Foreign Education: ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు అత్యుత్తమ విద్యను అందించాలని కోరుకుంటుంటారు. అయితే.. దీనికి సరైన ప్రణాళిక చేసుకోవటంతో పాటు అమలు చాలా కీలకం. విదేశాల్లో మీ పిల్లల ఉన్నత విద్య కోసం ఎలా పొదుపు చేయాలి, ఎలాంటి ప్రభావం ఉంటుంది వంటి కొన్ని అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఎక్కువ డబ్బు అవసరం..
ఈ లక్ష్యాన్ని చేరుకోవటానికి ముందుగా కావలసింది సమర్థవంతంగా పెట్టుబడి పెట్టడం. ఈరోజుల్లో విద్య ఖరీదైన వ్యవహారంగా మారింది. ఈ క్రమంలో విదేశాల్లో మీ పిల్లలకు ఉన్నత విద్య కోసం ప్రణాళిక వేయడానికి పెద్ద కార్పస్ అవసరం అవుతుంది. ఉదాహరణకు మీ పిల్లలకు.. ప్రస్తుతం 10 సంవత్సరాల వయస్సు ఉంటే, మీరు వారిని అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్-గ్రాడ్యుయేషన్ లేదా రెండింటి కోసం విదేశాలకు పంపాలని భావించవచ్చు. అయితే.. దీనికోసం మీరు ఇప్పుడే పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలని నిపుణులు అంటున్నారు.

దేశం, కోర్సు బట్టి ఖర్చు..
ఒక విదేశీ యూనివర్సిటీలో ప్రవేశం, హాస్టల్/అద్దెతో పాటు ఇతర రోజువారీ ఖర్చులు ఉంటాయి. పైగా విద్యార్థి వెళ్లాలనుకుంటున్న దేశం, తీసుకునే కోర్సు, విశ్వవిద్యాలయం ఆధారంగా రూ.50 లక్షల నుంచి రూ. 75 లక్షల వరకు సులభంగా ఖర్చు అవుతాయి. ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకున్నట్లయితే.. దానికి అనుగుణంగా డబ్బును సేవ్ చేయాలి. ఈ క్రమంలో మనం పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి.

చిన్న లక్ష్యాలతో ముందుకు..
మీ పిల్లల విదేశీ విద్య కోసం మీరు పెద్ద మెుత్తాన్ని ఆదా చేయడం సులభం చేయడానికి.. ముందుగా మీ లక్ష్యాన్ని చిన్న సాధించగల లక్ష్యాలుగా విభజించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం నెలకు కొంత భాగాన్ని సేవ్ చేయాలని వారు అంటున్నారు. ఎలాంటి వాటిలో పెట్టుబడి పెడితే మీ లక్ష్యం చేరుకోవటానికి వీలవుతుందో తెలుకునేందుకు తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆర్థిక సలహాదారు సహాయం తీసుకోవటం ఉత్తమం.

వేటిలో పెట్టుబడి పెట్టొచ్చు..
6 నుంచి 7 సంవత్సరాల్లో లక్ష్యాన్ని సాధించటానికి ఒక వ్యక్తి వారి పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ పెట్టుబడులకు మంచి స్థానాన్ని ఇవ్వవచ్చని నిపుణులు అంటున్నారు. మెుత్తం పెట్టుబడుల్లో కొంత భాగాన్ని ఈక్విటీలకు, మరికొంత మ్యూచువల్ ఫండ్‌లు, మిగిలిన భాగాన్ని డెట్, బాండ్‌లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటి స్థిర ఆదాయ సాధనాలను చేర్చాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

ఎప్పుడు విత్ డ్రా చేసుకోవాలి..
మీరు లక్ష్యానికి దగ్గరగా ఉన్నప్పుడు.. మార్కెట్ అస్థిరతల వల్ల నష్టపోకుండా కొంత కాలం ముందుకానే పెట్టుబడిని డెట్ సాధనాల్లోకి మార్చాలని అంటున్నారు. దీని వల్ల మీ పోర్ట్‌ఫోలియో మంచి రాబడిని అందించగలదని చెబుతున్నారు. ఇలా ఖచ్చితమైన ప్రణాళికతో మీ పిల్లల విదేశీ విద్య కలలను సాకారం చేసుకోవచ్చు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications