For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

m-పాస్‌బుక్‌ను ఆన్‌లైన్ ద్వారా ఎలా పొందాలి? ఇలా క్రియేట్ చేసుకోవాలి..

|

డిజిటల్ ఆవిష్కరణల్లో ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ముందు ఉంటుంది. సంప్రదాయ పాస్‌బుక్ ఎలక్ట్రానిక్ రూపమే ఎం-పాస్‌బుక్. కస్టమర్లు తమ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఎస్బీఐ మొబైల్ బ్యాంకింగ్ కస్టమర్స్ ద్వారా సైన్-ఇన్ కావడం ద్వారా సులభంగా యాక్సెస్ చేయవచ్చు లేదా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీ సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాలో మీ ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించిన మీ భౌతిక పాస్‌బుక్ మాదిరిగానే ఎలక్ట్రానిక్ రూపంలో ఎం-పాస్‌బుక్ ఉంటుంది.

యోనో యాప్ ద్వారా

యోనో యాప్ ద్వారా

ఎస్బీఐ మొబైల్ అప్లికేషన్స్ ఎస్బీఐ ఎనీవేర్, ఎస్బీఐ యోనో, ఎస్బీఐ క్విక్ ద్వారా ఎం-పాస్‌బుక్ అందుబాటులో ఉంటుంది. మీ ఆన్ లైన్ బ్యాంకింగ్ యూజర్ నేమ్, పాస్ వర్డ్‌ను ఉపయోగించి సైన్-ఇన్ కావడం ద్వారా ఎం-పాస్‌బుక్‌ను పొందవచ్చు. లేదా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఎస్బీఐ ఎం-పాస్‌బుక్‌ను పొందడానికి పలు మార్గాలు ఉన్నాయి.

- యోనో యాప్ ద్వారా ఎస్బీఐ ఎం-పాస్‌బుక్ పొందవచ్చు. ఇందుకు మొదట మీ మొబైల్‌లో ఎస్బీఐ యోనో లైట్ యాప్‌ను ఓపెన్ చేయాలి. మీ ఖాతాలోకి సైన్-ఇన్ కావాలి. క్రెడెన్షియల్స్ అవసరమవుతాయి.

మెనూ కింద My Accounts పైన ట్యాప్ చేయాలి. ఆ తర్వాత mPassbook పైన ట్యాప్ చేయాలి.

అనంతరం View mPassbook పైన క్లిక్ చేయాలి. అకౌంట్ నెంబర్‌ను ఎంచుకోవాలి.

Refresh పైన క్లిక్ చేస్తే మీ అకౌంట్ లేటెస్ట్ ట్రాన్సాక్షన్ వివరాలు కనిపిస్తాయి.

ఎస్బీఐ క్విక్ యాప్ ద్వారా...

ఎస్బీఐ క్విక్ యాప్ ద్వారా...

- మీ మొబైల్‌లో ఎస్బీఐ క్విక్ యాప్‌ను ఓపెన్ చేయాలి.

- మెసేజ్ ఐకాన్‌లోని 6 month e-statement section పైన ట్యాప్ చేయాలి.

- మీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. 4 అంకెల పాస్ వర్డ్‌ను ఎంటర్ చేయాలి.

- ఆ తర్వాత మీ రిజిస్టర్ ఈమెయిల్ ఐడీకి ఈ-స్టేట్‌మెంట్ వస్తుంది. ఇచ్చిన పాస్ వర్డ్ ఆధారంగా మీరు దానిని ఓపెన్ చేయవచ్చు.

ఎస్బీఐ ఎనీవేర్ ద్వారా..

ఎస్బీఐ ఎనీవేర్ ద్వారా..

- ఎస్బీఐ ఎనీవేర్ యాప్ ద్వారా కూడా ఎం-పాస్ బుక్ చూసుకోవచ్చు.

- మీ మొబైల్‌లో ఎస్బీఐ ఎనీవేర్ యాప్‌న ఓపెన్ చేయాలి. మీరు యాప్ కుడివైపున ఎం-పాస్ బుక్ లింక్‌ను పొందుతారు.

- ఎం-పాస్ బుక్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

- నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ, ఎం-పాస్ బుక్ పిన్ అడుగుతుంది.

- ఆ తర్వాత ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్స్ మీ స్క్రీన్ పైన కనిపిస్తుంది.

- ఎం-పాస్ బుక్ కావాల్సిన అకౌంట్‌ను ఎంచుకోవాలి.

- ఎం-పాస్ బుక్ ఓపెన్ అవుతుంది. మీ ట్రాన్సాక్షన్స్ వివరాలు డిస్ ప్లే అవుతాయి.

ఎం-పాస్ బుక్ ఎలా క్రియేట్ చేసుకోవాలి

ఎం-పాస్ బుక్ ఎలా క్రియేట్ చేసుకోవాలి

- మీ మొబైల్ ద్వారా ఎస్బీఐ ఎనీవేర్ యాప్ ఓపెన్ చేయాలి. మీ అకౌంట్లోకి సైన్-ఇన్ కావాలి.

- సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. క్రియేట్ లేదా రీసెట్ ఎం పాస్ బుక్ పిన్ పైన క్లిక్ చేయాలి.

- 4 డిజిట్ ఎం పాస్ బుక్ పిన్ ఎంటర్ చేయాలి. అదే నెంబర్‌ను మరోసారి ధృవీకరించాలి.

- ఎం-పాస్ బుక్ ట్యాబ్‌లోకి వెళ్లి, సింక్రనైజ్ చేయాలి.

English summary

m-పాస్‌బుక్‌ను ఆన్‌లైన్ ద్వారా ఎలా పొందాలి? ఇలా క్రియేట్ చేసుకోవాలి.. | How To Get SBI mPassbook Online?

SBI is widely regarded as the fastest and most effective of every public sector bank when it comes to implementing digital innovations. As a result, a mPassbook is an electronic representation of a traditional passbook.
Story first published: Wednesday, March 24, 2021, 15:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X