ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్(IOC) సిలిండర్ కస్టమర్లు తమ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(LPG) సిలిండర్‌ను రీఫిల్ చేసుకోవడానికి ఒక మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. ఐవోసీ ప్రకటన ప్రకారం ఇండేన్ గ్యాస్ కస్టమర్లు దేశవ్యాప్తంగా 8454955555 నెంబర్ ద్వారా గ్యాస్ రీఫిల్ కోసం బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిస్డ్ కాల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. 'మిస్డ్ కాల్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చునని, తద్వారా కస్టమర్లు పదేపదే కాల్ చేయడాన్ని నిరోధిస్తుంది' అని తన ప్రకటనలో తెలిపింది.

వీరికి ఎంతో ప్రయోజనకరం
ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (IVR)తో పోలిస్తే కాల్ ఛార్జీలు విధించబడవని తెలిపింది. ఐవీఆర్ కాల్స్ గురించి బాగా తెలియని వారికి, సీనియర్ సిటిజన్లకు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారికి ఈ సర్వీస్ ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించింది. ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. ఎల్పీజీ కస్టమర్ల కోసం ఈ మిస్డ్ కాల్స్ సేవలను ప్రారంభించారు. ఈ సేవలను మున్ముందు దేశమంతటికి విస్తరిస్తారు.

రోజు నుండి కొద్ది గంటలు...
ఎల్పీజీ డెలివరీ వ్యవధిని ఒకరోజు నుండి కొద్ది గంటల్లోకి తగ్గించేలా గ్యాస్ ఏజెన్సీలు, పంపిణీదారులు ప్రయత్నాలు చేయాలని కూడా ఈ సందర్భంగా కేంద్రమంత్రి కోరారు. ఎల్పీజీలో భారత్ చాలా దూరం ముందుకు వెళ్లిందని, 2014కు ముందు ఇచ్చిన ఎల్పీజీ కనెక్షన్లు 13 కోట్ల వరకు ఉంటే, గత ఆరేళ్లలోనే 30 కోట్లకు పైగా ఇచ్చినట్లు కేంద్రమంత్రి తెలిపారు.

ఇటీవలె కొత్త నెంబర్
కాగా, ఇండేన్ గ్యాస్ బుకింగ్ నెంబర్ ఇటీవల మారిన విషయం తెలిసిందే. నవంబర్ 1వ తేదీ నుండి కొత్త నెంబర్ అమలులోకి వచ్చింది. కస్టమర్ సౌలభ్యం కోసం ఇండియన్ ఆయిల్ దేశవ్యాప్తంగా ఇండేన్ ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ కోసం ఒక కామన్ నెంబర్‌ను ప్రారంభించింది. ఈ కామన్ బుకింగ్ నెంబర్ 7718955555. దేశానికి అంతటికీ ఇదే నెంబర్ వర్తిస్తుంది. కస్టమర్లకు 24x7 ఈ నెంబర్ అందుబాటులో ఉంటుంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications