ఏప్రిల్ 1 నుంచి రూ.5 లక్షల వరకు బీమా: ఆరోగ్య సంజీవనిలో పాలసీదారు వాటా 5%
న్యూఢిల్లీ: ఆరోగ్య బీమా పాలసీకి సంబంధించి భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (IRDAI) గురువారం కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ నిమిత్తం ఇన్సురెన్స్ చేయించుకున్న ప్రతి ఒక్కరికీ కనీసం రూ.1 లక్ష నుంచి గరిష్టంగా రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమాను ప్రామాణికంగా అందించాలని సూచించింది.

అదే పేరుతో ఉండాలి...
ఈ ఆరోగ్య బీమాకు అన్ని బీమా కంపెనీలు కూడా ఆరోగ్య సంజీవని పాలసీ అని పేరు పెట్టి, చివరలో తమ కంపెనీ పేరు జత చేసుకోవచ్చునని IRDAI తెలిపింది. పత్రాలలో ఇతర పేర్లు వాడకూడదని తెలిపింది. అన్ని ఆరోగ్య, సాధారణ ఇన్సురెన్స్ కంపెనీలు ప్రామాణికంగా ఒక సమగ్ర హెల్త్ ఇన్సురెన్స్ ప్రోడక్ట్‌ని అందించాలనే ఉద్దేశ్యంతో ఆరోగ్య సంజీవిని పాలసీని రూపొందించినట్లు IRDAI తెలిపింది.

ప్రాథమిక జబ్బులకు కవరేజ్
ఆరోగ్య సంజీవని పాలసీ ప్రాథమిక జబ్బులకు కవరేజ్ తప్పకుండా అందించాల్సి ఉంటుంది. దీనికి ఆప్షనల్ కవరేజీ, జతకలపడం వంటివి చేయవద్దు. IRDAI మార్గదర్శకాలకు లోబడి ఇన్సురెన్స్ కంపెనీలు ప్రీమియం ధరను నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ప్రామాణిక ఉత్పత్తిని నష్ట పరిహార ప్రాతిపదికన ఇస్తారు. ఏడాది పాటు ఇన్సురెన్స్‌దారుకు కవరేజీ ఉంటుంది. ఆసుపత్రిలో చేరితే పరిమితులకు లోబడి అయ్యే ఖర్చులు, కంటి ఆపరేషన్స్, పంటి చికిత్స, గాయాలు, వ్యాధులు వల్ల ప్లాస్టిక్ సర్జరీ అయితే వాటికి అయ్యే ఖర్చు రోడ్ అంబులెన్స్ ఛార్జీలు ఈ పాలసీ కవరేజీకి వర్తిస్తాయి.

అందుకే ఈ పథకం..
ప్రస్తుతం వివిధ కంపెనీలు ఆఫర్ చేస్తోన్న ఒక్కో ఆరోగ్య బీమా పాలసీ నిబంధనలు ఒక్కోలా ఉన్నాయి. దీంతో ఏ కంపెనీ పాలసీ తీసుకోవాలో వినియోగదారుడికి తెలియడం లేదు. ఈ గందరగోళాన్ని తొలగించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు.

పాలసీకి ఎవరు అర్హులు...
- ఆరోగ్య సంజీవని పాలసీకి పాలసీకి 18-65 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు అర్హులు.
- దీనిని జీవితాంతం రెన్యూవల్ చేసుకోవచ్చు. కొన్ని షరతులకు లోబడి చేసుకోవాల్సి ఉంటుంది.
- గడువు ముగిసిన నెల రోజుల వరకు రెన్యూవల్ చేసుకునేందుకు అనుమతి
- 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు తప్పనిసరిగా ఈ పాలసీని అందించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా పాలసీ ఒకేలా ఉండాలి.
- ఇది పూర్తిగా రీయింబర్సుమెంట్ పాలసీ.
- బీమా కంపెనీ ఆరోగ్య సంజీవని పాలసీ పోర్టబులిటీ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి.
- ఈ పాలసీని క్రిటికల్ ఇల్‌నెస్ లేదా బెనిఫిట్ ఆధారిత కవరేజ్‌లతో కలపవద్దు.
- షరతులకు లోబడి IRDAI అనుమతి లేకుండా బీమా కంపెనీలు ఈ పాలసీ ప్రారంభించవచ్చు.

పాలసీదారూ చెల్లించాలి
- ఆసుపత్రి బిల్లులో పాలసీదారు 5 శాతం చెల్లించాలి.
- వ్యక్తిగత లేదా ఫ్యామిలీ ప్లోటర్ పద్ధతిలో తీసుకోవచ్చు.
- ఫ్యామిలీ పాలసీలో మూణ్నెళ్ల నుంచి 25 ఏళ్ల వరకు పిల్లలకు కవరేజీ
- పాలసీ ప్రీమియంపై బీమా కంపెనీదే నిర్ణయం
- యాడ్ ఆన్ ఆప్షన్స్, ఆప్షనల్ కవరేజ్ ఉండదు.
- ఆయుష్ ట్రీట్మెంట్ ఖర్చులకు పాలసీ వర్తించదు.
- క్లెయిమ్స్ లేకుంటే ప్రతి రెన్యువల్ 5 శాతం అదనంగా కవరేజ్ వర్తిస్తుంది.
- ఆసుపత్రిలో చేరే 30 రోజుల ముందు నుంచి అయ్యే ఖర్చులు, డిశ్చార్జ్ అయిన తర్వాత 60 రోజుల వరకు అయ్యే ఖర్చులు కవరేజీ కిందక్ వస్తాయి.


Click it and Unblock the Notifications