Railway News: రైలు ప్రయాణికులకు శుభవార్త..! టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు తగ్గింపు..
IRCTC News: ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ నుంచి బుక్ చేసుకున్న వెయిటింగ్, RAC టిక్కెట్లను రద్దు చేసినట్లయితే, ఫెసిలిటీ ఫీజు పేరుతో భారీ మొత్తం వసూలు చేయబడుతోంది. అయితే ఇకపై ప్రజలకు దీని నుంచి ఉపశమనం లభించనుంది.
ఇప్పుడు అలాంటి టిక్కెట్లపై రైల్వే నిర్ణయించిన ఒక్కో ప్రయాణికుడికి రూ.60 టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీ మాత్రమే వసూలు చేయబడుతుందని గమనించాలి. గిరిదిహ్‌కి చెందిన సోషల్ కామ్ సామాజిక కార్యకర్త సునీల్ కుమార్ ఖండేల్‌వాల్ ఫిర్యాదు మేరకు ప్రయాణికులకు ఈ ఉపశమనం కల్పించాలని భారతీయ రైల్వేలు నిర్ణయించింది. తాజా నిర్ణయం మొత్తం దేశ ప్రజలకు ఊరటను కలిగిస్తోంది.

టికెట్ రద్దుపై ఐఆర్‌సీటీసీ ఏకపక్ష రుసుము వసూలు చేస్తుందని ఏప్రిల్ 12న ఖండేల్వాల్ రైల్వే అడ్మినిస్ట్రేషన్‌కు సామాజిక కార్యకర్త ఒక లేఖ పంపారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకున్న వెయిటింగ్ టిక్కెట్లు కన్ఫర్మ్ కాకపోతే రైల్వే స్వయంగా ఆ టిక్కెట్లను రద్దు చేస్తుందని అందులో తెలిపారు. ఈ సమయంలో ప్రయాణికులు చెల్లిస్తున్న మొత్తంలో ఎక్కువ భాగం సర్వీస్ ఛార్జ్‌గా వసూలు చేయబడుతోందని పేర్కొన్నారు.
ఉదాహరణగా రూ.190కి బుక్ చేసుకున్న వెయిటింగ్ టిక్కెట్ కన్ఫర్మ్ కాకపోతే, రైల్వే రూ.95 మాత్రమే రీఫండ్ వస్తుంది. అంటే దాదాపు సగం మెుత్తాన్ని రైల్వే టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు కోల్పోతున్నారన్నమాట. దీనిపై ఫిర్యాదును దృష్టిలో ఉంచుకుని IRCTC తాజాగా చర్యలు తీసుకుంది. టిక్కెట్ బుకింగ్, రీఫండ్‌లకు సంబంధించిన విధానాలు, నిర్ణయాలు, నియమాలు భారతీయ రైల్వేలకు సంబంధించినవని IRCTC మేనేజింగ్ డైరెక్టర్ ఏప్రిల్ 18న ఖండేల్‌వాల్‌కు బదులిచ్చారు.
పూర్తి వెయిట్‌లిస్ట్, RAC టికెట్ క్లర్కేజీ ఛార్జీల విషయంలో భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం ఒక్కో ప్రయాణికుడికి రూ.60 రద్దు ఛార్జీ విధించబడుతుందని ఖండేల్వాల్ పేర్కొన్నారు. రైల్వే చట్టాల్లోని అంశాన్ని రైల్వే అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తెచ్చినందుకు IRCTC MD సామాజిక కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. రైల్వే యంత్రాంగం ఈ విషయాన్ని గమనించి వెంటనే చర్య తీసుకున్నందుకు రైల్వే పరిపాలనకు ఖండేల్వాల్ రైల్వే ఎండీకి కృతజ్ఞతలు తెలిపారు.


Click it and Unblock the Notifications