For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LIC అలర్ట్: ఈ ఫామ్ నింపకపోతే డబ్బు ఇరుక్కుపోతుంది! ఇలా లింక్ చేయండి

|

మీరు దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కస్టమర్ అయితే ఇది మీ కోసమే! మీ ఎల్ఐసీ పాలసీ మెచ్యూర్ అయితే లేదా మీరు మీ పాలసీపై రుణం తీసుకోవాలనుకుంటే మీరు NEFT ఫారమ్ నింపవలసి ఉంటుంది. మీరు ఈ ఫారంను నింపకపోతే కనుక మీ పాలసీ మెచ్యూరిటీ డబ్బును మీరు పొందలేరు. వాస్తవానికి ఎల్ఐసీ చెక్ పేయింగ్‌ని ఆపివేసింది. ఇప్పుడు ఈ బీమా సంస్థ పాలసీదారు బ్యాంకు ఖాతాకు నేరుగా బదలీ చేస్తోంది. అలాంటప్పుడు మీరు మీ ఎల్ఐసీ పాలసీని మీ బ్యాంకు ఖాతాకు లింక్ చేయాలి. లేదంటే క్లెయిమ్ చేసిన డబ్బు స్టక్ అవుతుంది.

గంగవరం పోర్టులో 58% వాటాలు కొనుగోలు చేసిన అదానీ, రుణరహిత ఓడ రేవు..గంగవరం పోర్టులో 58% వాటాలు కొనుగోలు చేసిన అదానీ, రుణరహిత ఓడ రేవు..

అదనపు రుసుము లేకుండా

అదనపు రుసుము లేకుండా

LIC ప్రకారం అదనపు ఖర్చు లేకుండా ఎక్కడి నుండైనా ప్రీమియం డబ్బును సరైన, సురక్షిత చెల్లింపులు చేయవచ్చు. అన్ని డిజిటల్ చెల్లింపులు అదనపు రుసుము లేకుండా ఉంటాయి. ఉచిత ఈ-సర్వీసెస్ కోసం, ఎల్ఐసీ కస్టమర్లు తమ కంపెనీ వెబ్ సైట్‌లోని పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి.

ఇలా లింక్

ఇలా లింక్

ఎల్ఐసీ పాలసీని బ్యాంకు ఖాతాకు లింక్ చేసే చేసే మార్గం చాలా సులభం. మీ సమీప ఎల్ఐసీ కార్యాలయానికి వెళ్లి నెఫ్ట్ మాండేట్ ఫారంను పూర్తి చేయాలి. ఈ ఫారంతో పాటు చెక్ క్యాన్సిలేషన్ కాపీని లేదా బ్యాంకు పాస్ బుక్‌ను సబ్‌మిట్ చేయాలి. వారం తర్వాత మీ పాలసీ మీ బ్యాంకు ఖాతాకు లింక్ చేయబడుతుంది. అనంతరం ఎల్ఐసీ నుండి వచ్చిన ఏదైనా డబ్బు నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి వస్తుంది. ఎల్ఐసీ ప్రకారం అదనపు ఖర్చు లేకుండా ఎక్కడి నుండైనా సరే, సరైన, సురక్షిత చెల్లింపులు చేయవచ్చు. వీటికి ఎలాంటి అదనపు ఖర్చు ఉండదు.

ఎల్ఐసీ శుభవార్త

ఎల్ఐసీ శుభవార్త

పాలసీ మెచ్యూరిటీ అయిన పాలసీదారులకు ఎల్ఐసీ శుభవార్త చెప్పింది. పాలసీ మెచ్యూరిటీ క్లెయిమ్ చేసేందుకు ఎల్ఐసీ పాలసీదారులు మార్చి 31వ తేదీలోగా దేశవ్యాప్తంగా తమ సమీపంలోని ఎల్ఐసీ కార్యాలయంలో సమర్పించవచ్చు. దేశవ్యాప్తంగా 113 డివిజన్ కార్యాలయాలు, 2048 బ్రాంచీలు, 1526 స్మాల్ ఆఫీస్‌లలో సమర్పించవచ్చు.

English summary

LIC అలర్ట్: ఈ ఫామ్ నింపకపోతే డబ్బు ఇరుక్కుపోతుంది! ఇలా లింక్ చేయండి | If you do not fill this form, then all your money will be stuck in LIC

If you are a customer of the country’s largest insurance company Life Insurance Corporation of India (LIC), then the news is of your use. If your LIC policy has matured or you are looking to take a loan on your policy, then you have to fill the NEFT mandate form.
Story first published: Tuesday, March 23, 2021, 16:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X