం చూస్తే రూ. 9,000 మాత్రమే.
2. ఫుడ్ ఇంకా తిండి ఖర్చులు: వీరు డబ్బు ఆదా చేసుకునే మరో మార్గం ఏమిటంటే, బయట తినడానికి బదులుగా ఇంట్లో వంట చేయడం. ఇలా చేయడం ద్వారా ఖర్చులను తగ్గించుకోవచ్చు ఇంకా డబ్బు ఆదా చేసుకోవచ్చు. దీని వలన అతను 3 నుండి 4 వేల రూపాయలు ఆదా చేస్తున్నట్లు తెలిపాడు.
3. లైఫ్ స్టయిల్ అప్షన్: ఈ యువకుడి బడ్జెట్ కేవలం ఖర్చులను తగ్గించడం గురించి కాదు, ఉద్దేశపూర్వకంగా ఛాయిస్ చేసుకుంటున్నాడు. ఉదాహరణకు, అతను సిగరెట్ ఇంకా మద్యం సేవించడం మానేసి పార్టీలకి దూరంగా ఉండటం వల్ల అతనికి ప్రతి నెలా చాలా డబ్బు ఆదా చేస్తుంది. బెంగళూరు ప్రాంతంలోని ఉన్నత స్థాయి వ్యాపారాలలో అద్దె, రవాణా ఖర్చులు, ఇంధన ధరలు, విద్యుత్ సప్లయ్ మరింత కాస్ట్లీ అవుతున్నాయి. టెక్నాలజీ రంగంలో బెంగళూరులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, టెక్నాలజీ పరిశ్రమలలో విశ్లేషకులు నెలకు రూ.20,000-25,000ల మధ్య ఖర్చు చేస్తుంటారు. ఎందుకంటే రెంట్, ఫుడ్ ఇతర రవాణా ఖర్చులను తగ్గించడానికి ఎటువంటి ఆల్టార్నేటివ్ లేదు కాబట్టి.
బెంగళూరులోని హైకోర్టు, ఆర్థిక సంస్థలు, హోటళ్లు మొదలైన వాటితో సహా అత్యధిక జనాభా ఉన్న చాల నగరాలు ఇంటర్నెట్ సదుపాయం కారణంగా ఖరీదైనవిగా మారాయి. అందుకే ఇలా చేయడం వల్ల ఒక సామాన్యుడు 20వేలతో బెంగుళూరులో హాయిగా ఎలా బతకవచ్చో అద్దం పడుతుంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications