Mutual Funds: మిడ్, ప్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్లలోకి పెరిగిన పెట్టుబడులు..
జూన్ నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకి పెట్టుబడులు పెరిగాయి. మే నెలలో తగ్గిన పెట్టుబడులు జూన్ వచ్చేసరికి పెరిగాయి. మిడ్-క్యాప్, ఫ్లెక్సీ-క్యాప్, లార్జ్-క్యాప్ ఫండ్లలోకి కొత్త పెట్టుబడులు పెరిగాయి. అదే సమయంలో గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు) బలంగా పుంజుకున్నాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) కంట్రిబ్యూషన్లు జూన్ లో రూ. 31,000 కోట్ల మార్కుకు చేరుకున్నాయి. ఇందుకు సంబంధించి అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా నివేదిక విడుదల చేసింది.
యాక్టివ్‌గా నిర్వహించే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు జూన్‌లో రూ. 28,973.41 కోట్ల నికర నిధుల ప్రవాహం వచ్చింది. ఇది మే నెలలోని రూ. 22,907.77 కోట్లుగా ఉంది. డెట్ ఫండ్లలో ఉపసంహరణ కొనసాగింది. ఇది మేలో రూ. 64,021.17 కోట్లు ఉండగా.. జూన్ లో రూ. 52,948.78 కోట్లకు తగ్గింది. మిడ్-క్యాప్ ఫండ్లలోకి భారీగా నిధులు వచ్చాయి. రూ. 6,090.17 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గత నెలలో ఇది రూ. 4,385.06 కోట్లుగా ఉంది. ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్లలోకి కూడా పెట్టుబడులు పెరిగాయి. గత నెలలో రూ. 4,945.57 కోట్ల ఉండగా.. జూన్ లో రూ. 5,231.31 కోట్లకు పెరిగాయి.

లార్జ్-క్యాప్ ఫండ్లలో కూడా పెట్టుబడులు పెరిగాయి. మే నెలలో రూ. 1,592.93 కోట్లు రాగా జూన్ లో రూ. 2,067.48 కోట్లకు పెరిగాయి. ఇక స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లలోకి కూడా పెట్టుబడులు కొనసాగాయి. మే నెలలో రూ. 6,263.56 కోట్లు రాగా.. జూన్ లో రూ. 5,601.96 కోట్లు తగ్గాయి. సెక్టోరల్, థీమాటిక్ ఫండ్లలోకి నిధుల ప్రవాహం దాదాపు రెట్టింపు అయింది. రూ. 647.87 కోట్ల నుంచి రూ. 1,469.26 కోట్లకు పెరిగింది.
డెట్ ఫండ్లలో భారీ ఉపసంహరణలు
మే నెలలో రిడీమ్ అయిన రూ. 96,948.51 కోట్ల కంటే ఎక్కువగా జూన్ నెలలో పెట్టుబడిదారులు రూ. 1.09 లక్షల కోట్లను ఉపసంహరించుకోవడంతో డెట్ మ్యూచువల్ ఫండ్లు ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఉన్నాయి. డెట్ కేటగిరీలలో, లిక్విడ్ ఫండ్లు అత్యధికంగా రూ. 42,293.29 కోట్ల నిధుల ఉపసంహరణను నమోదు చేయగా, ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న లో-డ్యూరేషన్ ఫండ్లు రూ. 16,484 కోట్ల రిడెంప్షన్లను చవిచూశాయి. ఓవర్‌నైట్ ఫండ్లు కూడా ఒత్తిడిలోనే కొనసాగాయి. ఇవి రూ. 10,579.58 కోట్ల నికర నిధుల ఉపసంహరణను నమోదు చేశాయి.
జూన్ నెలలో హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్లు రూ. 12,892.76 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. హైబ్రిడ్ విభాగాలలో, ఆర్బిట్రేజ్ ఫండ్లు అత్యధికంగా రూ. 5,799 కోట్ల నిధులను ఆకర్షించగా, ఆ తర్వాతి స్థానాల్లో మల్టీ-అసెట్ అలోకేషన్ ఫండ్లు రూ. 4,810 కోట్లతో నిలిచాయి. మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ సిస్టమెటిక్ ఇన్వెస్ట మెంట్లు కొనసాగాయి. నెలవారీ సిప్ పెట్టుబడులు మే నెలలోని రూ. 30,954 కోట్ల నుంచి జూన్ నెలలో రూ. 31,781 కోట్లకు పెరిగాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications