చాలామంది ఉద్యోగాలు మారినప్పుడు లేదా కొత్త బ్యాంక్ అకౌంట్ తీసుకున్నప్పుడు పాత అకౌంట్‌ను అలాగే వదిలేస్తుంటారు. అయితే వినియోగించని బ్యాంక్ అకౌంట్లను అలాగే ఉంచడం వల్ల మినిమం బ్యాలెన్స్ పెనాల్టీలు, ఏటీఎం కార్డ్ ఛార్జీలు పడే అవకాశం ఉంది. అందుకే అవసరం లేని ఖాతాను సరిగ్గా మూసివేయడం ఉత్తమం. అసలు బ్యాంక్ అకౌంట్ ఎలా క్లోస్ చేయాలో (how to close bank account) తెలుసుకుంటే మీరు బ్యాంక్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే ఈ పనిని పూర్తి చేయవచ్చు.

అకౌంట్ క్లోజ్ చేసే ముందు చేయాల్సిన పనులు
బ్యాంక్ అకౌంట్ మూసివేసే ముందు కొన్ని కీలకమైన జాగ్రత్తలు తీసుకోవాలి..
- బ్యాలెన్స్ చెక్ చేసుకోండి: మీ ఖాతాలో ఉన్న డబ్బును వేరే అకౌంట్‌కు బదిలీ చేయండి లేదా విత్ డ్రా చేసుకోండి. ఖాతాలో సున్నా బ్యాలెన్స్ ఉండటం మంచిది. ఒకవేళ మైనస్ బ్యాలెన్స్ ఉంటే, అది చెల్లించనిదే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయదు.
- ఆటో డెబిట్: మీ అకౌంట్ నుండి లోన్ ఈఎంఐలు (EMIs), ఇన్సూరెన్స్ ప్రీమియంలు లేదా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఆటోమేటిక్‌గా కట్ అవుతుంటే, వాటిని వెంటనే కొత్త అకౌంట్‌కు మార్చుకోండి.
- స్టేట్‌మెంట్ డౌన్‌లోడ్: అకౌంట్ క్లోజ్ అయిన తర్వాత మీరు లావాదేవీల వివరాలు పొందలేరు. కాబట్టి గడిచిన ఏడాదికి సంబంధించిన స్టేట్‌మెంట్‌ను డౌన్‌లోడ్ చేసి ఉంచుకోండి.
బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసే విధానం (Step-by-Step)
చాలా బ్యాంకులు ఖాతా మూసివేతకు బ్రాంచ్‌కు వెళ్లాలని సూచిస్తాయి. ఆ ప్రక్రియ ఇలా ఉంటుంది:
- క్లోజింగ్ ఫారమ్: మీ హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి 'అకౌంట్ క్లోజర్ ఫారమ్' (Account Closure Form) అడగండి.
- వివరాలు నింపండి: మీ పేరు, అకౌంట్ నంబర్ , ఖాతాను ఎందుకు మూసివేస్తున్నారో కారణాన్ని అందులో పేర్కొనండి.
- కార్డ్ , చెక్ బుక్ సమర్పణ: మీ డెబిట్ కార్డ్ (ATM Card), ఉపయోగించని చెక్ బుక్ లీవ్‌లను బ్యాంకుకు తిరిగి అప్పగించాలి. కొన్ని బ్యాంకులు వీటిని మీ ముందే కట్ చేయమని కోరతాయి.
- గుర్తింపు కార్డు: మీ ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ కాపీని జత చేయాల్సి ఉంటుంది.
అకౌంట్ క్లోజింగ్ ఛార్జీలు ఉంటాయా?
సాధారణంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన 14 రోజుల్లోపు మూసివేస్తే ఎలాంటి ఛార్జీలు ఉండవు. అలాగే ఏడాది దాటిన తర్వాత క్లోజ్ చేసినా చాలా బ్యాంకులు ఫీజు వసూలు చేయవు. కానీ, అకౌంట్ ఓపెన్ చేసిన 15 రోజుల నుండి ఒక సంవత్సరం లోపు క్లోజ్ చేస్తే బ్యాంక్ నిబంధనల ప్రకారం కొంత మొత్తం (సుమారు రూ. 200 నుండి రూ. 500 వరకు) ఛార్జీగా వసూలు చేస్తారు.
ఆన్‌లైన్‌లో క్లోజ్ చేయవచ్చా?
ప్రస్తుతం కొన్ని ప్రైవేట్ బ్యాంకులు తమ మొబైల్ యాప్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా అకౌంట్ క్లోజింగ్ రిక్వెస్ట్ పెట్టే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. అయితే సెక్యూరిటీ కారణాల దృష్ట్యా మెజారిటీ బ్యాంకులు ఫిజికల్ అప్లికేషన్‌ను మాత్రమే ఆమోదిస్తున్నాయి. కాబట్టి అకౌంట్ క్లోజింగ్ విషయంలో మీ బ్యాంక్ వెబ్‌సైట్‌ను ఒకసారి చెక్ చేయడం లేదా కస్టమర్ కేర్‌కు కాల్ చేయడం మంచిది.
పైన పేర్కొన్న జాగ్రత్తలు పాటిస్తూ మీ పాత బ్యాంక్ ఖాతాను మూసివేస్తే, అనవసరమైన ఛార్జీల నుండి తప్పించుకోవచ్చు , మీ క్రెడిట్ స్కోరుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూసుకోవచ్చు.


Click it and Unblock the Notifications