సామాన్యులు ఎక్కడికైనా ప్రయాణించేందుకు అలాగే ప్రజల ప్రయాణ అవసరాలను తీర్చడంలో ఇండియన్ రైల్వే ముఖ్య పాత్ర పోషిస్తుంది. అసలు ప్రజలు రైలులో ప్రయాణించడానికి ముఖ్య కారణం టిక్కెట్టు ధర తక్కువగా ఉండటం ఇంకా మీ వెళ్లాల్సిన చోటుకి త్వరగా చేరుకోవచ్చు. రైలులో ప్రయాణించాలనుకునే వారు టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకుంటుంటారు. కానీ కొన్నిసార్లు అత్యవసరంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ప్రయాణీకులు తత్కాల్ ద్వారా టికెట్ తీసుకోవచ్చు. ఇప్పుడు భారతీయ రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ టైం మార్చింది. కొత్త నిబంధనల ప్రకారం ఏసీ కోచ్‌లకు తత్కాల్ టికెట్ బుకింగ్ ఉదయం 10 గంటలకు, నాన్ ఏసీ కోచ్‌లకు తత్కాల్ టికెట్ బుకింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఒకేసారి నలుగురి వరకు తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. 4 కంటే ఎక్కువ మంది ప్రయాణీకులకి ప్రి-బుకింగ్ ద్వారా తప్పనిసరిగా బుక్ చేసుకోవాలి. తత్కాల్ బుకింగ్‌కు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ ఇంకా ఇతర ప్రభుత్వ గుర్తింపు ప్రూఫ్ అవసరం.
తత్కాల్ టిక్కెట్ల విషయానికొస్తే, బుక్ చేసిన టిక్కెట్‌ను క్యాన్సల్ చేస్తే రిఫండ్ ఇవ్వదు. తత్కాల్ టిక్కెట్లు ఇంకా జనరల్ టిక్కెట్లను IRCTC వెబ్‌సైట్ లేదా IRCTC అప్లికేషన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. కన్ఫర్మ్ తత్కాల్ టిక్కెట్‌లకు అడ్వాన్స్ లాగిన్, UPI పేమెంట్, వివరాలు అవసరం. చాలా మంది టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు కాబట్టి బుక్ చేసుకునే టైంలో టిక్కెట్లు లేవని చూపించే అవకాశం ఉంది. కాబట్టి తత్కాల్ ఓపెన్ చేసిన వెంటనే రిజిస్టర్ చేసుకోవడం ముఖ్యం.

ఇండియన్ రైల్వే ఇప్పుడు సూపర్ యాప్ అనే అప్లికేషన్‌తో ముందుకు వచ్చింది. ఈ అప్లికేషన్ ద్వారా మీరు టికెట్ బుకింగ్, ట్రైన్ స్టేటస్ చెక్ సహా వివిధ సర్వీసెస్ పొందవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు రైల్వే ప్రయాణికులు టికెట్ బుకింగ్ కోసం IRCTC రైల్ కనెక్ట్, ఫుడ్ డెలివరీ కోసం IRCTC eCatering, కంప్లైంట్స్ కోసం Rail Madad, నాన్ ప్రీ-బుక్ టిక్కెట్ల కోసం UTS, ట్రైన్ స్టేటస్ కోసం నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ వంటి కొన్ని యాప్స్ అలాగే వెబ్‌సైట్‌లపై ఆధారపడేవారు. అయితే ఈ కొత్త సూపర్ యాప్ ఈ సేవలను అన్ని ఒకే చోటకు తీసుకువస్తుందని తేలిపింది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications