గోల్ ఆధారిత ప్రణాళికతో మీ సంపదను ఇలా పెంచుకోండి?
భవిష్యత్తు ఆలోచించే చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీస్, షేర్, రియల్ ఎస్టేట్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తారు. ఒక నిర్దిష్ట లక్ష్యంతో పెట్టుబడులు పెట్టకుండా అలా ఇన్వెస్ట్ చేసి వదిలివేసే వారు ఎంతోమంది ఉంటారు. అంటే సరైన లక్ష్యం లేకుండా ఇన్వెస్ట్ చేస్తుంటారు. అప్పుడు నిర్ణీత రిటర్న్స్ కాలపరిమితి కూడా పెరుగుతుంది. టార్గెట్ ఆధారిత పెట్టుబడితో ఈ అస్థిరతను తొలగించుకొని, తక్కువ కాలంలో ఎక్కువ రిటర్న్స్ పొందవచ్చు. ఈ నేపథ్యంలో లక్ష్యాన్ని పెట్టుకొని, ప్రణాళికతో ఆదాయాన్ని పెంచుకోవడానికి ఈ కిందివి ఎంతో అవసరం.

గోల్ ఆధారిత ప్రణాళిక.. అంటే ఏమిటి?
ఇల్లు, వెకేషన్, రిటైర్మెంట్ వంటి వాటి కోసం ఆదా చేయడం వంటి నిర్దిష్ట లక్ష్యాలను చేరుకోవడానికి ఓ ప్రణాళికాబద్దమైన పెట్టుబడి అవసరం. లాభాల వెంటపడటం కంటే రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా టార్గెట్ ఆధారంగా స్థిరంగా పెట్టుబడులు పెట్టాలి. మొదట మీ టార్గెట్‌ను లిస్ట్ చేయండి.
ఇందుకు మీకు ఏమేం అవసరమో గుర్తించండి. అలాగే ఎంతకాలం పెట్టుబడి పెట్టాలి, ఎంత పెట్టుబడి పెట్టాలనే అంచనాకు రావాలి. టార్గెట్ ఆధారిత పెట్టుబడి స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలకు ఎంచుకోవచ్చు. ఇందుకు కార్యాచరణను గుర్తించి, దానిని అమలు చేయడం ముఖ్యం.

గోల్ ఆధారిత ప్రణాళికతో ప్రయోజనం
మీరు గోల్ ఆధారిత పెట్టుబడిని ప్రారంభిస్తే మీ పెట్టుబడికి ఓ లక్ష్యం ఉంటుంది. మీ లక్ష్యం మీ కళ్లముందు ఉంటే ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత మీకు వస్తుందనే అంశాలు కీలకం. మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల మీరు ప్రభావితమయ్యే అంశాలకు దూరంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మీరు లక్ష్యాలను ఏర్పరచుకున్నప్పుడు మీ పెట్టుబడి పోర్ట్‌పోలియోలో అసెట్ కేటాయింపును నిర్వచించవచ్చు.
నెలవారీ సిప్స్, పోర్ట్‌పోలియో రీబ్యాలెన్సింగ్, ఇతర గోల్ ఆధారిత ఫైనాన్షియల్ ప్లానింగ్స్ క్రమశిక్షణ కలిగిన పెట్టుబడులకు అనుగుణంగా ఉంటాయి. 80సి తగ్గింపులను ముందే సిద్ధం చేసుకోవడం ద్వారా చివరి నిమిషంలో పన్ను ఆదా కోసం ఇబ్బందులు పడే పరిస్థితిని నివారించవచ్చు. విహార యాత్ర, కొత్త వాహన, ప్రాపర్టీ పైన డౌన్ పేమెంట్ వంటి వాటి కోసం అప్పులు చేయకుండా ఉండాలి.

వివిధ రకాల ఫైనాన్షియల్ గోల్స్
ఆర్థిక లక్ష్యాలు సాధించేందుకు వివిధ రకాల ప్రణాళికలతో ముందుకు వెళ్లవచ్చు.
ఏడాది కంటే తక్కువ లక్ష్యం ఉంటే అల్ట్రా షార్ట్ టర్మ్ గోల్స్‌గా చెప్పవచ్చు.
ఏడాది నుండి మూడేళ్ల లక్ష్యం ఉంటే షార్ట్ టర్మ్ గోల్స్‌గా పేర్కొనవచ్చు.
మూడు నుండి ఏడేళ్ల కాలపరిమితి అయితే మీడియం టర్మ్ గోల్స్‌గా చెప్పవచ్చు.
ఏడు నుండి పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దీర్ఘకాలిక లక్ష్యాలు అంటారు.
పదవీ విరమణ, పిల్లల చదువులు, పెళ్లిళ్లి, వెకేషన్ సేవింగ్స్, వెహికిల్ లేదా హోమ్ కొనుగోలు వంటి గోల్స్ ఉంటాయి.


Click it and Unblock the Notifications