ఆర్థిక మందగమనం, రెవెన్యూ కలెక్షన్స్ తగ్గడం వంటి వివిధ కారణాలతో భారత ఆర్థిక రంగాన్ని వృద్ధి పట్టాలకు ఎక్కించేందుకు కేంద్రం ఈ బడ్జెట్‌లో అనేక చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ గూడ్స్, కెమికల్స్, హ్యాండీ క్రాఫ్ట్స్ సహా దాదాపు 50 వస్తువులపై దిగుమతు సుంకాలు పెంచే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు.

మేకిన్ ఇండియా, ఉద్యోగాల కల్పన లక్ష్యంగా
ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి వృద్ధిని పెంచడం కోసం రానున్న బడ్జెట్లో కీలక ప్రకటనలు చేయనుంది మోడీ ప్రభుత్వం. మేకిన్ ఇండియా, ఉద్యోగాల కల్పన లక్ష్యంగా దిగుమతి సుంకాలపై టారిఫ్ పెంచనుంది. 50కి పైగా వస్తువులపై ఈ టారిఫ్ పెంచనుంది.

వీటిపై కస్టమ్ సుంకాలు పెంపు
ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ ఉత్పత్తులు, కెమికల్స్, హస్తకళలు, మొబైల్ ఫోన్ ఛార్జర్లు, పారిశ్రామిక రసాయనాలు, విద్యుత్ దీపాలు, ఫర్నీచర్, క్యాండిల్స్, ఆభరణాలు వంటి వివిధ వస్తువులపై కస్టమ్స్ డ్యుటీ పెంచనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

స్మార్ట్ ఫోన్ తయారీదారులపై తీవ్ర ప్రభావం
ఇది దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీదారులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు ఛార్జర్లు, ఇతర మొబైల్ భాగాల కోసం దిగుమతులపై ఆధారపడుతున్నాయి.

ఐకియా వంటి రిటైల్ సంస్థలు కూడా..
ఐకియా వంటి రిటైల్ సంస్థలు కూడా చాలా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాయి. దీంతో దిగుమతి సుంకాలు పెంచితే ఈ కంపెనీలపై అదనపు భారం తప్పదని అంటున్నారు. భారత సుంకాలు పెద్ద సవాల్ అని ఐకియా వంటివి ఇదివరకే చెప్పాయి.

5 శాతం నుంచి 10 శాతం తగ్గింపు..
ప్రభుత్వం ఇప్పటికే ఈ వస్తువులను గుర్తించినట్లుగా తెలుస్తోంది. వీటిపై 5 శాతం నుంచి 10 శాతం వరకు దిగుమతి సుంకాలు విధించనుందని తెలుస్తోంది. 56 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై ఈ దిగుమతి సుంకాలు పెరగనున్నాయి.

దిగుమతులు తగ్గించుకోవడం కోసం..
దిగుమతులు సాధ్యమైనంత మేర తగ్గించుకోవడం, అలాగే అత్యవసరం కానీ వస్తువుల దిగుమతులు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచడం ద్వారా స్థానిక మాన్యుఫ్యాక్చరర్లకు ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications