సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లు (SIPs) నేడు పెట్టుబడిదారులలో భారిగా ఆదరణ పొందాయి. గత నవంబర్‌లో మ్యూచువల్ ఫండ్ SIP పెట్టుబడులు వరుసగా రెండవ నెలలో రూ. 25,000 కోట్ల కంటే పైగా ఉన్నాయి అని SIP కంట్రిబ్యూషన్స్ పై AMFI డేటా చూపిస్తుంది. SIPలు అనుభవం లేని ఇంకా అనుభవం ఉన్న పెట్టుబడిదారులను ఆకర్షించే ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.SIPలతో మీరు షేర్ మార్కెట్ హెచ్చుతగ్గులకు సంబంధించిన నష్టాలను తగ్గించుకుంటూ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు . అంతేకాకుండా మీరు రూ. 500 కంటే తక్కువ మొత్తంతో కూడా SIPలలో పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేయవచ్చు.
SIP ప్రయోజనాలు
SIPతో ఎక్కువ రాబడి
చాలా పెట్టుబడి పథకాలతో పోలిస్తే SIPలు బెటర్ రాబడిని అందిస్తాయి. మీరు తక్కువ మొత్తంతో పెట్టుబడిని ప్రారంభించవచ్చు ఇంకా మీ ఆదాయం పెరిగే కొద్దీ క్రమంగా పెట్టుబడి కూడా పెంచుకోవచ్చు. అంతేకాదు SIPలు మీ సౌలభ్యం మేరకు పెట్టుబడులను కొనసాగించడానికి సౌలభ్యాన్ని అందిస్తాయి.

సౌకర్యవంతమైన పెట్టుబడి
SIPలలో ప్రతినెల, 3నెలలు లేదా 6నెలల ప్రాతిపదికన పెట్టుబడి పెట్టవచ్చు. ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు మీ పెట్టుబడి తాత్కాలికంగా పాజ్ చేసే అవకాశం కూడా మీకు ఉంటుంది. ఈ ఛాయిస్ SIPలను ఆకర్షణీయమైన, అనుకూలమైన పెట్టుబడి అప్షన్ గా చేస్తుంది.
కంపౌండింగ్ పవర్
SIPలు కంపౌండింగ్ పవర్ ప్రభావితం చేస్తాయి, అంటే మీరు మీ పెట్టుబడిపై మాత్రమే కాకుండా కాలక్రమేణా వచ్చే రాబడిపై కూడా రిటర్న్స్ పొందుతారు. 12% వరకు ఆవరేజ్ రాబడితో కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ కూడా, SIPలు లాంగ్ టర్మ్ సంపదను సృష్టించడానికి అద్భుతమైన అవకాశాన్ని అందిస్తాయి. SIPలు సాధారణ సేవింగ్స్ ఇంకా ఆర్థిక ఫైనాన్షియల్ డిసిప్లీన్ అలవాటును ప్రోత్సహిస్తాయి. ప్రతి నెల, త్రైమాసికం లేదా అర్ధ సంవత్సరానికి పెట్టుబడి కోసం నిర్ణయించిన మొత్తాన్ని కేటాయించడం ద్వారా మీరు మీ ఆర్థిక వ్యవహారాలు, ఖర్చులను మ్యానేజ్ చేయడానికి ఒక విధానాన్ని అభివృద్ధి చేస్తారు.
రూపాయి-ధర ప్రయోజనం
*SIPలు ఆవరేజ్ రూపాయి ధర ద్వారా మార్కెట్ నష్టాలను తగ్గించడంలో సహాయపడతాయి.
*మార్కెట్ పడిపోయినప్పుడు, మీరు ఎక్కువ యూనిట్లను కొనవచ్చు
*అలాగే మార్కెట్ పెరిగినప్పుడు తక్కువ యూనిట్లు కొనుగోలు చేయవచ్చు
మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల మీరు ప్రభావితం కాకుండా ఈ వ్యూహం చూస్తుంది. మార్కెట్ పెరిగినప్పుడు మీ పెట్టుబడి మంచి రాబడి నుండి ప్రయోజనం పొందుతుంది.
SIPలను సెటప్ చేయడానికి 5 మార్గాలు:
*సరైన SIP మొత్తంతో స్టార్ట్ చేయండి
*ఏటా మీ SIPని పెంచుతూ కంటిన్యూ చేయండి
*డైరెక్ట్ SIPలను సెలెక్ట్ చేసుకోండి
* లాంగ్ టర్మ్ లో పెట్టుబడి పెట్టండి.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications