ప్రస్తుతం మన దేశంలో చిన్న టీ కొట్టు నుండి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు అంతా డిజిటల్ చెల్లింపులే నడుస్తున్నాయి. నగదు వెంట తీసుకెళ్లే అవసరం లేకుండా కేవలం మొబైల్ ఫోన్ ఉంటే చాలు.. క్షణాల్లో పేమెంట్ పూర్తి చేయవచ్చు. అయితే చాలామందికి యూపీఐని మొదటిసారి ఎలా సెట్ చేయాలి? లేదా పిన్ ఎలా మార్చాలి ( how to change upi pin) అనే విషయాలపై సందేహాలు ఉంటాయి. అందుకే ఈ రోజు మనం యూపీఐకి సంబంధించిన అన్ని ముఖ్యమైన విషయాలను వివరంగా తెలుసుకుందాం.
మొదటిసారి యూపీఐని ఎలా సెట్ చేయాలి?
మీరు మొదటిసారి గూగుల్ పే (Google Pay), ఫోన్ పే (PhonePe) లేదా పేటీఎం (Paytm) వంటి యాప్‌లను వాడుతున్నట్లయితే.. ముందుగా ఇలా చేయాలి.
- ముందుగా మీ మొబైల్ నంబర్ మీ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయి ఉండాలి.
- మీకు నచ్చిన యూపీఐ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వండి.
- యాప్‌లో 'Add Bank Account' ఆప్షన్‌ను ఎంచుకుని, మీ బ్యాంక్ పేరును సెలెక్ట్ చేయండి.
- మీ మొబైల్ నుండి ఒక ఎస్ఎంఎస్ (SMS) వెరిఫికేషన్ జరుగుతుంది.
- వెరిఫికేషన్ పూర్తయ్యాక, మీ డెబిట్ కార్డ్ (ATM Card) చివరి 6 అంకెలు , ఎక్స్‌పైరీ డేట్ ఎంటర్ చేయాలి.
- ఇప్పుడు మీరు ఒక 4 లేదా 6 అంకెల యూపీఐ పిన్‌ను సెట్ చేసుకోవాలి. అంతే మీ యూపీఐ యాక్టివేట్ అయిపోతుంది.

కొత్త నంబర్‌పై యూపీఐని సెట్ చేయడం ఎలా?
మీరు ఒకవేళ మొబైల్ నంబర్ మార్చినట్లయితే, పాత నంబర్‌తో ఉన్న యూపీఐ పని చేయదు. కొత్త నంబర్‌పై సెట్ చేయాలంటే..
- ముందుగా మీ కొత్త నంబర్‌ను మీ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి అప్‌డేట్ చేయించుకోవాలి.
- ఆ తర్వాత పాత యూపీఐ యాప్‌లో లాగౌట్ అయ్యి, కొత్త నంబర్‌తో మళ్లీ రిజిస్టర్ అవ్వాలి.
- పైన చెప్పిన విధంగానే మళ్ళీ బ్యాంక్ అకౌంట్‌ను లింక్ చేసి, డెబిట్ కార్డ్ వివరాలతో కొత్త యూపీఐ ఐడిని క్రియేట్ చేసుకోవాలి.
యూపీఐ పిన్ మార్చుకోవడం ఎలా? (how to change upi pin)
భద్రతా కారణాల దృష్ట్యా నెలకు ఒకసారి లేదా మీ పిన్ ఎవరికైనా తెలిసినప్పుడు దానిని మార్చుకోవడం చాలా ఉత్తమం. దీన్నెలా చేయాలంటే..
- మీ యూపీఐ యాప్ (PhonePe/GPay) ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ సెక్షన్‌కు వెళ్లండి.
- అక్కడ మీరు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్‌పై క్లిక్ చేయండి.
- మీకు 'Change PIN' లేదా 'Reset PIN' అనే ఆప్షన్ కనిపిస్తుంది.
- మీరు పాత పిన్ గుర్తుంటే, 'Change PIN' నొక్కి పాతది ఎంటర్ చేసి కొత్త పిన్‌ను సెట్ చేసుకోవచ్చు.
- ఒకవేళ పాత పిన్ మర్చిపోతే, 'Reset PIN' ఆప్షన్ ఎంచుకుని మీ ఏటీఎం కార్డ్ వివరాల ద్వారా కొత్త పిన్‌ను క్రియేట్ చేసుకోవచ్చు.
యూపీఐ వాడుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
డిజిటల్ పేమెంట్స్ పెరిగే కొద్దీ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఎప్పుడూ గుర్తుంచుకోండి.. డబ్బులు పంపడానికి మాత్రమే పిన్ ఎంటర్ చేయాలి. డబ్బులు స్వీకరించడానికి (Receive) పిన్ అవసరం లేదు. ఎవరైనా మీకు డబ్బులు పంపిస్తాం అని చెప్పి పిన్ కొట్టమంటే అది మోసం అని గ్రహించాలి. అలాగే మీ యూపీఐ పిన్, ఓటీపీ (OTP) లేదా డెబిట్ కార్డ్ వివరాలను బ్యాంక్ అధికారులు అడిగినా సరే ఎవరికీ చెప్పకండి. వీలైనంత వరకు అనవసరమైన థర్డ్ పార్టీ యాప్స్ లేదా స్క్రీన్ షేరింగ్ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేయవద్దు. ఎందుకంటే అవి మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉంది.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications