For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ఫోన్‌లో వైరస్ అటాక్ చేసిందా, ఎలా గుర్తించాలి?

|

ఇటీవల సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. కంప్యూటర్ వైరస్, ట్రోజన్స్, స్పైవేర్, రాన్సమ్ వేర్, యాడ్ వేర్, వార్మ్స్, ఫైల్ లెస్ మార్వెల్స్ సాయంతో సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి దాడులకు ప్రత్యేకంగా మెషీన్ లెర్నింగ్స్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. ఇందులో కూడా మనం వినియగించే స్మార్ట్ ఫోన్స్ పైన వైరస్ దాడులు పెరుగుతున్నాయి. ప్రత్యేక ఆఫర్ల పేరుతో లేదా మీకు భారీ మొత్తంలో బహుమతులు వచ్చాయని లేదా ఈ లింక్ ఓపెన్ చేస్తే మీరు నజరానా గెలుచుకుంటారంటూ సందేశాలు వస్తుంటాయి. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఏవైనా యాప్స్‌ను డౌన్ లోడ్ చేసుకునే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. అయితే మీ ఫోన్ హ్యాక్ అయితే వైరస్ ఉందా లేదా తెలుసుకునే మార్గాలు ఉన్నాయి.

మీ స్మార్ట్ ఫోన్‌లో వైరస్‌లను గుర్తించే సులభ మార్గం ఏమంటే.. మీరు ఫోన్ రీచార్జ్ చేస్తే వెంటనే కట్ అవడం, మీ స్మార్ట్ ఫోన్‌కు గుర్తు తెలియని టెక్స్ట్ సందేశాలు రావడం, ఫోన్ కాల్స్ రావడం, మీ పర్మిషన్ లేకుండా యాప్స్ కొనుగోలు వంటివి ఉంటాయి.

How to Know If Your Phone Has a Virus?

కంటిన్యూగా మీ ఫోన్‌కు యాడ్స్ వస్తే యాడ్ వేర్ మీ ఫోన్‌ను అటాక్ చేసినట్లే గుర్తించాలి.
మాల్వేర్, ట్రోజన్ మీ స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించే స్పామ్ టెక్స్ట్ సందేశాలను మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారికి సెండ్ అవుతుంటాయి. అప్పుడు మీ కాంటాక్ట్ ఫోల్టర్‌లోకి గుర్తు తెలియని వైరస్ దాడి చేసినట్లుగా గుర్తించాలి.
వైరస్ అటాక్ చేస్తే మీ స్మార్ట్ ఫోన్ పనితీరు తగ్గిపోతుంది.
వైరస్‌లు, మాల్వేర్ మీ స్మార్ట్ ఫోన్స్ కొత్త యాప్స్‌ను కూడా డౌన్ లోడ్ చేస్తాయి. వైరస్, మాల్వేర్ స్మార్ట్ ఫోన్లో కొత్త యాప్స్ డౌన్ లోడ్ చేస్తాయి. అప్పుడు మీ డేటా త్వరగా అయిపోతుంది. బ్యాటరీ టైమ్ కూడా తగ్గిపోతుంది. ఇలాంటి సమస్యలు ఉంటే వైరస్ దాడి చేసినట్లుగా గుర్తించవచ్చు.

Read more about: phone ఫోన్
English summary

మీ ఫోన్‌లో వైరస్ అటాక్ చేసిందా, ఎలా గుర్తించాలి? | How to Know If Your Phone Has a Virus?

A good way to check for malware on your Android phone is to run an antivirus scan.
Story first published: Friday, October 15, 2021, 20:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X