ఫారెన్లో చదువుకోవడానికి ఎడ్యుకేషన్ లోన్ కావాలా.. ఇవి ముందు తెలుసుకోండి..
విదేశాలలో ఉన్నత చదువులు చదవడం అనేది ఒక గొప్ప అనుభవంగా ఉంటుంది, కానీ విదేశాల్లో చదువు అంటే అంత ఈజీ కాదు. అక్కడికి వెళ్ళడానికి, ఉండడానికి, కాలేజ్ అడ్మిషన్, కాలేజ్ ఫీజు, ఖర్చులు ఇంకా ఇలా చాల ఖర్చులను అధిగమించడానికి అందరి దగ్గర అంతగా డబ్బు ఉండకపోవచ్చు. ఇందుకు ఎడ్యుకేషన్ లోన్ ఒక బెస్ట్ అప్షన్. అయితే విదేశీ చదువుల కోసం లోన్ పొందే ప్రాసెస్ ఉంటుంది అదేంటో మీకు తెలుసా...
విదేశాల్లో చదువుకోవడానికి ముందుగా బ్యాంకులు అందించే ఎడ్యుకేషన్ లోన్ రకాలను తెలుసుకోవాలి. విదేశీ విద్య కోసం ఎడ్యుకేషన్ లోన్ సాధారణంగా రెండు రకాలుగా ఉంటాయి:

1. సెక్యూర్డ్ లోన్: ఆస్తి, ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా ఇతర ఆస్తులు వంటివి బ్యాంకుల్లో పెట్టాల్సి ఉంటుంది. ఈ లోన్ సాధారణంగా తక్కువ వడ్డీ రేట్లను అందిస్తాయి.
2. ఆన్ సెక్యూర్డ్ లోన్: ఎలాంటి ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు కానీ ఎక్కువ వడ్డీ రేట్లు, కఠినమైన అర్హత ప్రమాణాలు ఉండవచ్చు. ప్రతి బ్యాంకు ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయడానికి అందుకు కొన్ని అర్హత ప్రమాణాలు చూస్తుంది. వీటిలో ఎడ్యుకేషన్ బ్యాక్ గ్రౌండ్, స్కోర్ (ఉదా, GRE, GMAT, లేదా IELTS/TOEFL స్కోర్లు), గుర్తింపు పొందిన ఫారెన్ యూనివర్సిటీ నుండి అడ్మిషన్, స్టడీ కోర్సు వివరాలు తప్పనిసరి...
లోన్ కోసం కావాల్సిన డాకుమెంట్స్
ఫారెన్ యూనివర్సిటీ నుండి అడ్మిషన్ లెటర్, అకడమిక్ రికార్డులు, ఎగ్జామ్ స్కోర్లు, ఐడి ఫ్రూఫ్ (ఆధార్, పాస్‌పోర్ట్ మొదలైనవి), రెసిడెంట్ ప్రూఫ్, ఫైనాన్సియల్ డాకుమెంట్స్ (ఇన్కమ్ ప్రూఫ్, ఐటీ రిటర్న్స్, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు). కొన్ని ప్రభుత్వాలు, ఆర్థిక సంస్థలు కూడా విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు సపోర్ట్ గా సబ్సిడీ లేదా ప్రత్యేక పథకాలను అందిస్తుంటాయి. మరొక విషయం ఏంటంటే విదేశాలకి వెళ్ళేటప్పుడు ఒక్కరిపైనా ఎలాంటి క్రిమినల్ కేసులు లాంటివి ఉండకూడదు.


Click it and Unblock the Notifications