ఈ రోజుల్లో ప్రతి చిన్న అవసరానికి బ్యాంక్‌కు వెళ్లడం లేదా ఏటీఎం కోసం వెతకడం కష్టమైన పని. సాంకేతికత పెరిగిన తర్వాత మన చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్ ద్వారానే సెకన్ల వ్యవధిలో బ్యాంక్ బ్యాలెన్స్ తనిఖీ చేసుకునే వెసులుబాటు వచ్చింది. ఇంటర్నెట్ ఉన్నా లేకపోయినా, స్మార్ట్‌ఫోన్ ఉన్నా లేదా సాధారణ ఫీచర్ ఫోన్ ఉన్నా.. మీ అకౌంట్ వివరాలు తెలుసుకోవడం ఇప్పుడు చాలా సులభం. బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం( how to check bank balance) కోసం రకరకాల మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. యూపీఐ (UPI) ద్వారా తక్షణమే..
ప్రస్తుతం దాదాపు అందరూ Google Pay, PhonePe లేదా Paytm వంటి యూపీఐ యాప్‌లను వాడుతున్నారు. వీటి ద్వారా బ్యాలెన్స్ చూడటం అత్యంత సులభం.
- ముందుగా మీ యూపీఐ యాప్ ఓపెన్ చేయండి.
- పైన ప్రొఫైల్ పిక్ మీద నొక్కి.. అక్కడ 'Check Bank Balance' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- అక్కడ మీ 4 లేదా 6 అంకెల యూపీఐ పిన్ (UPI PIN) ఎంటర్ చేయగానే స్క్రీన్‌పై బ్యాలెన్స్ కనిపిస్తుంది.
2. వాట్సాప్ బ్యాంకింగ్ (WhatsApp Banking)
ప్రముఖ బ్యాంకులైన SBI, HDFC, ICICI వంటివి ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా సేవలు అందిస్తున్నాయి.
- మీ బ్యాంక్ అధికారిక వాట్సాప్ నంబర్‌ను సేవ్ చేసుకోండి.
- ఆ నంబర్‌కు 'Hi' అని మెసేజ్ పంపండి.
- అక్కడ వచ్చే ఆప్షన్లలో 'Account Balance' ఎంచుకుంటే మీ వివరాలు వెంటనే మెసేజ్ రూపంలో వస్తాయి. లేదా అకౌంట్ బ్యాలెన్స్ (Account Balance) అని మెసేజ్ చేసి కూడా బ్యాలెన్స్ మొత్తాన్ని తెలుసుకోవచ్చు.
3. మిస్డ్ కాల్, ఎస్ఎంఎస్ (SMS) సేవలు
మీ దగ్గర ఇంటర్నెట్ లేనప్పుడు ఈ పద్ధతి బాగా పనిచేస్తుంది. ప్రతి బ్యాంక్ ఒక ప్రత్యేకమైన మిస్డ్ కాల్ నంబర్‌ను కలిగి ఉంటుంది.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి సదరు బ్యాంక్ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి.
- కాల్ ఆటోమేటిక్‌గా కట్ అయి, కొద్దిసేపటికే మీ బ్యాలెన్స్ వివరాలతో కూడిన ఎస్ఎంఎస్ వస్తుంది.
- అలాగే 'BAL' అని టైప్ చేసి బ్యాంక్ ఇచ్చిన నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపడం ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు.
4. నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్స్
మీరు కంప్యూటర్ వాడుతున్నట్లయితే నెట్ బ్యాంకింగ్ ఉత్తమ మార్గం.
- బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ యూజర్ ఐడి, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
- డాష్‌బోర్డ్‌లోనే మీ అకౌంట్ బ్యాలెన్స్ కనిపిస్తుంది.
- బ్యాంక్ యొక్క అఫీషియల్ మొబైల్ యాప్ (ఉదాహరణకు SBI YONO) ద్వారా కూడా వివరాలు సులభంగా పొందవచ్చు.
5. ఐవీఆర్ఎస్ (IVRS) కాల్ ద్వారా
బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేసి కూడా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
- మీ మొబైల్ నుండి బ్యాంక్ టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి.
- సూచనల ప్రకారం భాషను ఎంచుకుని, మీ అకౌంట్ వివరాలు లేదా డెబిట్ కార్డ్ వివరాలు ఎంటర్ చేస్తే, కంప్యూటర్ వాయిస్ ద్వారా బ్యాలెన్స్ వినవచ్చు.
మొత్తంగా.. ఆన్‌లైన్‌లో మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ను తనిఖీ చేయడం వల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, మీ ఖర్చులపై అవగాహన కూడా ఉంటుంది. అయితే ఈ ప్రక్రియలో భద్రత కూడా ముఖ్యమే. మీ పిన్ (PIN) లేదా పాస్‌వర్డ్‌లను ఎవరికీ చెప్పకండి , అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకండి. పైన పేర్కొన్న పద్ధతుల్లో మీకు నచ్చిన, సులభమైన పద్ధతిని ఎంచుకుని మీ బ్యాంకింగ్ వ్యవహారాలను స్మార్ట్‌గా మార్చుకోండి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్‌లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications