ICICI సరికొత్త iBox: కార్డ్స్, చెక్కులు ఎలా తీసుకోవచ్చంటే?
ICICI బ్యాంకు iBox పేరుతో కొత్త సేవలను ప్రారంభించింది. ఈ సేవలు 17 నగరాల్లో 50కి పైగా ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచీల్లో అందుబాటులోకి వచ్చాయి. క్రెడిట్ కార్డు లేదా చెక్ బుక్కు లేదా బ్యాంకుకు సంబంధించి ఏమైనా కొరియర్ లేదా పోస్టల్ ద్వారా ఇంటికి వచ్చినప్పుడు మనం లేని సమయంలో తిరిగి తీసుకు వెళ్తుంటారు. దీంతో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి పరిష్కారంంగా ఈ సేవలు తీసుకొచ్చింది.

అందుబాటులోకి iBox
iBox పేరుతో అందుబాటులోకి తీసుకు వచ్చిన ఈ సదుపాయం ద్వారా కస్టమర్లు తమకు వచ్చిన క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, చెక్ బుక్స్, రిటర్న్స్ చెక్కులను తమ ఇళ్లు లేదా కార్యాలయాలకు సమీపంలోని బ్యాంకు శాఖకు వెళ్లి తీసుకోవచ్చు. ఇచ్చిన అడ్రస్‌లో మనం లేని సందర్భాల్లో ఇది ఎంతో ప్రయోజకరం. ఆయా బ్రాంచీల బయట iBoxను ఏర్పాటు చేస్తారు.

ఎప్పుడైనా తీసుకోవచ్చు.
శాఖల పని వేళల తర్వాత, సెలవు రోజుల్లో కూడా ఇది అందుబాటులో ఉండటం గమనార్హం. సెక్యూరిటీ కోసం OTP ఆధారిత వ్యవస్థను అమర్చారు. 24X7 రిజిస్టర్ మొబైల్‌ను ఉపయోగించి ఈ సేవలను పొందవచ్చు.

ఎస్సెమ్మెస్ ద్వారా..
పంపించిన దగ్గర నుంచి చేరవేసే వరకు ప్యాకేజీ ఎక్కడ ఏ దశలో ఉందనే విషయాన్ని కస్టమర్లకు ఆటోమేటిక్ పద్ధతిలో ఎస్సెమ్మెస్ వెళ్తుంది. ఇదే క్రమంలో iBox టర్మినల్‌కు ప్యాకేజీ చేరాక కూడా ఎస్సెమ్మెస్ వస్తుంది. ఆ ఎస్సెమ్మెస్‌లో iBox జీపీఎస్ లొకేషన్, OTP, QR కోడ్ ఉంటాయి.

వారం పాటు ఉంటుంది
కస్టమర్ ఆ iBox వద్దకు చేరాక రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ సాయంతో OTP లేదా QR కోడ్ ద్వారా బాక్సును తెరిచి ప్యాకేజీ తీసుకోవచ్చు. ఈ ప్యాక్ అందులో వారం రోజులు మాత్రమే ఉంటుంది. ఈ వారంలో ఎప్పుడైనా.. ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. ఢిల్లీ, ముుంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరులలోని పలు బ్రాంచీలలో దీనిని అందుబాటులోకి తెచ్చారు.


Click it and Unblock the Notifications