Golden hours: సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ మోసాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. సైబర్ అటాక్స్ ద్వారా అమాయకుల ఖాతాల్లో నగదును మాయం చేసేందుకు కొత్త కొత్త ముఠాలు పుట్టుకొస్తున్నాయి. గతంలో విదేశాల నుంచి ఆపరేట్ చేసే కేటుగాళ్లు ఇప్పుడు ఏకంగా ఇండియాలోనే తిష్ఠవేసి అందినకాడికి దోచుకుంటున్నారు. వీటికి చెక్ పెట్టేందుకు పోలీసులు 'గోల్డెన్ అవర్'పై అవగాహన కల్పిస్తున్నారు.
హైదరాబాద్ వాసుల నుంచి ప్రతి రోజు సగటున సైబర్ నేరగాళ్లు కోటి రూపాయలు కొల్లగొడుతున్నారని తెలుస్తోంది. 2023లో సైబర్ నేరాల వల్ల 140 కోట్ల వరకు నష్టపోగా 44 కోట్లు ఫ్రీజ్ చేశామని, ఇందులో కేవలం 2 కోట్లలోపే తిరిగి బాధితులకు అందజేయగలిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

బాగా చదువుకున్న వారే అత్యాశతో సైబర్ నేరగాళ్ల వలకు చిక్కుతున్నట్లు విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. అయితే తాము మోసపోతున్నామని గ్రహించిన 2 గంటల్లోపు (గోల్డెన్ అవర్స్) 1930కు కాల్ చేసి సహాయం పొందాలని పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ క్రైమ్‌లో మొదటి రెండు గంటల వ్యవధి చాలా ముఖ్యమంటున్నారు. నేరస్థుడి ఖాతాను స్తంభింపజేసి డబ్బు రికవరీ చేసేందుకు ఈ 'గోల్డెన్ అవర్'ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు.
పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, ట్రేడింగ్, కొరియర్‌స్ పేరిట ఫ్రాడ్స్ విపరీతంగా పెరిగాయినట్లు ఆందోళనలు వెలువడుతున్నాయి. పోలీసుల పేరిట ఫోన్లు చేసి, డీప్ ఫేక్ వంటి ఆర్టిఫిషియ్ ఇంటిలిజెన్స్‌ను టెక్నాలజీ ఉపయోగించి వీడియో కాల్స్‌లో యూనిఫామ్‌లో కనిపించి బురిడీ కొట్టిస్తున్నట్లు తెలుస్తోంది. క్షేత్ర సాయిలో సమస్యల పరిష్కారానికి త్వరలో బ్యాంకర్లు, సోషల్‌మీడియా నిర్వాహకులతోనూ పోలీసులు సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవసరమైతే సినీ తారల సహాయం కూడా తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులు భావిస్తున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications