ఎల్ఐసీ పాలసీ రద్దయిందా, పునరుద్ధరించుకోవాలా వద్దా? దేనికి ఎంత రాయితీ
లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) ల్యాప్స్ అయిన వివిధ పాలసీల పునరుద్ధరణకు అవకాశమిస్తుంది. ప్రీమియం చెల్లించనందుకు గాను రద్దయిన పాలసీలను తిరిగి తీసుకు వచ్చేందుకు ప్రత్యేక పథకం స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఫిబ్రవరి 7న ప్రారంభమైన రివైవల్ క్యాంపెయిన్ మార్చి 25 వరకు అందుబాటులో ఉంటుంది. ఇండివిడ్యువల్ ల్యాప్స్డ్ పాలసీలకు ఇది వర్తిస్తుంది. పాలసీల పునరుద్ధరణకు రెండోసారి అవకాశమిచ్చింది ఎల్ఐసీ.

పునరుద్ధరణ కోసం...
- ఎల్ఐసీ పాలసీ పునరుద్ధరణకు ఫిబ్రవరి 7వ తేదీ నుండి మార్చి 25వ తేదీ వరకు అవకాశముంది.
- ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చెల్లించిన మొత్తం ప్రీమియంలను బట్టి టర్మ్ అస్యూరెన్స్, హైరిస్క్ ప్లాన్స్ కాకుండా ఇతర స్కీమ్స్‌కు ఆలస్య రుసుములో రాయితీలు కూడా అందిస్తోంది.
- వైద్య అవసరాలపై ఎలాంటి రాయితీ లేదు.
- అర్హత కలిగిన హెల్త్, మైక్రో ఇన్సురెన్స్ ప్లాన్స్ కూడా ఆలస్య రుసుములో రాయితీకి అర్హత పొందుతాయి.
- ఈ ప్రత్యేక పునరుద్ధరణ క్యాంపెయిన్ కింద నిర్దిష్ట నిబంధనలు, షరతులకు లోబడి మొదటి చెల్లింపు జరపని ప్రీమియం తేదీ నుండి 5 సంవత్సరాలలోపు నిర్దిష్ట అర్హత గల ప్లాన్స్ పాలసీలు పునరుద్ధరిస్తారు.

దేనికి ఎంత రాయితీ
రూ.1 లక్ష లోపు ప్రీమియం చెల్లించే వారికి లేట్ ఫీజులో 20 శాతం రాయితీ, గరిష్టంగా రూ.2000 వరకు లేట్ ఫీజు తగ్గుతుంది.
రూ.1 లక్ష నుండి రూ.3 లక్షల లోపు ప్రీమియం ఉంటే 25 శాతం, గరిష్టంగా రూ.2500 వరకు లేట్ ఫీజు తగ్గుతుంది.
రూ.3 లక్,లు ఆ పైన ప్రీమియానికి వర్తించే లేట్ ఫీజులో 30 శాతం, గరిష్టంగా రూ.3వేల వరకు రాయితీ వర్తిస్తుంది.
టర్మ్ పాలసీలకు, అధిక రిస్క్ ఉన్న పాలసీలకు రాయితీ వర్తించదు.
ఆరోగ్య పరీక్షల విషయంలో మినహాయింపులు లేవు.

ఎప్పుడు పునరుద్ధరించుకోవాలి?
రద్దయిన పాలసీని పునరుద్ధరించుకోవాలా లేదా వద్దా అనేది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఎలాంటి పాలసీ తదీసుకున్నారు, ప్రీమియం ఎంత చెల్లించారు వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఒకవేళ చెల్లించిన ప్రీమియం పెద్ద మొత్తంలో లేకుంటే పునరుద్ధరించుకోవాల్సిన అవసరం లేదని ఆర్థిక నిపుణుల సూచన. ఎక్కువ మొత్తంలో చెల్లిస్తే మాత్రం అంటే వ్యాల్యూ సరెండర్‌కు దగ్గరగా ఉంటే పునరుద్ధరించుకోవాలని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications