ఏ బ్యాంకు కస్టమర్ అయినా... ICICI సరికొత్త మొబైల్ యాప్
న్యూఢిల్లీ: దేశీయ రెండో అతిపెద్ద ICICI బ్యాంకు 'ఐమొబైల్ పే' పేరుతో సరికొత్త వర్షన్ మొబైల్ పేమెంట్ యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా వినూత్న ఆవిష్కరణతో ముందుకు వచ్చింది. ఇంటర్‌పోర్టబులిటీ ఫీచర్ కలిగి ఉండే ఈ యాప్ సాయంతో ICICI బ్యాంకు కస్టమర్లు మాత్రమే కాకుండా ఇతర బ్యాంకులకు చెందిన కస్టమర్లు కూడా యూపీఐ ఐడీని జనరేట్ చేసుకొని చెల్లింపులు జరపవచ్చు. షాపింగ్ చేయవచ్చు.
RBI సెక్యూరిటీ రూల్స్! జనవరి నుండి పిన్ లేకుండా రూ.5,000 వరకు ట్రాన్సాక్షన్స్

ఈ సేవలన్నీ...
ఐమొబైల్ పే ద్వారా ఏ బ్యాంకు ఖాతాకైనా, ఇతర పేమెంట్ యాప్స్‌కైనా, డిజిటల్ వ్యాలెట్లకైనా నగదు బదిలీ చేసుకోవచ్చు. బిల్ పేమెంట్స్, ఆన్‌లైన్ రీచార్జ్ వంటి ట్రాన్సాక్షన్స్ నిర్వహించుకోవచ్చు. అంతేకాదు, ఈ యాప్ ద్వారా సేవింగ్స్ అకౌంట్, ఇన్వెస్ట్‌మెంట్స్, లోన్స్, క్రెడిట్ కార్డ్స్, గిఫ్ట్ కార్డ్స్, ట్రావెల్ కార్డ్స్ వంటి ఇన్‌స్టంట్ బ్యాంకింగ్ సేవల్ని పొందవచ్చు. ఈ మేరకు ఐసీఐసీఐ బ్యాంకు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ తరహా యాప్ తొలిసారి
ఐసీఐసీఐ మొబైల్ చెల్లింపుల యాప్ కొత్త వర్షన్ ద్వారా ఇతర బ్యాంకుల కస్టమర్లు కూడా చెల్లింపులు, బ్యాంకింగ్ సేవలు పొందగలగడం విశేషం. దీనికి ఐమొబైల్ పేగా పిలుస్తున్నారు. ఈ తరహా యాప్ రావడం ఇదే తొలిసారి అని ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. కస్టమర్లు తమ కాంటాక్టులకు సంబంధించిన యూపీఐ ఐడీలను సుదీర్ఘకాలం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా ఇంటర్‌పోర్టబులిటీ యాప్ అందిస్తున్నట్లు తెలిపింది.

బ్యాంకు ఖాతాలు లింక్ చేసుకోవచ్చు
సరికొత్త ఆవిష్కరణలు చేయడం, ప్రవేశపెట్టడంలో మేం ఎప్పుడూ ముందు ఉన్నామని, 2008లోదేశంలోనే తొలిసారి బ్యాంకింగ్ యాప్‌ను పరిచయం చేశామని, ఇప్పుడు విడుదల చేసిన కొత్త వర్షన్‌తో ఇతర బ్యాంకులకు చెందిన కస్టమర్లు వారి బ్యాంకు ఖాతాలను లింక్ చేసుకోవచ్చునని తెలిపింది.