Gold ETF: గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడి లాభమా లేక నష్టమా..!
గత ఏడాదిన్నరగా బంగారం ధర భారీగా పెరిగింది. అయితే బంగారం ఇంకా పెరుగుతుందా లేక ఇంకా తగ్గుతుందా.. లేదా ఇదే స్థాయిలో కొనసాగుతుందా అని చాలా మంది సందేహాలు వ్యక్త చేస్తున్నారు. బంగారం పెట్టుబడి పెట్టాలంటే ఫిజికల్ గా బంగారం కొనాలా, లేక డిజిటల్ పసిడి కొనాలా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అయితే ప్రస్తుతం బంగారంలో భారీ పెట్టుబడి సురక్షితం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికీ పసిడిలో మంచి రన్నప్ కనిపించిందని.. ఇదే స్థాయిలో భవిష్యత్ బంగారం ధర పెరిగేందుకు అవకాశం లేదని అంచనా వేస్తున్నారు.
ఒక వేళ బంగారం లో పెట్టుబడి పెట్టాలనుకునే వారు గోల్డ్ ఈటీఎఫ్ లో సిప్ రూపంలో పెట్టుబడి పెడితే కాస్త రిస్క్ తక్కువగా ఉండే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ఫిజికల్ గోల్డ్ కొనడం కంటే ఈటీఎఫ్ ల్లో పెట్టుబడి మేలని చెబుతున్నారు. గోల్డ్ ఈటీఎఫ్ అనేది ఒక రకమైన మ్యూచువల్ ఫండ్. ఇందులో మీకు యూనిట్లు కేటాయిస్తారు. బంగారం ధర పెరిగితే ఈ యూనిట్ల విలువ కూడా పెరుగుతుంది. అంటే చేతిలో బంగారం లేకపోయినా, బంగారం ధర పెరుగుదల వల్ల వచ్చే లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది.

బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ముఖ్యంగా గోల్డ్ ఈటీఎఫ్ అనేది కీలకమని చెప్పుకోవచ్చు.ఈటీఎఫ్ ఫండ్స్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజి లో ట్రేడ్ అవుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే వారు సిప్ రూపంలో అంటే నెలకు కొంత పెట్టుబడి పెడితే నష్టభయం తక్కువగా ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఏక మొత్తంలో పెట్టుబడి పెట్టే బదులుగా సిప్ పద్ధతి బెటరని సూచిస్తున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈటీఎఫ్స్ లో నిప్పాన్ ఇండియా గోల్డ్ బీస్ ఈటీఎఫ్, ఎస్‌బీఐ గోల్డ్ ఈటీఎఫ్, హెచ్‌డీఎఫ్‌సీ గోల్డ్ ఈటీఎఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్, కోటక్ గోల్డ్ ఈటీఎఫ్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ గోల్డ్ ఈటీఎఫ్, మీరే అసెట్ గోల్డ్ ఈటీఎఫ్, యూటీఐ గోల్డ్ ఈటీఎఫ్, యాక్సిస్ గోల్డ్ ఈటీఎఫ్, ఇన్వెస్కో ఇండియా గోల్డ్ ఈటీఎఫ్, క్వాంటమ్ గోల్డ్ ఈటీఎఫ్, ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్ గోల్డ్ ఈటీఎఫ్, జెరోధా గోల్డ్ ఈటీఎఫ్, బరోడా బీఎన్‌పీ పారిబాస్ గోల్డ్ ఈటీఎఫ్, యూనియన్ గోల్డ్ ఈటీఎఫ్, ఎడెల్‌వైస్ గోల్డ్ ఈటీఎఫ్, 360 వన్ గోల్డ్ ఈటీఎఫ్, చాయిస్ గోల్డ్ ఈటీఎఫ్, ఏంజెల్ వన్ గోల్డ్ ఈటీఎఫ్ ఉన్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications