విజిటింగ్ కార్డ్ సైజ్‌లో ఆధార్ ఇలా తీసుకోండి.. ఇవి తప్పనిసరి
ఇప్పుడు ఆధార్ కార్డు అన్నింటికి అవసరమైన గుర్తింపు కార్డుగా మారింది. కానీ కార్డు పరిమాణం పెద్దదిగా ఉండటంతో దానిని నిత్యం వెంట తీసుకు వెళ్లలేని పరిస్థితి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఒరిజినల్ కార్డును విజిటింగ్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ సైజ్‌కు కట్ చేసి, లామినేట్ చేయడమే. కానీ ఇప్పుడు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) పీవీసీ ఆధార్ కార్డులను విజిటింగ్ కార్డు పరిమాణంలో అందిస్తోంది. ఈ కార్డులో డిజిటల్ సంతకంతో కూడిన క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్ వంటి పలు సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. ఆధార్ కార్డుదారులు ఆన్ లైన్ ద్వారా కొత్త రూపంలోని ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టల్ ఛార్జీ, జీఎస్టీ కలిపి రూ.50 ఖర్చు అవుతుంది.

విజిటింగ్ కార్డు సైజ్ ఆధార్ కోసం..
విజిటింగ్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ సైజ్ ఆధార్ కార్డు కోసం ఆధార్ వెబ్ సైట్‌లోకి వెళ్లి వివరాలు నమోదు చేయడం ద్వారా సరికొత్త ఆధార్ కార్డును పొందవచ్చు. పది రోజుల్లో ఇది మీ ఇంటికి చేరుతుంది. ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో మీ ఆధార్ నెంబర్‌ను నోట్ చేసుకోవడంతో పాటు, మీ రిజిస్టర్డ్ మొబైల్‌ను ఓటీపీ ద్వారా తనిఖీ చేసుకోవడానికి సిద్ధంగా ఉంచుకోవాలి.

ఇలా దరఖాస్తు చేయండి..
- పీవీసీ ఆధార్ కార్డు దరఖాస్తు చేసేందుకు మొదట https://uidai.gov.in/ వెబ్ సైట్లోకి వెళ్లాలి.
- గెట్ ఆధార్ అనేచోట 'ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్' అని ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
- అక్కడ మీ ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. లేదా మీ ఆధార్ కార్డుకు చెందిన వర్చువల్ ఐడీని గానీ, ఎన్‌రోల్‌మెంట్ ఐటీని గానీ ఎంటర్ చేయవచ్చు.
- కాప్చా కోడ్, మీ ఆధార్ నెంబర్‌తో లింక్ చేసిన మొబైల్‌ను ఎంటర్ చేయాలి.
- మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీని ఎంటర్ చేయాలి.
- మరో పేజీకి వెళ్తుంది. మీ వివరాలు సరిగా ఉన్నాయో చెక్ చేసుకోవాలి.
- పేమెంట్ పేజీలోకి వెళ్తే మీకు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. యూపీఐ ఆప్షన్‌లోకి వెళ్తే పేటీఎం, బీమ్, గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పేను ఉపయోగించి పేమెంట్ చేయవచ్చు.

ఇలా చెక్ చేసుకోవచ్చు
- పేమెంట్ పూర్తైన తర్వాత మీకు ఓ రిసిప్ట్ వస్తుంది. అందులో SRN నెంబర్‌ను భవిష్యత్తు అవసరాల కోసం సేవ్ చేసి పెట్టుకోవాలి.
- 10 రోజుల్లో ఇంటి అడ్రస్‌కు కొత్త ఆధార్ కార్డు వస్తుంది.
- ఆధార్ కార్డు స్టేటస్ తెలుసుకోవడానికి SRN నెంబర్‌ను ఉపయోగించి UIDAI వెబ్ సైట్‌లో గెట్ ఆధార్ విభాగంలో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications