లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీలు ఎలక్ట్రానిక్ పద్ధతిలో జీవిత బీమా పాలసీలను జారీ చేసేందుకు ఇన్సురెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(IRDAI) అనుమతులు ఇచ్చింది. కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకు పెరుగుతోన్న విషయం తెలిసిందే. దీంతో సాధారణ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో పాలసీలు జారీ చేసేందుకు పచ్చజెండా ఊపింది.
పాలసీ డాక్యుమెంట్, ప్రతిపాదన ఫారం, కాఫీని ఫిజికల్‌గా అందించడం వంటి కొన్ని నిబంధనల నుండి లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీలకు మినహాయింపులు ఇస్తూ IRDAI సర్క్యులర్ జారీ చేసింది. ఈ మినహాయింపు 2020-21 ఆర్థిక సంవత్సరంలో జారీ చేసే అన్ని పాలసీలకు వర్తిస్తుందని వెల్లడించింది. పాలసీ పత్రాల ప్రింటింగ్, డెలివరీ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని IRDAI ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు ఇందుకు సంబంధించి ఇబ్బందులను వెల్లడిస్తూ జీవిత బీమా సంస్థలు అభ్యర్థనలు పంపించాయి. దీంతో IRDAI ఓకే చెప్పింది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా 18,785,109 కేసులు నమోదు కాగా, 706,171 మరణాలు చోటు చేసుకున్నాయి. మన దేశంలోను కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇండియాలో కేసులు 1,945,236, మరణాలు 40,575గా ఉన్నాయి.


Click it and Unblock the Notifications